అవ‌తార్‌, టెర్మినేట‌ర్‌ క‌థ‌లు ఎలా పుట్టాయి?

క‌లల్లోంచి క‌ల‌ల్లోకి వెళ్ల‌డం.. దోచుకోవ‌డం ఎలానో క్రిస్టోఫ‌ర్ నోలాన్ `ఇన్‌సెప్ష‌న్‌`లో చూపించాడు. కానీ క‌ల‌లు గ‌ని ఆ క‌ల‌ల్లోంచి క‌థ‌లు ఏరుకోవ‌డం ఎలానో ఎవ‌రూ చెప్ప‌లేదు. క‌ల‌ల్లోంచి పుట్టిన క‌థ‌ల‌తో ల‌క్ష‌ల కోట్లు సంపాదించ‌గ‌ల‌మ‌ని కూడా మ‌న‌కు ఎవ‌రూ చెప్ప‌నేలేదు. అయితే అస‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధిస్తున్న కొన్ని సినిమాలు కేవ‌లం క‌ల‌ల్లో పుట్టిన‌వేన‌ని తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోక మాన‌రు. జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన సంచ‌ల‌నాలు అవ‌తార్‌, టెర్మినేటర్ సినిమాలు క‌ల‌ల్లోంచి పుట్టిన‌వే. ఆయా స‌న్నివేశాల‌కు స్ఫూర్తినిచ్చింది ఆయ‌న క‌న్న క‌ల‌లేన‌న్న నిజం తెలిస్తే ఔరా అనకుండా ఉండ‌లేం.

ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గ‌ర్ క‌థానాయ‌కుడిగా కామెరూన్ ద‌శాబ్ధాల క్రిత‌మే తెర‌కెక్కించిన టెర్మినేట‌ర్ ఇప్ప‌టికీ ఓ సంచ‌ల‌న‌మే. ఆ సిరీస్ సినిమాలు బుల్లితెర‌పై ఇప్ప‌టికే కొన్ని వేల సార్లు లైవ్ అయ్యాయి. ఇప్ప‌టికీ అదే ఆద‌ర‌ణ ద‌క్కుతోంది కూడా. అయితే అంత‌టి క్రేజీ సిరీస్ ఎలా పుట్టింది? దానికి ఇన్‌స్పిరేష‌న్ ఏంటి? అని ప్ర‌శ్నిస్తే.. ప‌క్కాగా ఆ సీక్రెట్ రివీల్ చేశారు కామెరూన్‌.

టెర్మినేట‌ర్ పూర్తిగా కామెరూన్ క‌ల‌ల్లోంచి పుట్టిన‌ది. ఓ మిడ్‌నైట్ అత‌డు ఓ భ‌య‌పెట్టే పీడ‌క‌ల క‌న్నాడుట‌. క‌ట్ చేస్తే ఆ క‌ల‌నే క‌థ‌గా రాసుకున్నాడు. ఓ చిన్న స్ఫూర్తి నుంచి అసాధార‌ణ‌మైన క‌థ‌లు పుట్టాయి. అవి ఏకంగా ప్ర‌తిష్ఠాత్మ‌క సిరీస్‌గా రూపాంత‌రం చెంది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల కోట్లు కొల్ల‌గొట్టే బృహ‌త్త‌ర ప్రాజెక్టుగా అవ‌త‌రించింది. ప్ర‌స్తుతం ఈ ఫ్రాంఛైజీలో అవ‌తార్ 2, అవ‌తార్ 3, అవ‌తార్ 4 సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. 2018లో అవ‌తార్ -2 రిలీజ్ కానుంది.

ఇక అవ‌తార్ క‌థ‌ల‌కు సైతం కామెరూన్ త‌ర‌చుగా క‌ల‌ల్లో అడ‌వులు ద‌ర్శ‌న‌మివ్వ‌డ‌మేన‌ట‌. అత‌డి క‌ల‌ల్లో ఎప్పుడూ ద‌ట్ట‌మైన అడ‌వులు క‌నిపించేవిట‌. ఆ ర‌కంగానే పండోరా గ్ర‌హాన్ని అత‌డు ఆవిష్క‌రించాడు. అవ‌తార్ రూపాల్ని క్రియేట్ చేసి సంచ‌ల‌నాత్మ‌క చిత్రం రూపొందించాడు. క్రిస్టోఫ‌ర్ నోలాన్ `ఇన్‌సెప్స‌న్ ` స్టోరీ సైతం అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వేరొక‌రి క‌ల‌ల్లోకి ప్ర‌వేశించి అత‌డి సంగ‌తుల్ని దొంగిలించ‌డం అన్నవిల‌క్ష‌ణ‌ కాన్సెప్టుతో ప్ర‌పంచాన్ని నివ్వెర‌ప‌రిచాడు. ఏదో ఒక కొత్త‌ద‌నం.. వైవిధ్యం లేనిదే సినిమాలు చూడ‌ని ఈ రోజుల్లో ఎప్ప‌టిక‌ప్పుడు నిత్య‌నూత‌న‌మైన సినిమాల్ని తెర‌కెక్కిస్తున్న ది గ్రేట్ డైరెక్ట‌ర్స్ వీళ్లంతా. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఇండియ‌న్ సినిమా, తెలుగు సినిమా సైతం కొత్త పంథాలో ప‌య‌నిస్తోంది. ఇది శుభ‌త‌రుణ‌మే.

Add your comment

Your email address will not be published.