APలో కూల్చి వేత‌ల‌కు రంగం సిద్దమా? | Chandrababu Naidu To Grab More Lands From Farmers

admin
ap

Chief Minister N Chandrababu Naidu is taking the most bye-by-elections in the recent election. Power abuse, disbursement of money, separation of 144 sections of the opposing house.click on the below video to know more details of Chandrababu Naidu To Grab More Lands From Farmers

ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌లను సీఎం చంద్ర‌బాబు నాయుడు చాలా విష‌యాల్లో ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు. అధికార దుర్వినియోగం, విచ్చ‌ల విడిగా డ‌బ్బులు పంపిణీ చేయ‌టం, ప్ర‌త్య‌ర్దిని ఇంట్లో 144 సెక్ష‌న్ అమ‌లు చేయించ‌టం, స‌ర్వేల పేరుతో బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం వంటివి మాత్ర‌మే కాక ఇంకా చాలా విష‌యాల‌ను చంద్ర‌బాబు నాయుడు ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు. ఈ విష‌యం సీఎం జిల్లా క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో రాష్ట్రం అంతా భూ స‌మీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశించ‌ట‌మే దీనికి తాజా ఉదాహ‌ర‌ణ‌. నంద్యాల చంద్ర‌బాబుకు ఎలా ఆద‌ర్శం అయిందో తెలియాలంటే ఈ వీడియో సాంతం చూడండి.

ఇక నుండి రాష్ట్రమంతా భూసమీకరణ విధానాన్ని అవలంభించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అమరావతి నిర్మాణం కోసం రాజధాని ప్రాంతంలో రైతులకు చెందిన 34 వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరించిన సంగతి అందరూ చూసిందే. అదే పద్దతిని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని తాజాగా జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆదేశించారు. ఎందుకంటే, రాష్ట్రం మొత్తం మీద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్ళను నిర్మించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు భారీ ఎత్తున భూములు కావాలి. అయితే ప్రభుత్వానికి అవసరమైన భూములు అందుబాటులో లేవు. ప్రైవేటు వ్యక్తుల నుండి భూములు కొనాలంటే చాలా ఖరీదు కాబట్టి అయ్యేపని కాదు. అందుకే అవసరమైన ప్రతీచోటా భూసమీకరణ విధానాన్నే అనుసరించాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే ఆ విధానాన్ని నంద్యాలలో అమలు చేస్తున్నారు . గ‌తంలో వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో ప‌ట్టాలు పొందిన ప్ర‌జ‌లు ఆ భూముల్లో సొంత ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు అవి పూర్తి కావాలంటే రాజ‌కీయంగా టీడీపీకి స‌రెండ‌ర్ కావాల‌ని ష‌ర‌తు పెడుతున్నారు

నంద్యాలలో 13 వేల ఇళ్ళను నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే, అందుకు అవసరమైన భూముల్లేవు. కాబట్టి నంద్యాల పట్టణంలో అయులూరుమెట్ట, ఎస్ఆర్బీసీ కాలనీల్లో స్ధలాలను సమీకరించాలని నిర్ణయించింది. అయితే అప్పటికే కాంగ్రెస్ హయాంలో పట్టాలు పొందిన వారు, ఇళ్ళు నిర్మించుకున్నవారున్నారు. అయినా సరే, వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయించి, స్ధలాలను ప్రభుత్వం లాగేసుకుంది. రాష్ట్రం మొత్తం మీద భూములు సమీకరించాలని చంద్రబాబు తాజగా చెప్పటంలో బహుశా ఉద్దేశ్యం అదే కావచ్చు. కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన ఇళ్ళపట్టాలను, స్ధలాలను టిడిపి ప్రభుత్వం లాగేసుకుంటున్నారు. మళ్ళీ పేదలకే ఇళ్ళు కట్టిస్తామని చెప్ప‌టం ప‌రిశీలిస్తుంటే దీనికి వెనుక ఎన్నిక ఎత్తుగ‌డ ఉంద‌ని స్ప‌ష్టం అవుతుంది. నంద్యాల మాదిరిగా కూల్చి వేసి ఉంచి ఆ త‌ర్వాత అవి పూర్తి కావాలంటే టీడీపీకి ఓటు వేస్తేనే పూర్తి అవుతాయ‌ని చెప్పిన‌ట్లుగానే ఇప్పుడు ఏపీ అంత‌టా ఇదే న‌మూనానే అమ‌లు చేయాల‌ని చంద్ర‌బాబు నాయుడు త‌ల‌పెడుతున్నారు. ఇళ్ల‌ను కూల్చి వేసి మాకు ఓటు వేయ‌క‌పోతే ఇవి పూర్తి కావ‌ని చెబితే ఓట్లు వేస్తార‌ని చంద్ర‌బాబు న‌మ్ముతున్నారు. కాబ‌ట్టి ఇదే అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

అయితే చంద్ర‌బాబు నాయుడు సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నారు. ఉప ఎన్నిక‌ల్లో అయితే ఎవ‌రు గెలిచినా అప్ప‌టి వర‌కు అధికారంలో ఉన్న‌వాళ్లే కొన‌సాగుతారు. కాబ‌ట్టి చంద్ర‌ర‌బాబు నాయుడు నాట‌కాలు అక్క‌డ సాగాయి. కానీ ఇప్పుడు రాష్ట్రం అంత‌టా ఇదే త‌ర‌హా లో కూల్చి వేత‌లు మొద‌లు పెట్టి బెదిరింపు, బ్లాక్ మెయిల్ ప్ర‌చారాలు మొద‌లు పెడితే రివ‌ర్స్ కొట్ట‌డం ఖాయం అంటున్నారు. ఎందుకంటే సాధార‌ణ ఎన్నిక‌లంటేనే కొత్త ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునే ఎన్నిక‌లు. ఆ ఛాయిస్ ప్ర‌జ‌ల చేతిలో ఉంటుంది. ఇటువంటి మంచి అవ‌కాశాన్ని ప్ర‌జ‌లు వ‌దులు కోరు. బ్లాక్ మెయిల్‌, బెదిరింపులు సాగ‌నివ్వ‌రు. త‌గిన గుణం పాఠం నేర్పుతారు. ఈ లాజిక్‌ను మిస్ అయిన చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర స‌మీక‌ర‌ణ అంటున్నారేమో? ఇటువంటి ప‌చ్చ ప‌నులు చేస్తే చంద్ర‌బాబు నాయుడుకి ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించ‌టం ఖాయం.

Tags : , , , , , , , , , , , , , , , ,