తూర్పులో చంద్ర‌బాబుకు చేదు అనుభ‌వం! | AP CM Chandrababu Naidu IRRITATED by AP Students

admin
east

Election promises continue to haunt the AP CM Chandrababu Naidu. Chandrababu Naidu has given many promises to all sections of the party to win in the last election.click on the below video to know more details AP CM Chandrababu Naidu IRRITATED by AP Students

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడ్ని ఎన్నిక‌ల వాగ్దానాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో గెల‌వ‌టం కోసం చంద్ర‌బాబు నాయుడు అన్ని వ‌ర్గాల‌కు ఇబ్బ‌డిముబ్బ‌డిగా అనేక వాగ్దానాలు చేసేశారు.

అయితే అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు దాటినా కూడా చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాల అమ‌లుపై శ్ర‌ద్ద పెట్ట‌క‌పోవ‌టంతో ఆయ‌న్ని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు నాయుడుకి ఇటువంటి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. ఏం జ‌రిగిందంటే..

తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో జ‌ల‌సిరి కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న రాజ‌మండ్రి ఎన్ ఎస్ పీ కెనాల్ వ‌ద్ద జ‌ల హార‌తి ఇచ్చారు. ఆ త‌ర్వాత సీఐడీ, అర్బ‌న్ ఏస్పీ, పుర‌పాల‌క భ‌వ‌న స‌మూదాయ‌ల‌ను ప్రారంబోత్స‌వం చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స‌ర్కార్ జ‌ల‌సిరిపై చేప‌ట్టిన కార్య‌క్ర‌మంపై ప్ర‌తిజ్ఞ చేయించ‌టానికి పూనుకున్నారు. చంద్ర‌బాబు నాయుడు ఈ ప్ర‌తిజ్ఞ‌కు ఉప‌క్ర‌మించే స‌మ‌యంలో ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న యువ‌త చంద్ర‌బాబు నాయుడుపై నినాదాలు చేశారు. బాబూ జాబు ఏదంటూ పెద్ద ఎత్తున నినాదాలు మొద‌లు పెట్టారు. జ‌ల‌సిరి ప్ర‌తిజ్ఞ‌లో ఈ నినాదాలు మారుమ్రోగాయి. దాంతో చంద్ర‌బాబు నాయుడు త‌న స‌హ‌జ ధోర‌ణిలోకి వెళ్లిపోయారు. నినాదాలు చేస్తున్న వారిపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మీరు క‌ష్ట‌ప‌డి చ‌దివితే రాష్ట్రంలోనే కాదు, దేశంలో, ప్ర‌పంచంలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను. కానీ నేనొక్క‌డినే క‌ష్ట‌ప‌డితే ఉద్యోగాలు రావు అంటూనే ఇలా పైపైన తిరిగితే ఉద్యోగాలు రావంటు పరుష‌మైన కామెంట్స్ చేశారు.

ఎన్నిక‌ల్లో ప్ర‌తీ ఇంటికి ఉద్యోగం ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, మూడున్న‌ర ఏళ్లు అయినా త‌మ‌కు ఉద్యోగాలు ఇవ్వ‌లేదు. ఉద్యోగాలు రాక‌పోతే నిరుద్యోగ భృతి రూ. 2 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చార‌ని ఇప్పుడు ఎందుకు ఇవ్వ‌టం లేద‌ని యూత్ చంద్ర‌బాబుని నిల‌దీశారు. దీనికి సూటిగా స‌మాధానం ఇవ్వ‌కుండా చంద్ర‌బాబు నాయుడు యూత్‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

Tags : , , , , , , , , , , , , , , , ,