సీబీఐ కోర్టులో దుమ్మురేపుతున్న జ‌గ‌న్ వాద‌న‌లు! | CBI Officers Tensed For Filing Cases On YS Jagan

admin
cbi

The CBI’s Special Court will hear the cases filed against AP opposition leader YS Jaganmohan Reddy. Congress party chief Sonia Gandhi has targeted YS Jagan who came out of the Congress party in 2011. The CBI was stunned. YS Jagan’s case was filed. The wrongdoer has been detained for 16 months in jail. Click on the below video to know more details of CBI Officers Tensed For Filing Cases On YS Jagan

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై పెట్టిన కేసుల‌ను సీబీఐ స్పెష‌ల్ కోర్టు విచారిస్తున్న సంగ‌తి తెల్సిందే. 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వైఎస్ జ‌గ‌న్ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ టార్గెట్ చేశారు. సీబీఐను ఉసిగొల్పారు. దాంతో అనుకున్న‌దే త‌డ‌వుగా వైఎస్ జ‌గ‌న్‌పై కేసులు పెట్టేశారు. అక్ర‌మంగా 16 నెల‌ల పాటు జైల్లో నిర్బందించిన సంగ‌తి తెల్సిందే.

వైఎస్ జ‌గ‌న్‌పై ల‌క్ష కోట్ల అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఏపీలో ఓ వ‌ర్గం మీడియా ఏళ్ల త‌ర‌బ‌డి ప్ర‌చారం చేసింది. తీరా సీబీఐ కోర్టుకు దాఖ‌లు చేసిన ఛార్జి షీట్ల‌లో 1300 కోట్లుగా పేర్కొంది. అదీ కూడా వైఎస్ సీఎంగా ఉన్న 2004 నుంచి 2009 వ‌ర‌కు మ‌ధ్య కాలాన్ని కాకుండా ఆ త‌ర్వాత కాలాన్ని కూడా సీబీఐ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. అస‌లు కేసు మాత్రం వైఎస్ హ‌యాంలో త‌న తండ్రి అధికారాన్ని ఉప‌యోగించి వైఎస్ జ‌గ‌న్ క్వీడ్ ప్రొకో కు పాల్పడ్డార‌ని అభియోగం మోపారు. జ‌గ‌న్ తో అనేక మంది అధికారుల‌ను కూడా కేసుల్లోఇరికించారు. వాళ్ల‌ను జైల్ల‌కు పంపి ఇబ్బంది పెట్టారు. తీరా కేసు విచార‌ణ‌కు రాక ముందు అనేక మంది కోర్టుల్లో డిశ్చార్జ్ పిటిష‌న్లు దాఖ‌లు చేస్తే ఇప్ప‌టికు జ‌గ‌న్‌పై పెట్టిన 11 కేసుల్లో 8 కేసుల్లో ఛార్జిషీట్ల‌ను కోర్టు కొట్టేసింది. ఇక మిగిలిన కేసులు సీబీఐ కోర్టులో న‌డుస్తున్నాయి.

ఈ కేసు నుంచి త‌న పేరును తొలిగించాల‌ని కోరుతూ విజ‌య‌సాయిరెడ్డి, వైఎస్ జ‌గ‌న్ కూడా సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై సీబీఐ వాద‌న‌లు విన్పించింది. అయితే సీబీఐ వాద‌న‌ల్లో డొల్ల త‌న బ‌య‌ట ప‌డింది. క్విడ్ ప్రొ కో జ‌రిగిన‌ట్లుగా సీబీఐ నిరూపించాలి. హైకోర్టు క్విడ్ ప్రొ కో జ‌రిగిన‌ట్లుగా పేర్కొంటూ కేసు విచార‌ణ సీబీఐకి అప్ప‌గించింది. కానీ సీబీఐ మాత్రం కోర్టులో కొత్త వాద‌న చేసింది. త‌న కంపెనీల్లో పెట్టుబ‌డి పెట్టిన వాళ్ల‌ను జ‌గ‌న్ మోసం చేశార‌ని వాదించింది. కంపెనీ షేర్ విలువ‌ను పెంచేసి వాళ్ల‌కు చూపించార‌ని వాదించింది. ఇక్క‌డే సీబీఐ ప‌ప్పులో కాలేసింది. జ‌గ‌న్ కంపెనీల్లో పెట్టుబ‌డి పెట్టి మోస పోయిన వారిపై సీబీఐ కేసులు ఎందుకు నమోదు చేసింది?
మోస‌పోయిన వాళ్ల‌పై కేసులు పెట్టే హ‌క్కు సీబీఐకి ఉంటుందా? ఉండ‌దు. అందుకే జ‌గ‌న్ లాయ‌ర్లు సీబీఐ వాద‌న‌ల‌ను తిప్పి కొడుతున్నారు. కంపెనీ షేర్ల విలువ డెలాయిట్ ఇచ్చిన దానికి సీబీఐ క‌ట్టించిన విలువ‌కు పెద్ద తేడా లేన‌ప్పుడు మోసం అనే స‌మ‌స్య ఉత్ప‌న్నం కాదంటున్నారు. జ‌గ‌న్ ఎవ‌ర్ని మోసం చేయ‌లేదని వాళ్లు కోర్టులో బ‌లంగా వాదించారు. నిజానికి ఈ కేసులు క్విడ్ ప్రొ కో కింద న‌మోదు చేసి ఇప్పుడు సీబీఐ కొత్త వాద‌న‌ల‌ను తెర పైకి తెచ్చారు. శుక్ర‌వారం జ‌రిగిన వాద‌న‌ల్లోనూ జ‌గ‌న్ లాయ‌ర్ చేసిన వాద‌నే స‌బ‌బుగా ఉంది. నాలుగు గంట‌ల పాటు సాగిన వాద‌న‌ల త‌ర్వాత కోర్టు టైం అయిపోవ‌టంతో కేసును వ‌చ్చే నెల 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , ,