ఆ ఒక్క ‘మంత్రం’ తో జగన్ మీద 2019 లో గెలవాలని చూస్తున్నబాబు | Chandrababu SECRET MANTRA on YS Jagan?

admin
2019

In the coming days, the election of the Nandis was a referendum to the main election in 2019 and the like was a Kurukshetra, YS Jagan Mohan Reddy. Click on the below video to know more details of Chandrababu SECRET MANTRA on YS Jagan?

నంద్యాల ఉప ఎన్నిక అనేది రాబోయే రోజుల్లో ంటే 2019 లో జరిగే మెయిన్ ఎన్నికలకి రిఫరెండం అంటూ ఎన్నికల బరిలోకి దిగి ఒక కురుక్షేత్రం లాగా మాట్లాడారు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి.

దాదాపు 13 రోజుల పాటు ఎన్నడూ లేనట్టుగా అక్కడే మకాం వేసిన ఆయన అక్కడే ఉంది ప్రచారం నిర్వహించారు కూడా. టీడీపీ ని గెలవలేకపోయినా గట్టి పోటీ ఇచ్చి ఉప ఎన్నిక ద్వారా తమ బలం చాటుకోవాలి అనేది ఆయన ప్రయత్నం. సాధారణంగా ఉప ఎన్నిక అంటే అపోజిషన్ ఎలా ఉన్నా కూడా పార్టీల పరంగా కాకుండా అధికార పక్షం వైపే ఓటరు మొగ్గు చూపుతాడు , అది చరిత్ర చెబుతున్న నిజం అయితే జగన్ కూడా గెలిచేయాలని అనుకోలేదు కేవలం టీడీపీ కి గట్టి పోటీ ఇచ్చి ఛాన్స్ ఉంటె గెలవాలి అనుకున్నాడు. ఆ క్రమం లోనే ప్రచార హడావిడి చాలా ఎక్కువగా చేసారు. కానీ కట్ చేస్తే సీన్ పూర్తిగా రివర్స్ అయిపొయింది, కారణాలు సరిగ్గా తెలీవు కానీ వైకాపా మినిమం పోటీ కూడా ఇవ్వలేక భారీ మెజారిటీ తో టీడీపీ కి గెలుపు అందింది.వైకాపా ఓట‌మిని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలుగుదేశం ఎలా చూపించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌నేదే ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌యం. నంద్యాల, కాకినాడ‌ విజ‌యం టీడీపీకి కొత్త ఊపు ఇచ్చింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాన్ని మ‌రింతగా తొక్కేసేంత బ‌లం చేకూరిన‌ట్టుగా కూడా వారు భావిస్తున్నార‌న‌డంలో కూడా సందేహం లేదు!

రీసెంట్ గా గెలిచిన తరవాత మొట్టమొదటి సారి నంద్యలకి వచ్చారు చంద్రబాబు నాయుడు. పొదుపు సంఘాల మహిళల తో జరిగిన ఒక సమావేశం లో పాల్గొన్నారు ఆయన. ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్టు జగన్ మీద విరుచుకుని పడ్డారు ఆయన. వైకాపా కి అసలు దిశా నిర్దేశం అనేవి లేవు అనీ రాష్ట్రం లో తను చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప ఆ పార్టీకి అసలు వేరే పనే లేదు అంటూ సీరియస్ అయ్యారు బాబు. ‘అభివృద్ధిని అడ్డుకుంటున్నారు’ అనేది! ఈ మధ్య చంద్రబాబు వల్లిస్తున్న మంత్రం. ఇది నంద్యాల లో వర్క్ అవ్వడం తో 2019 ఎలక్షన్ కి కూడా ఆ పదం , మంత్రం బాగా ఉపయోగించాలి అని బాబు ఫీల్ అవుతున్నట్టు చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ది ల‌క్ష కోట్ల అవినీతి అంటూ టీడీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. రాబోయే ఎన్నిక‌ల్లో ‘జ‌గ‌న్ అభివృద్ధి నిరోధ‌క శ‌క్తి ’అనే ప్ర‌చారం చేస్తుందనే అనిపిస్తోంది.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,