విప‌క్షాల ముందు చిన్నబోతున్న గులాబీ బాస్‌! | Opposition Gears Up To Take On KCR Government

admin
kcr

TRS leaders are annoyed for not being one or two, but three years of hope. TRS party committees and those who are nominated in the nominated positions are losing their three years in leaku. The newly formed Telangana state has been taken up so far three TRS plenaries.click on the below video to know more details of Opposition Gears Up To Take On KCR Government

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్ల‌కు పైబ‌డిన నిరీక్ష‌ణకు టీఆర్ ఎస్ నేత‌లు ఆగ్ర‌హించిపోతున్నార‌ట‌. టీఆర్ఎస్ పార్టీ క‌మిటీలు ,అటు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయ‌డం విష‌యంలో మూడేళ్లుగా లీకులతోనే స‌రిపెడుతున్నార‌ని మండిప‌డుతున్నారట‌.నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాక ఇప్పటివరకు మూడు సార్లు టీఆర్‌ఎస్‌ ప్లీనరీలు జరిగాయి. రెండు సార్లు హైదరాబాద్‌లో, ఒకసారి ఖమ్మంలో జరిగింది. ఇందులో ప్రతీసారి టీఆర్‌ఎస్‌పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మాత్రమే జరిగింది. కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. అయితే రద్దయిన స్థానంలో ఇప్పటివరకు రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. మ‌రోవైపు పార్టీకి కీల‌క‌మైన‌ పొలిట్‌బ్యూరోను కూడా నియమించలేదు. నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం రానివారికి పార్టీ పదవుల్లో అవకాశం కల్పిస్తానని కేసీఆర్‌ నేతలకు ఆశ కల్పించారు. టీడీపీ, కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ సహ మరికొన్ని పార్టీల నుంచి కొంతమంది నేతలు టీఆర్‌ఎస్‌పార్టీలో చేరారు.

నేతలు ఎక్కువమంది కావడంతో తమ నిర్మాణం కూడా నిర్మాణం కూడా అటకెక్కింది అని సీనియర్లు అభిప్రాయపడ్డారు.మ‌రోవైపు జిల్లా క‌మిటీల విష‌యంలోనూ ఇదే తీరు కొన‌సాగుతోంది. జిల్లాల విభజన కాకముందు పాత జిల్లాల్లో కమిటీలు వేసినా, ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కమిటీలు నియామకం జరగలేదని ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న జిల్లాలు కావడంతో అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి సీనియర్‌ నేతలు సుముఖత చూపలేదు. అందులో కొంతమందికి నామినేటెడ్‌ పదవులు వరించగా, వాటికోసం మరికొందరు ఎదురుచూస్తున్నారు. దీంతో జిల్లా కమిటీలను కేసీఆర్‌ రద్దు చేశారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేను ఇన్‌ఛార్జీగా పెట్టి కమిటీలు వేయాలని కేసీఆర్‌ భావించినా, అవి కూడా ముందుకు సాగడం లేదు. గ్రామ కమిటీలు కూడా అస్తవ్యస్థంగా ఉన్నాయని అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం ఇప్ప‌టికే అన్ని జిల్లాల క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకోగా టీడీపీ క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ అక్టోబ‌ర్ త‌రువాత క‌మిటీల‌ను నిమిస్తామ‌ని చెబుతోంది. అన్ని పార్టీలు భాగానే ఉన్నా అధికార పార్టీలో ఇలా ఉండటం ఏంట‌ని నేత‌లు వాపోతున్నార‌ట‌. అధికార పార్టీలో ఉన్నా క‌నీసం పార్టీలో బాధ్య‌త ఏంటో కూడా తెలియ ఇత‌ర పార్టీల నేత‌ల ముందు చిన్న‌బోవాల్సి వ‌స్తుంద‌ని బాధ‌ప‌డుతున్నార‌ట‌. ఇదిలా ఉంటే నియోజకవర్గ జాబితాలు సిద్ధంగానే ఉన్నాయని, రాష్ట్ర కార్యవర్గం కూర్పు జరగాల్సి ఉందని, పైగా ముహూర్తం కోసం కేసీఆర్‌ చూస్తున్నారని పార్టీలోని కేసీఆర్ స‌న్నిహిత‌వ‌ర్గాలు అంటున్నాయి. ఏది ఏమైన విప‌క్షాల ముందు అధికార ప‌క్షం ఇలా చిన్న‌బోవ‌డం మాత్రం పార్టీ నేత‌ల‌కు న‌చ్చ‌డంలేద‌ట‌. మ‌రి గులాబీ బాస్ దీనిపై ఎలా స్పందిస్తారో..?

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,