`డీజే` కాపీ క్యాట్‌ అని నిరూపిస్తే 100 డాల‌ర్ల బ‌హుమానం!!

admin
dj

బ‌న్ని `డీజే` ఈనెల 23న ప్రేక్ష‌కాభిమానుల ముందుకు వ‌చ్చేస్తోంది. ఈ సినిమా ఇంట్రెస్టింగ్‌గా రిలీజ్ ముందే బోలెడ‌న్ని వివాదాల్లోకి వ‌చ్చింది.


ఇది కాపీ క్యాట్ సినిమా అని.. వేరొక సినిమాకి రీమేక్ అయినా చెప్ప‌కుండా తెర‌కెక్కిస్తున్నార‌ని వివాదాలు చెల‌రేగాయి. అంతేకాదు ఈ సినిమా లిరిక్‌లో బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రుస్తూ .. అవ‌మానిస్తూ ప‌దాలు వాడారంటూ ర‌చ్చ రచ్చ అయ్యింది. అయినా వేటికీ స‌రైన స‌మాధానాలు టీమ్ నుంచి వినిపించ‌నేలేదు. ఒక డీజే- వంద ప్ర‌శ్న‌లు.. మ‌రి వీట‌న్నిటికీ ఇదిగో స‌మాధానం.

ఫ‌లానా సినిమాలో ఆ హీరో చేసేసిందే క‌దా! అని ఎవరైనా అంటే ఆ హీరోకి ఈగో హ‌ర్ట‌వకుండా ఉంటుందా? ప‌్ర‌స్తుతం అదే స‌న్నివేశంలో ఉన్నాడుట మ‌న డీజే.. అలియాస్ బ‌న్ని. అందుకు మీడియా ముందే క్లారిటీ ఇచ్చేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడుట‌. ప్ర‌స్తుతం ఇది ట్రెండింగ్ న్యూస్‌. అయితే బ‌న్ని ఏం స‌మాధానం చెబుతాడు?

వాస్త‌వానికి డీజే సినిమాలో `బ్రాహ్మ‌ణ‌` పాత్ర‌లో బ‌న్ని క‌నిపిస్తాడు.. అని అన‌గానే వెంట‌నే ఎన్టీఆర్ `అదుర్స్‌`లో చారి పాత్ర‌ను గుర్తు తెచ్చుకున్నారంతా. దీనిపై బోలెడంత క్రిటిసిజ‌మ్ వినిపించింది. అదుర్స్ లో ఎన్టీఆర్ చారి క్యారెక్ట‌ర్‌కి ఎక్స్‌టెన్ష‌న్ ఈ రోల్ అని.. మీడియాలో విస్త్ర‌తంగా ప్ర‌చారం సాగింది. ఈ రెండు పాత్ర‌ల‌కు పోలిక‌లు చెబుతూ బోలెడ‌న్ని స్టోరీలు అల్లేశారంతా.

ఇక వేరొక క‌న్న‌డ సినిమాకి కాపీ అంటూ ప్ర‌చార‌మైంది. డీజే – ఉపేంద్ర‌ `బ్రాహ్మ‌ణ‌`కి కాపీ సినిమా అంటూ అప్ప‌ట్లో డిష్క‌స‌న్ న‌డిచింది. `డీజే- దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` ట్రైల‌ర్‌ చూడ‌గానే ఇది ఫ‌క్తు కాపీ సినిమా అని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. డీజే అచ్చం `బ్రాహ్మ‌ణ‌` సినిమాకి కాపీలా ఉందే. క‌న్న‌డ‌లో ఉపేంద్ర హీరోగా తెర‌కెక్కిన ఆ సినిమా విజువ‌ల్స్‌కి డీజే విజువ‌ల్స్‌కి పోలిక క‌నిపిస్తోందే.. అంటూ నెటిజ‌నులు ఒక‌టే ఆరాలు తీశారు. దీనిపై మీడియాలోనూ క‌థ‌నాలొచ్చాయి.

బ‌న్ని గెట‌ప్‌, ఉపేంద్ర గెట‌ప్ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. క‌న్న‌డ నుంచి తెలుగులో డ‌బ్ అయి రిలీజైన బ్రాహ్మ‌ణ చూస్తే అస‌లు నిజం తెలిసిపోతుందిలే.. అంటూ మాట్లాడుకున్నారు. ఇంచుమించు గెట‌ప్ వైజ్ కూడా ఉపేంద్ర గెట‌ప్‌లానే బ‌న్ని గెట‌ప్ ఉంద‌న్న ప్ర‌చారం సాగింది.

అయితే క‌న్న‌డ సినిమానే .. మ‌న నేటివిటీకి, బ‌న్ని ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టు హ‌రీష్ మార్పులు, చేర్పులు చేశాడన్న ప్ర‌చారం సాగింది.. ఇక‌. మన వాళ్ల బ్రాండ్ లో కామెడీ మిక్స్ చేసి జ‌నం మీదికి వ‌దిలేస్తున్నారు. క‌థ ప‌రంగా.. ఆ రెండు సినిమాల మ‌ధ్య సారూప్య‌త క‌నిపిస్తోంద‌ని అంతా చెప్పుకున్నారు.

బ్రాహ్మ‌ణ‌లో ఉపేంద్ర క‌థానుసారం మాఫియాతో యుద్ధం చేస్తాడు. ఇక `డీజే`లోనూ బ్రాహ్మ‌ణ బ‌న్ని అదే తీరుగా మాఫియాతోనే యుద్ధం చేస్తున్నాడు. అలాగే అదుర్స్‌లో చారి పాత్ర బోలెడంత కామెడీ పండించింది. చివ‌రికి ఆ పాత్ర కూడా క్లైమాక్స్‌లో ఫైటింగ్ చేస్తుంది. ఇప్పుడు అదే త‌ర‌హాలో బ‌న్ని డీజే లో కూడా సేమ్ రోల్ రిపీట్ కాబోతోంద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇది క‌చ్ఛితంగా కాపీ సినిమానే.. అంటూ ఒక‌టే విమ‌ర్శ‌లు గుప్పించారు క్రిటిక్స్‌.

