అమిత్ షా భరోసా …చంద్రబాబు లో జోష్ నింపుతుందా?

mohanrao
chandra

మ‌రో రెండేళ్ల‌లో సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపీలో అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ నేప‌థ్యంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ టూర్ లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ భ‌విష‌త్య్ కార్యాచ‌ర‌ణ‌పై చేసిన వ్యాఖ్య‌లు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకి పెద్ద ఊర‌ట‌గానే చెప్పాలి. అమిత్ షా మాట్లాడిన‌ట్లుగా రెండు ర‌కాల వార్త‌లు రిపోర్టు అవుతున్నాయి. ఒక వార్త ప్రకారం వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల వ‌ర‌కు టీడీపీతో పొత్తుకు ఢోకా లేద‌నేది ఆ వార్త సారాంశం. ఇక రెండో వార్త విషయానికి వస్తే రాష్ట్రప‌తి ఎన్నిక‌ల త‌ర్వాత ద‌క్షిణాదిలో చాలా ప‌రిణామాలు చోటు చేసుకోబోతున్నాయ‌నేది రెండో వార్త‌. ప్ర‌స్తుతం మ‌నం మొద‌ట వార్త‌ని ప్రామాణికంగా ప‌రగిస్తే ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా కోరుకుంటుంది కూడా అదేన‌ని భావించ‌క త‌ప్ప‌దు. క‌నీసం వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు పొత్తు కొన‌సాగితే త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, అవినీతి కుంభ‌కోణాల ఆరోపణలు లోకేష్‌పై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌పై కేంద్రం విచార‌ణ‌కు ముందుకెళ్ల‌కుండా ఏదో ర‌కంగా మేనేజ్ చేసుకోవ‌చ్చు అనే ఆశ‌తో చంద్ర‌బాబు ఉన్నారు.

న‌రేంద్ర‌మోదీతో వైఎస్ జ‌గ‌న్‌ భేటీతో నిద్ర‌కు దూర‌మైన చంద్ర‌బాబు కొత్త వ్యూహాలకు పదును పెడుతూ భవిష్యత్ పై క్లారటీ కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌టం కోసం వారం రోజులు పాటు అమెరిక‌లో ప‌ర్య‌టించి వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీకి చేరుకుని అక్క‌డ నుంచి ఎవ‌రికీ తెలియ కుండా మాయ‌మయ్యారు. 7 గంట‌లు పాటు అదృశ్య‌మ‌మ్యారు. ఎక్క‌డికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో చెప్పాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నా, సోష‌ల్ మీడియాలో సెటైర్లు మీద సెటైర్లు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న హేతుబ‌ద్ద‌మైన వివ‌ర‌ణ ఇచ్చ‌న వాళ్లే లేరు. చంద్ర‌బాబు ర‌హ‌స్యంగా 7 గంట‌లు సంచ‌రించిన‌ట్లుగానే చీక‌టి ప‌ర్య‌ట‌న‌లో కూడా ఆయ‌న పెట్టుబ‌డుల కోస‌మే ప‌ర్య‌టించారంటూ జ‌నాల చెవుల్లో పూలు పెట్టే కార్య‌క్ర‌మానికి అధికార వ‌ర్గం చేసిన ప్ర‌య‌త్నం మ‌రింత న‌వ్వుల పాల‌య్యింది. ఆ స్ధాయి విమ‌ర్శ‌ల‌ను కూడా భ‌రిస్తూ చంద్ర‌బాబు నాయుడు కిక్కురు మ‌న‌కుండా ఉన్నారంటే మోదీ వైఎస్ జ‌గ‌న్‌ల భేటీ త‌ర్వాత బాబుకి టెన్ష‌న్ ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ ప‌రిస్థితిలో అమిత్ షా చేసిన వ్యాఖ్య‌లు చంద్ర‌బాబు నాయుడుకి ఎందుకు ఊర‌ట క‌ల్గిస్తాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో వాచ్ చేయాల్సిందే.

మోదీ జ‌గ‌న్ భేటీ నేప‌థ్యంలో స‌ర్వ సాధార‌ణంగా జ‌రిగే ఈ భేటీని టీడీపీ రాజ‌కీయం చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఈ ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. టీడీపీ నేత‌ల విమ‌ర్శ‌లు, ఇడీ కేసుల కోస‌మే జ‌గ‌న్‌ను మోదీని క‌లిసారిని సీఎం చంద్ర‌బాబు కూడా వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో మోదీకి మండిందంటున్నారు. టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై పూర్తి నివేదిక ఇవ్వాల‌ని కూడా పీఎంవోను ఆదేశించార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆ ప‌ని ఏపీలో టీడీపీతో విభేదిస్తున్న చేశార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. పీఎంవో క‌దిలిక‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌డుతున్న చంద్ర‌బాబుకి ఏం చేయాలో తోచ‌టం లేదు. మ‌రో ప‌క్క ‘ఓటుకు నోటు’ కేసు త‌రుముకొస్తోంది. మే నెలో కోర్టు సెల‌వులు కాబ‌ట్టి వ‌చ్చే నెల‌లో విచార‌ణ‌కు వ‌స్తోంది. ఇటువంటి త‌రుణంలో మోదీ చంద్ర‌బాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా వైఎస్ జ‌గ‌న్‌కు ఇవ్వ‌టం తో టీడీపీ నేత‌ల అనుమానాల‌కు ప‌గ్గాలు లేకుండా పోతున్నాయి. ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఆదుకుంటాడ‌ని భావిస్తున్న వెంక‌య్య నాయుడు కూడా నిస్సాహ‌య స్థితిలోనే ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు కొంత టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఇటువంటి త‌రుణంలో వెంక‌య్య నాయుడు కూడా రిలీఫ్ ఇవ్వ‌ని నేప‌థ్యంలో తెలంగాణ టూర్‌లో ఉన్న అమిత్ షాకు కొంత ఊర‌ట నిచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు పొత్తు కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత ప‌రిస్తితిలో చంద్ర‌బాబుకు ఇంత కంటే ఊర‌ట ఏం కావాలి?

Tags : , , , , , , , ,