టీడీపీలో సగం మంది సిట్టింగ్స్‌కు సీట్లు గ‌ల్లంతే?|Chandrababu PLANS for Sitting MLA’s

admin
tdp

AP Chief Minister Chandrababu Naidu’s election campaign and the Kakinada municipal corporations won his focus on the coming General Election.click on the below video to know more details of Chandrababu PLANS for Sitting MLA’s |

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నిక‌లు, కాకినాడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌లో విజ‌యం సాధించ‌టంతో ఆయ‌న దృష్టి ఇప్పుడు వ‌చ్చే జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల‌పై ప‌డింది.

ఈ రెండు ఎన్నిక‌లు ఆయ‌న‌కి మంచి జోష్ నింపాయి. దాంతో ఆయ‌న చ‌క‌చ‌కా పావులు క‌దుపుతున్నారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశాల్లో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌ని పిలుపునిచ్చిన సంగ‌తి తెల్సిందే. అయితే చంద్ర‌బాబు వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో సీట్లు కేటాయింపులో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై క‌స‌క‌ర్తు చేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతుంది. చంద్ర‌బాబు నాయుడు క్ర‌మం త‌ప్ప‌కుండా స‌ర్వేలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెల్సిందే. ఈ స‌ర్వేల ఆధారంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు సీట్లు కేటాయిస్తార‌ని పార్టీ వ‌ర్గాల్లో మొద‌టి నుంచి ప్ర‌చారం సాగుతూనే ఉంది. అయితే నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత చంద్ర‌బాబు ఇంకా కొంచెం టైట్ చేశారంటున్నారు.

ఈ స‌ర్వేల ఆధారంగా దాదాపు 35 మంది వ‌ర‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు సీట్లు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. గ‌త మూడున్నర ఏళ్లుగా ఎమ్మెల్యేల ప‌ని తీరుపై నిర్వ‌హించిన స‌ర్వేలు. అదే క్ర‌మంలో ఎమ్మెల్యేల‌పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌లు నిర్వ‌హించిన స‌ర్వేల్లో తేలిన అంశాల‌పై ఆధార‌ప‌డి వీరికి సీట్లు కేటాయిస్తే పార్టీకి తీవ్ర‌మైన న‌ష్టం జ‌రుగుతుందని చంద్ర‌బాబు అంచ‌న‌కు వ‌చ్చారంటున్నారు. అందుకే వీరికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు కేటాయించ‌కూడ‌ద‌ని భావిస్తున్నారు. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు గెల‌వాల‌నే చాలా ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. దీనికి ప్ర‌ధాన‌మైన కార‌ణం చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న చేప‌ట్టాల‌ని భావించిన ప‌నులేవి కూడా ఇంకా కొలిక్కి రాలేదు. ఏడాదిలోగా ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి ఈ ఏడాలోగా వ‌చ్చే అవ‌కాశాలు కూడా క‌న్పించ‌టం లేదు. మ‌రో ప‌క్క చాలా అంశాల‌పై కొంద‌రు రైతులు. ప్ర‌త్య‌ర్ది వైసీపీ నేత‌లు కోర్టుల్లో కేసులు వేసి ఉన్నారు. ఇవి కూడా ఇప్ప‌ట్లో తేలేవి కావు ,దాంతో చంద్ర‌బాబు నాయుడు త‌ను త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మాలు కొలిక్కి రావాలంటే మాత్రం మ‌రో సారి అధికారంలోకి రావాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. అందుకే ప్ర‌తి అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే బీజేపీతో పొత్తు ఖాయం అయింది. జ‌న‌సేన పార్టీని కూడా చంద్ర‌బాబు త‌న వైపుకు ఆక‌ర్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలో పొత్తు ఖ‌రారు అయితే ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సంగం మందికి పైగా సీట్లు గ‌ల్లంతు అయ్యే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు సాగుతున్నాయి. దీనిపై చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి అధికార ఎమ్మెల్యేలు సీట్లు రాక‌పోతే ఏం చేస్తారు? ఊరుకుంటారా? తిరుగుబాటు చేస్తారా? అనే విష‌యాల‌పై కూడా చంద్ర‌బాబు దృష్టి సారిస్తున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌లు కూడా నంద్యాల త‌ర‌హాలోనే సాగుతాయ‌ని ప్ర‌చారం మాత్రం టీడీపీ శ్రేణుల్లో విస్త్రుతంగా సాగుతుంది.

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,