అధ్యక్ష పదవికి ఆదిలోనే హంసపాదు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్ ను అధ్యక్షపీఠాన్ని అధిరోహించకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు అవసరం అవుతాయి. ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ కు అధ్యక్షుడిగా పదవిని చేపట్టాడానికి ఆరుగురు రిపబ్లికన్లు విముఖుత చూపుతున్నారు. ట్రంప్ ను వ్యతిరేకిస్తూ ఆరుగురు తిరుగుబాటుదారులు అపనమ్మక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. అంతే కాకుండా వీరు మరో 37మంది రిపబ్లికన్లను ట్రంప్ కు అనుకూలంగా ఓటు వేయొద్దని కోరుతున్నారు.
 
ఎన్నికల్లో రిపబ్లికన్లు 290 ఎలక్టోరల్ కాలేజ్ స్ధానాల్లో గెలుపొందగా, డెమొక్రాట్లు 232 స్ధానాల్లో గెలుపొందారు. 228 ఏళ్ల అమెరికా ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకూ 71మంది అధ్యక్ష అభ్యర్ధిపై తిరుగుబాటు వ్యక్తం చేస్తూ తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఎలక్టోరల్ కాలేజ్ లో ఓట్లు తక్కువైనా, రిపబ్లికన్ల ఆధిక్యం గల ‘హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’ ట్రంప్ కు అనుకూలంగా ఉండటంతో అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిష్టించడం ఖాయం.
 
‘కొలరడో’ ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్ అయిన ‘మైఖేల్ బకా’ అధ్యక్షుడిగా ట్రంప్ ను వ్యతిరేకిస్తున్న వారిలో ఒకరు. యూఎస్ మెరైన్ మాజీ ఉద్యోగి అయిన బకా, ట్రంప్ దేశాన్ని కాపాడతారనే నమ్మకం తనకు లేదని చెప్పారు. అందుకే ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు ఇతర సభ్యుల మద్దతు కూడగడుతున్నట్లు తెలిపారు. ట్రంప్ అధ్యక్ష పదవి చేపడితే అమెరికాలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుడు చెప్పారు. అందుకే ట్రంప్ ను తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎంతమంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ట్రంప్ పై అసంతృప్తిగా ఉన్నారో తెలియరాలేదు.

Add your comment

Your email address will not be published.