టీడీపీ వెంటే కాపులు ? ముద్రగడ ఒద్దు చంద్రబాబే ముద్దు అంటున్నారా ? |Are These People SUPPORTING TDP?

admin
tdp

Everyone knows that the TKP’s grabbing victory in the by-election will be very impromptu.click on the below video for more details of Are These People SUPPORTING TDP?

నంద్యాల ఉప ఎన్నికలో గేలిచేసిన టీడీపీ కి కాకినాడ గెలుపు కూడా చాలా ఆశువుగా అందుతుంది అనే ఫీల్ అయ్యారు అందరూ.

అనుకున్నట్టు గానే సూపర్ మెజారిటీ తో టీడీపీ కాకినాడ లో కూడా తన సత్తా చాటుకుంది. అయితే టీడీపీ కి ఇక్కడ కాపుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది అని ఊహించారు విశ్లేషకులు. పైగా అదే ప్రాంతం నుంచే అదే జిల్లా నుంచే ముద్రగడ సైతం ఉద్యమం చేస్తూ ఉండగా టీడీపీ కి ఆయానే విలన్ అయ్యాడు ఆ టైం లో కానీ ఇప్పుడు రిజల్ట్ చూస్తే మాత్రం డిఫరెంట్ గా ఉంది. కాకినాడ‌లో ఆ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల సంఖ్యే ఎక్కువ‌. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఉద్య‌మం న‌డుపుతున్నది కూడా ఆ జిల్లా నుంచే.

దీంతో కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక ఫ‌లితాల‌పై ఎంతోకొంత ప్ర‌భావం ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ, కాకినాడ కార్పొరేష‌న్ ను తెలుగుదేశం గెలుచుకుంది. సాంకేతికంగా చూసుకుంటే ఇది కాపుల విజ‌య‌మే. ఎందుకంటే, ఈ ఎన్నిక‌లు తెర‌మీదికి రాగానే మేయ‌ర్ ప‌ద‌వి కాపుల‌కే అని టీడీపీ ప్ర‌క‌టించింది. అంతేకాదు, ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారికే అత్య‌ధిక స్థానాలు కేటాయించింది. నిజానికి, ప్ర‌తిప‌క్షం వైకాపా కూడా ఇదే వ్యూహం అనుస‌రించింది. అంతేకాదు, ముద్ర‌గ‌డ ఉద్య‌మానికి సంఘీభావం కూడా తెలిపింది. కానీ, చివ‌రికి గెలుపు తెలుగుదేశం పార్టీదే అయింది. దీంతో ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్న‌ది ఏంటంటే… కాపులు కూడా త‌మవెంటే ఉన్నార‌నీ, ముద్ర‌గ‌డ ఉద్య‌మం ప్ర‌భావం పెద్ద‌గా లేద‌నేది!వాస్త‌వంగా ఆలోచిస్తే.. ఆ సామాజిక వ‌ర్గం టీడీపీ వెంట ప్ర‌స్తుతం ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఉంటార‌నేది ఇప్పుడే నిర్ణ‌యించ‌లేని విష‌యం. ఎందుకంటే, రిజ‌ర్వేష‌న్ల అంశమై త్వ‌ర‌లోనే ఒక నిర్ణ‌యం ఉంటుంద‌నీ, కాపుల స‌మ‌స్య‌ల‌న్నింటికీ ప‌రిష్కారాలు క‌ల్పిస్తున్నామంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతూ వ‌స్తున్నారు. త్వ‌ర‌లోనే మంజునాథ క‌మిష‌న్ నివేదిక వ‌చ్చేస్తుంద‌నీ, రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అనుకున్న‌ట్టుగా ఈ హామీ నెర‌వేర్చ గ‌లిగితేనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా కాపుల టీడీపీ వెంటే ఉంటార‌నే అంచ‌నా వేసుకోవ‌చ్చు. కేవలం కాకినాడ ని మాత్రమె కన్సిడర్ చేసుకుని కాపుల విషయం లో లైట్ తీసుకుంటే కొంప మునుగుతుంది అంటున్నారు విశ్లేషకులు.

Tags : , , , , , , , , , , , , , , , ,