బీచ్ ల‌వ్ పెస్టివ‌ల్ ముగ్గులోకి బ్ర‌హ్మ‌ణి

mohanrao
roja

సీఎం చంద్ర‌బాబు నాయుడు కోడ‌లు, నారా లోకేష్ భార్య బ్ర‌హ్మ‌ణిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మ‌హిళా సంఘం అధ్య‌క్షురాలు, ఎమ్మెల్యే రోజా బీచ్ ల‌వ్ పెస్టివ‌ల్ ముగ్గులోకి లాగింది.

విశాఖ వేదిక‌గా బికినీ ఉత్స‌వం పేరుతో ఏపీ ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన బీచ్ ల‌వ్ దుమారం రేపుతోంది. దీనిపై ఇప్ప‌టికే మ‌హిళా సంఘాలు ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రి తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా తీవ్రంగా మండిప‌డ్డారు. అంతే కాకుండా చంద్ర‌బాబు, బార్య భువ‌నేశ్వ‌రి, కోడ‌ల బ్ర‌హ్మ‌ణిల‌ను కూడా ఈ వివాదంలోకి లాగింది. ఏపీ మ‌హిళ ప్రజాప్ర‌తినిధులను ఆమె దెబ్బి పొడిచారు. టీడీపీ మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధులు త‌న‌పైన‌, త‌మ పార్టీ నేత‌ల‌పై నోరుపారేసుకోవ‌టానికి ప‌రిమితం కాకుండా దేశ సంప్ర‌దాయ‌ల్ని, మ‌హిళ‌ను కించే ప‌ర్చే విధంగా నిర్వ‌హిస్తున్ బీచ్ ల‌వ్ పెస్టివ‌ల్‌ను పై స్పందించాల‌ని డిమాండ్ చేశారు. సీఎం భార్య‌, కోడ‌లు కూడా మ‌హిళ‌లే కాబ‌ట్టి వారు కూడా దీనిపై స్పందించాల‌ని రోజా డిమాండ్ చేశారు.

బీచ్ పెస్టివ‌ల్ పై బీజేపీ కూడా తీవ్రంగా విభేదించ‌ట‌మే కాకుండా పార్టీ ఎమ్మెల్యే విష్టుకుమార్ రాజు తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. అడ్డుకుంటామ‌ని కూడా హెచ్చ‌రించారు. అయితే ప్ర‌భుత్వం దీనికి ఇంకా అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 9 వేల జంట‌లు హాజ‌ర‌య్యే కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లుకు క‌నీసం నాలుగు లేదా ఐదు నెల‌ల వ్య‌వ‌ధి కావాల్సి ఉంటుంద‌ని నిర్వాహ‌కులు అంటున్నారు.

Tags : , , , , , , , ,