చంద్ర‌బాబు అవినీతిపై పోరుకు బీజేపీ గ్రీన్ సిగ్న‌ల్‌! | BJP to Fight Against Chandrababu Corruption?

admin
chandrababu

In the AP, the TDP and the BJP parties are running a coalition government. In the last election, the tie-up tied with the BJP won the election. That bond still continues. However, recent allegations of corruption against TDP have been rampant. Everyone agrees with this. BJP leaders have also spoken openly in many cases that corruption has increased in Chandrababu Naidu government. Click on the below video to know more details of BJP to Fight Against Chandrababu Corruption?

ఏపీలో టీడీపీ, బీజేపీ పార్టీల సంకీర్ణ ప్ర‌భుత్వం న‌డుస్తున్న సంగ‌తి తెల్సిందే. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది.

ఆ బంధం ఇంకా కొన‌సాగుతుంది. అయితే ఇటీవ‌ల కాలంలో టీడీపీపై అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విష‌యాన్ని అంద‌రూ అంగీక‌రిస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయింద‌ని బీజేపీ నేత‌లు కూడా అనేక సంద‌ర్భాల్లో బ‌హిరంగంగానే మాట్లాడారు. చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ అవినీతిపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం మొద‌లు పెట్టింది. పుస్త‌కం కూడా వేసింది. ఈ నేప‌థ్యంలో గ‌త రెండ్రోజుల పాటు ఢిల్లీలో జ‌రిగిన బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశాల సంర్భంగా ఏపీ నేత‌ల‌తో పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆస‌క్తిక‌ర అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయంటున్నారు. ఏపీ బీజేపీ నేత‌లు టీడీపీ పాల‌న‌లో చోటు చేసుకుంటున్న అవినీతిని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లాగా ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశార‌ని తెలుస్తోంది. దాంతో బీజేపీ నేత‌లు కూడా ఏపీలో టీడీపీ అవినీతిపై పోరాటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

ఏపీలో చంద్ర‌బాబు నాయుడు సీఎం బాధ్య‌త‌లు చేప‌ట్టి నాటి నుంచి టీడీపీ పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్ప‌డుతూ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెల్సిందే. ఇసుక ద‌గ్గ‌ర నుంచి మొద‌లు కొని ఎక్క‌డ కాంట్రాక్ట వ‌ర్క్‌లు జ‌రిగినా క‌మిష‌న్లు చెల్లించాల్సిందే. లేని ప‌క్షంలో వారిపై దాడులు చేసిన అనేక సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న సంగ‌తి తెల్సిందే. అంతే కాకుండా ప్రాజెక్టు అంచ‌నాలు పెంపు ద‌గ్గ‌ర నుంచి ఏపీ అసెంబ్లీ, స‌చివాల‌యం తాత్కాలిక నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి పై కూడా నేత‌లు బీజేపీ నేతుల చ‌ర్చించిన‌ట్లుగా తెలుస్తోంది. పార్టీ నేత‌లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కూడా గ‌ట్టిగానే స్పందిచార‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్నంత మాత్ర‌న టీడీపీ ప్ర‌భుత్వం పాల్పుడుతున్న అవినీతిపై మౌనంగా ఉండాల్సిన అవ‌రంస లేద‌ని తేల్చి చెప్పార‌ట‌. ఏపీలో ప్ర‌తిప‌క్షం చంద్ర‌బాబు అవినీతిపై చేస్తున్న పోరాటం చేస్తున్న సంగ‌తి తెల్సిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ కూడా ఏపీ సీఎం అవినీతిపై గొంతు విప్ప‌నుంద‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల వేళ మిత్ర ప‌క్ష‌మైన బీజేపీ కూడా చంద్ర‌బాబు అవినీతిపై పోరాటానికి సిద్ద‌ప‌డ‌టంతో ఇప్పుడు టీడీపీ నేత‌లు కు ఏం చేయాలో తెలియ‌టం లేదంటున్నారు. ఏమైన రాజ‌కీయ పార్టీలు ఎప్పుడు ఒకే వైఖ‌రితో ఉండ‌వ‌ని చెప్ప‌టానికి ఇదే పెద్ద నిద‌ర్శ‌నం.

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,