
In the AP, the BJP moves to build its own strength. In the last elections, TDP has stated in all the two Telugu states. The BJP, which has come to power in power and participating in the TDP, continues to be in government and state governments. But the BJP has said that it will not be tied to TDP in the next election. Click on the below video to know more details of BJP Plans To Strengthen Party in AP
ఏపీలో బీజేపీ తన సొంత బలాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతుంది. గత ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెల్సిందే.
ఉమ్మడిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలో అటు కేంద్రంలోనూ ,ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ తేల్చి చెప్పేసింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ధృవీకరించారు. అయితే ఏపీ విషయానికి వచ్చే సరిగా పార్టీ అధిష్టానం వైఖరి ఒక తీరుగానూ. పార్టీ శ్రేణుల వైఖరి మరో తీరుగా ఉందని తెలుస్తోంది. దాంతో ఏపీలో బీజేపీ నేతలు డైలమాలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కొనసాగుతుందా? లేదా ? అనే దానిపై వాళ్లు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ అగ్ర నేతలు మళ్లీ ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇటీవల అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చిన సందర్భంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ పార్టీ శ్రేణులు ముక్తం కంఠంతో అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా ఆ సమావేశంలోనే ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. క్షేత్ర స్ధాయిలో పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వారు అమిత్ షాను కోరారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయలను పరిగణలోకి తీసుకంటామని కూడా అమిత్ షా ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.
అయితే పొత్తు సంగతి ఎలా ఉన్నా పార్టీని పటిష్టం చేసుకోని పక్షంలో మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ విదిల్చే సీట్లకే పరిమితం కావాల్సి వస్తోందని పార్టీలో కొందరు నేతలు బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఏపీలో యాక్టీవ్‌గా పాల్గొంటున్న పురందేశ్వరి నేతృత్వంలోని కొందరు నేతలు పార్టీ పటిష్టం చేసుకోవటంపై దృష్టి పెట్టారంటున్నారు. గుంటూరులో బలమైన నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి నేతలు ఎన్నికల లోపు పార్టీని పటిష్టం చేసుకుంటే పొత్తు సంగతి ఎలా ఉన్నా భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పురందేశ్వరి ద్వారా ఎన్టీఆర్ కుటుంబలోని మరో నేతను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో విభేదిస్తూ టీడీపీకి దూరంగా ఉంటున్న హరికృష్టను బీజేపీకి తీసుకువస్తే రాయలసీమలో పార్టీకి కొంత బలం పెరుగుతుందని భావిస్తున్నారు. హిందూపురంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పురందేశ్వరి కి ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. ఏపీలో టీడీపీతో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా పార్టీ పటిష్టానికి కొందరు నేతలు చాపకింద నీరులా వ్యవహారాలు చక్కబెతున్నారు. ఇప్పటికే రాయలసీమపై పురందేశ్వరి దృష్టి పెట్టడం. అలాగే ఉత్తరాంధ్రలో ఐదు ఎంపీ స్ధానాలకు మురళీధరరావు ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకోటం ఇందు కోసమే అంటున్నారు. బీజేపీ యాక్షన్ ప్లాన్ మాత్రం రెండు విధాలుగా ఉంటుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అయితే పొత్తు లేకపోతే ఒంటరి పోరు . ఏదైన పార్టీ పటిష్టంగా ఉంటేనే కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ బలపడాలంటే టీడీపీ బలహీనపడటమే అని వేరే చెప్పాలా?