దాసరికి దాదా సాహెబ్ ఫాల్కేను దూరం చేసిందేవరో తెలుసా?

mohanrao
dasari

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దాసరికి ద‌క్కాల్సి ఉండ‌గా, ఆయ‌న‌కు ద‌క్క‌క‌పోవ‌టంపై కార‌ణాలు ఇప్పుడు రిలీవ్ అవుతున్నాయి.

తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం మ‌రువ‌లేనంత ఎత్తుకు ఎదిగిన గొప్ప వ్య‌క్తి ద‌ర్శ‌క ర‌త్న‌ దాస‌రి .నారాయ‌ణ‌రావు. ఆయ‌న‌ ఇక‌లేరు. తెలుగు చిత్ర సీమ‌ను శోక స‌ముద్రంలో వ‌దిలి ఆయ‌న తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. ఆయ‌న జ్ఞాప‌కాలు చిత్ర ప‌రిశ్ర‌మ గుర్తుంచే విధంగా ఆయ‌న వాటిని ప‌దిల ప‌ర్చుకున్నారు. అంద‌రి జీవితాల్లో అటుపోట్లు ఉన్న‌ట్లుగా ఆయ‌న జీవితంలోనూ ఉన్నాయి. చిత్ర ప‌రిశ్ర‌మంలో అత్యున్న‌త‌, ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆయ‌న‌కు ద‌క్కాల్సి ఉండ‌గా ఆయ‌న జీవించి ఉండ‌గా ఆయ‌న‌కు ద‌క్క‌క‌పోవ‌టంపై కార‌ణాలు ఇప్పుడు రిలీవ్ అవుతున్నాయి.

1942 సంవత్సరం మే 4న పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో జన్మించారు దాసరి నారాయణరావు. మహాలక్ష్మి, సాయిరాజ్ ఆయన తల్లిదండ్రులు. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే నాటక పోటీలలో పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నారు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగస్థల నటుడిగా, నాటక రచయితగా గుర్తింపు పొందారు దాసరి. ఇక దాసరికి పద్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


నాటక రంగం నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన దాసరి నారాయణరావు ఆదుర్తి సుబ్బారావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆదుర్తి వద్ద పనిచేసిన కె.విశ్వనాథ్, కె.బాలచందర్, రాఘవేంద్రరావు వంటి వారికి భిన్నంగా రాణించారు దాసరి. ‘తాత మనవడు’ (1973) చిత్రంతో దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు దాసరి నారాయణరావు. వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్షం చేయకుండా ఆదరించాలని ఇప్పుడు మనము అనుసరించిన మార్గాన్నే భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఆచరిస్తారని చెప్పే సందేశాత్మక చిత్రమిది. కె.రాఘవ నిర్మించిన ఈ చిత్రంలో ఎస్వీ రంగారావు, అంజలీ దేవి, రాజబాబు, విజయనిర్మల, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో తొలి చిత్రంతోనే దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఎంతో పేరు, ప్రఖ్యాతులు లభించాయి.

అటువంటి గొప్ప వ్యక్తి దర్శకరత్న దాసరి . సామాన్యునిగా సినీ రంగంలోకి ప్రవేశించిన దాసరి తన ప్రతిభాపాటవాలతో అసమాన్యునిగా ఎదిగారు. తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. సినీ దర్శకుడిగా, నిర్మాతగా, మాటల రచయితగా, నటునిగా దాసరి భారత దేశ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ బుక్‌లో స్థానాన్ని సంపాదించుకున్నారు. 151 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా 2 జాతీయ, 9 నంది, 4 ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. కానీ సినిమా రంగంలో ప్ర‌తిష్ట‌త్మ‌క‌మైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మాత్రం దాస‌రికి ద‌క్క‌లేదు. అదో లోటుగానే మిగిలి పోయింది.
అయితే దాస‌రికి దాదా పాల్కే అవార్డు ద‌క్క‌క‌పోవ‌టానికి కార‌ణం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ ప్ర‌ముఖ న‌టుడ‌ని సాక్షి టీవీలో చ‌ర్చలో పాల్గొన్న విజ‌య్ బాబు ప్ర‌స్తావించారు. అయితే ఆయ‌న పేరు వెల్ల‌డించ‌టానికి ఇష్ట‌ప‌డ‌లేదు. కార‌ణం అడ్డుకున్నర‌న్న న‌టుడు కూడా జీవించి లేనందున ఆయ‌న పేరు వెల్ల‌డించ‌టం భావ్యం కాద‌ని ఆయ‌న నిరాక‌రించారు. కానీ అదే చ‌ర్చ‌లో పాల్గొన్న విజ‌య్ చంద‌ర్ పేరు వెల్ల‌డించాల‌ని కోరారు. కానీ ఓ కాల‌ర్ మాట్లాడుతూ త‌న‌కు తెలిసినంత వ‌ర‌కు దివంత‌గ‌త న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అని పేర్కొన్నారు. అయితే చ‌ర్చ‌లో పాల్గొన్న వారు దీన్ని ధృవీక‌రించ‌లేదు. కానీ దాదా సాహెచ్ ఫాల్కే అవార్డ‌ల‌కు ఎంపిక చేసే క‌మిటీలో స్ధానం సామాన్యుకుల ద‌గ్గ‌దు క‌దా? ఆ స్ధాయి న‌టులే స‌భ్యులుగా ఉంటారు.

అయితే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మీకు ద‌గ్గ‌కుండా అడ్డుకుంది తెలుగువారేన‌ని, ఈ విష‌యాన్ని అదే క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్న బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు దేవానంద్ స్వ‌యంగా దాస‌రికి చెప్పార‌న్నారు. దాస‌రి స‌రైన వ్య‌క్తి. అన్ని అర్హ‌త‌లు దాస‌రికి ఉన్నాయి. అవార్డు ఇవ్వాల‌ని తాము ప్ర‌తిపాదించామ‌ని తెలుగు వాళ్లే అడ్డుకుంటే తామేం చేస్తామ‌ని ఆయ‌న చెప్పిన‌ట్లుగా చ‌ర్చ‌లో పాల్గొన్న వాళ్లు వెల్ల‌డించారు.అయితే ఆయ‌న ఏ కార‌ణంతో రిజాక్ట్ చేశారో మ‌నం చెప్ప‌లేం. దాన్ని ఇప్పుడు త‌ప్పు ప‌ట్ట‌లేం. ఎవ‌రి కార‌ణాలు వారికి ఉంటాయి. అది కూడా త‌ప్పు కాదు. క‌మిటీ లో ఒక స‌భ్యుడిగా త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసే హ‌క్కు ఆయ‌న‌కు ఉంటుంది. అయితే దాసరి వంటి గొప్ప వ్యక్తులు బతికుండగా తగిన గౌరవం దక్కి ఉంటే సంతోషించే వారు కదా?

Tags : , , , , ,