ఇదంతా ఒకెత్తు అయితే.. ఇదివ‌ర‌కే ఓ ఊహించ‌ని వివాదం ముసురుకుంది. స‌నాత‌న సాంప్ర‌దాయాల‌తో ఉండే.. బ్రాహ్మ‌ణుల ఆచార వ్య‌వ‌హారాల్ని కించ‌ప‌రుస్తూ డీజే సినిమా తీశార‌న్న వివాదం ఇటీవ‌ల‌ న‌డిచింది. అప్ప‌ట్లో ఓ సినిమా విష‌య‌మై మంచు విష్ణు, బ్ర‌హ్మానందంపై బ్రాహ్మ‌ణ సంఘాలు ఓ రేంజులో విరుచుకుప‌డ్డాయి. లేటెస్టుగా అదే త‌ర‌హాలో `డీజే- దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్`పైనా బ్రాహ్మ‌ణ సంఘాలు సీరియ‌స్ అయ్యాయి.

డీజేలో “అస్మైకా యోగా- తస్మైక భోగా …“ అంటూ వచ్చే రౌద్ర స్తోత్రంలో వున్న పదాలని మిస్‌యూజ్ చేస్తూ “నమ్మకం, చెమ్మకం….“ అంటూ సాగే ప్రణయ గీతంలో అర్థ‌ర‌హితంగా ఉప‌యోగించార‌ని బ్రాహ్మ‌ణులు ఆరోపించారు. స్తోత్రాలు, శ్లోకాల‌పై క‌నీస అవగాహ‌న ఉండ‌క్క‌ర్లేదా? అంటూ లిరిసిస్ట్ సాహితీ, సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ఇద్ద‌రిపైనా విరుచుకుప‌డుతున్నారు. వెంట‌నే ఈ స్తోత్రంతో రాసుకున్న ప‌దాల్ని తొల‌గించాల్సిందేనని బ్రాహ్మ‌ణ సంఘాలు ప‌ట్టుబ‌డుతున్నాయిట‌. ఒక‌వేళ తొల‌గించ‌క‌పోతే కోర్టుకు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. మేం న‌మ్మే.. మేం ఆచ‌రించే శ్లోకాల్ని, స్తోత్రాల్ని అగౌర‌వ‌ప‌రిచే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని బ్రాహ్మ‌ణ సంఘాలు క్లారిటీనిచ్చాయి.

అయితే ఇలాంటి వాటిపై `డీజే` ప్ర‌మోష‌న్స్‌లో మీడియా నుంచి ఊహించ‌ని ప్ర‌శ్న‌లు త‌న‌కి ఎదుర‌వుతాయ‌ని ఊహించిన బ‌న్ని ముందే ఆన్స‌ర్స్‌ ప్రిపేర్ చేసుకున్నాడుట‌. అస‌లు చారి పాత్ర‌తో డీజే బ్రాహ్మ‌ణ పాత్ర ఎలా డిఫ‌రెంటో వివ‌ర‌ణ ఇస్తాడుట‌.

ఒక ర‌కంగా .. అదుర్స్‌, బ్రాహ్మ‌ణ సినిమాలు డీజేలో క‌నిపించినా.. వాటిని తెలివిగా మ‌న హ‌రీష్ మార్చేసే ఉండొచ్చు. పైగా ఎన్టీఆర్ యాక్సెంట్ వేరు.. బ‌న్ని యాక్సెంట్ వేరు. గెట‌ప్పులే ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. `మారుతున్న ట్రెండుకు త‌గ్గ‌ట్టే .. నేటి కాలానికి త‌గ్గ‌ట్టే… ప‌క్క పాపిడి తీశాను చూస్కోండి అని పోలిక చేబుతాడేమో? బ‌న్ని. ఇక డీజేలో బ్రాహ్మ‌ణ ప‌క్కా ఫైటింగ్ బ్రాహ్మ‌ణ అని టీజ‌ర్లు చెప్పేశాయి. ఇలా వంద ప్ర‌శ్న‌లు వేస్తే డీజే స‌మాధానం చెప్ప‌డానికి రెడీ అని అర్థ‌మ‌వుతోంది.

డీజే పై వంద ప్ర‌శ్న‌లు సంధించాల్సి వ‌స్తే.. మీరైతే ఎలాంటి ప్ర‌శ్న‌లు సంధిస్తారు? ఆప్ష‌న్ ఆడియెన్‌దే.. అదుర్స్ చారితో డీజేని పోలుస్తారా? ఉపేంద్ర బ్రాహ్మ‌ణ‌తో పోలిక‌లు వెతుకుతారా? బ‌్రాహ్మ‌ణ గెట‌ప్పుల్లో పోలిక చెబుతారా? అంతా మా న్యూస్‌మార్గ్ – జ‌న‌తా వీడియోస్ వ్యూయ‌ర్స్‌కే వ‌దిలేస్తున్నాం. మీరైతే ఎలాంటి ప్ర‌శ్న‌లు సంధిస్తారు? ఛాయిస్ మీదే.. స‌రిగ్గా వారం ఉంది రిలీజ్‌కి.. 23 జూన్‌… టిల్ దెన్ వెయిట్‌..

Tags : , , , , , , , , , , , , , , , ,