వెంకీతో `గోల్‌మాల్‌` అంటున్న యంగ్ డైరెక్ట‌ర్‌!! | Young Director Do Golmaal With Victory Venkatesh

admin
venky

Young and talented director Anil Ravipudi scored three blockbusters in a row and is now one of the most prominent young directors of Telugu cinema.Click on the below video to know more details of Young Director Do Golmaal With Victory Venkatesh

బాలీవుడ్‌లో గోల్‌మాల్ సిరీస్ ఎంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌రో తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే మూడు సినిమాలొచ్చాయి. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో `గోల్‌మాల్ ఎగైన్‌` ఇటీవ‌లే రిలీజై 300 కోట్లు వ‌సూలు చేసింది. 2017 నంబ‌ర్ వ‌న్ బాక్సాఫీస్ హిట్‌గా సంచ‌ల‌నం సృష్టించింది. అందుకే ఆ సిరీస్ త‌ర‌హాలో అదిరిపోయే సినిమాలు తీసేందుకు టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారుట‌. విక్ట‌రీ వెంక‌టేష్ తో యంగ్ ట్యాలెండెడ్ హీరోల్ని క‌లుపుకుని గోల్‌మాల్ త‌ర‌హా ఫ్రాంఛైజీని ర‌న్ చేయాల‌ని స‌ద‌రు ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నాడుట‌.

అసలే వ‌రుస విజ‌యాల‌తో స్పీడ్‌మీదున్న‌ అనీల్ రావిపూడి అనుకున్నంతా చేయ‌గ‌ల‌డ‌నే అనిపిస్తోంది. కామెడీ టైమింగ్ ప‌క్కాగా తెలిసిన ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కుడిగా .. మినిమం గ్యారెంటీ ద‌ర్శ‌కుడిగా.. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో స్టాంప్ వేశాడు. రీసెంటుగానే `రాజా ది గ్రేట్‌` రూపంలో దిల్‌రాజు కాంపౌండ్‌లో అదిరిపోయే హిట్ న‌మోదు చేసి స‌త్తా చాటాడు. కోల్పోయిన మాస్‌రాజా ర‌వితేజ ని తిరిగి ఫామ్‌లోకి తెచ్చేశాడు. ప‌టాస్‌తో క‌ళ్యాణ్ రామ్‌కి, సుప్రీమ్‌తో సాయిధ‌ర‌మ్‌కి, రాజా ది గ్రేట్‌తో మాస్ రాజాకి కంబ్యాక్ మూవీస్ ఇచ్చాడ‌నే చెప్పాలి. అందుకే అనీల్ రావిపూడి కోసం నిర్మాత‌లంతా సూట్‌కేసుల‌తో క్యూటో నించుంటున్నారుట‌.

కానీ అనీల్ రావిపూడి తెలివైన అడుగులు వేస్తున్నాడు. ఈసారి కామెడీని పెద్ద లెవ‌ల్‌లో స‌క్సెస్ చేయ‌గ‌ల స‌త్తా ఉన్న ట్యాలెంటెడ్ వెంకీకి క‌థ వినిపించి ఓకే చేయించుకున్నాడు. వెంకీతో యువ‌హీరోల్ని క‌లుపుతూ బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సిరీస్ `గోల్‌మాల్` త‌ర‌హాలో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి `ఎఫ్‌-2` అనే టైటిల్‌ని నిర్ణ‌యించార‌ని నిన్న‌టిరోజున ప్ర‌చార‌మైంది. ఎఫ్‌2 అంటే `ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్`. ఫ‌న్‌తో పాటు ఫ్ర‌స్ట్రేష‌న్ ఏంటో తెర‌పైనే చూడాలిట‌. వెంకీతో అనీల్ రావిపూడి గ‌తంలో `మ‌సాలా` అనే చిత్రానికి ర‌చ‌యిత‌గా ప‌ని చేశారు. ఆ సినిమాలో వెంకీ ప‌లికిన వ‌చ్చీ రాని ఇంగ్లీష్ డైలాగులు అనీల్ రావిపూడి రాసిన‌వే. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.. పైగా ఇత‌ర యువ హీరోల్ని త‌న లైన్‌లోకి తెచ్చుకుని భారీగా మ‌ల్టీస్టారర్లు ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మే. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మారుతున్న ట్రెండ్ దృష్ట్యా ఈ యంగ్ డైరెక్ట‌ర్ ఆలోచ‌న‌ను స‌మ‌ర్ధించాల్సిందే.

Tags : , , , , , , , , , , , , , , ,