ఏపీలో 60 మినీ జిల్లాలు!

surendra a
cbn

కేసీఆర్ బాట‌లోనే చంద్ర‌బాబు వెళుతున్నారు? ఏపీలో మినీ జిల్లాల ప్లాన్ అమ‌లు చేయ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాచారం.

ఇటీవ‌లే తెలంగాణ రాష్ట్రం కొత్త జిల్లాల విభ‌జ‌న‌ను దిగ్విజ‌యంగా పూర్తిచేసింది. ప్ర‌తి ప‌క్షాలు పోరుపెట్టినా… కొంత మంది నుంచి వ్య‌తిరేక వ్య‌క్త‌మైనా.. కేసీఆర్ సీత‌య్య‌లా ముందుకెళ్లిపోయారు. తెలంగాణ‌లో ఉన్న 10 జిల్లాల‌ను 31 జిల్లాలుగా విభ‌జించ‌డం జ‌రిగింది. ఇక ఇప్పుడు కొత్త‌గా ఏర్పాటైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ వంతు వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 60 మినీ జిల్లాల‌గా రాష్ట్రాన్ని వికేంద్రీక‌రించ‌డానికి రంగం సిద్దం చేస్తున్నారు. రెవెన్యూ డివిజ‌న్ కేంద్రంగా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అమ‌లు తీరును ప‌ర్య‌వేక్షించాల‌ని భావిస్తున్నారు.

దీంతో ఆర్డీవోల పాత్ర మ‌రింత కీల‌కం.. విస్తృతం కానుంది. ఇంచుమించుగా క‌ల‌క్ట‌రేట్ లానే ప‌థ‌కాలు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు రెవెన్యూ డివిజ‌న్ లోనే జ‌ర‌గాల్సి ఉంటుంది. అయితే ఏపీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇలాంటివ‌న్నీ సాధ్య‌మ‌వుతాయా? లేదా? అన్న‌ది అమలులోకి వ‌స్తే త‌ప్ప తెలీదు. ప్ర‌స్తుతం బాబు మాత్రం మినీ జిల్లాల ఏర్పాటుపై జోరుగా పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది.

Tags : , , , , , , , , ,