యూపీ మ‌ళ్లీ మొద‌టి కొచ్చిన ఎస్పీలో కుటుంబ వ్య‌వ‌హారం

mohanrao
akhil

యూపీలో మ‌ళ్లీ మూల‌యంసింగ్ యాద‌వ్ కుటుంబంలో నెల‌కున్న విభేదాలు మ‌రోసారి వీధిన ప‌డ్డాయి. దీంతో యుపిలో అధికార సమాజ్‌వాది పార్టీలో కలహం ముదిరింది.

పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించిన 325 మంది అభ్యర్థుల జాబితాలో పేర్లులేని ఎంఎల్‌ఎలతో, పార్టీ నాయకులతో, కార్యకర్తలతో ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గురువారం సమావేశమయ్యారు. రాత్రి పొద్దుపోయాక 235 మందితో సొంత జాబితా విడుదల చేశారు. వారి ఆవేదనను, తన నిరసనను తన తండ్రి ములాయం సింగ్‌కు తెలియజేశారు. అంతేకాక వారందరికీ తాను సొంతగా టికెట్లు ఇస్తానని అంతకుముందు కొంతమంది విశ్వసనీయులకు తెలిపారు. టికెట్లు దక్కని ఎంఎల్‌ఎలంతా తమ తమ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం చేసుకోవాలని ఆయన పురమాయించారు. దీంతో అఖిలేశ్ సొంత కుంపటి పెడుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. గురువారం లక్నోలో ఉదయం నుంచే రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ములాయం, శివపాల్, అఖిలేశ్‌ల నివాసాల వద్ద పెద్దసంఖ్యలో సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు,

ఎంఎల్‌ఎలు గుమి గూడారు.అభ్యర్థుల ఎంపిక లో తనను పూర్తిగా పక్కన బెట్టడం పట్ల అఖిలేశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు అత్యంత సన్నిహితులైన వారికి కూడా టికెట్లు దక్కక పోవడం పట్ల, సోదరుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శివపాల్‌యాదవ్‌తో కలసి మొత్తం 325 నియోజకవర్గాలకు అభ్యర్థులను ములాయం ప్రకటించడం పట్ల అఖిలేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా జాబితాలో 176 మంది ఎంఎల్‌ఎలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రికి సన్నిహితులైన మంత్రులు రాంగోవింద్ చౌదరి,పవన్ పాండే, అరవింద్ సింగ్ గోప్‌లతో పాటు యాభై మంది ఎంఎల్‌ఎల పేర్లు ములాయం జాబితాలో లేవు. దీంతో ఎస్‌పి చీలిపోవడం ఖాయమనే వార్తలు వెలువడుతున్నాయి. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప యుపిలో ఎస్‌పిని కాపాడే వారెవరూ లేరంటున్నారు. అయితే ఇదంతా తప్పని ముఖ్యమంత్రి సొంత కుంపటి పెట్టడంలేదని మరికొందరంటున్నారు. టికెట్లు రాని అభ్యర్థుల గురించి ములాయం దృష్టికి తీసుకువెడతానని అఖిలేశ్ అంటున్నారు.

Tags : , , , , , , ,