నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై చంద్ర‌బాబు చివ‌రి య‌త్నం | Chandrababu Trying For Constituencies Extension

admin
babu

AP CM Chandrababu Naidu is very alert in politics. When will it be possible? Chandrababu has a special position to be able to use it in the best possible way to look forward to the opportunity to see it.Click on the below video to know more details of Chandrababu Trying For Constituencies Extension

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయాల‌ల్లో చాలా అప్ర‌మ‌త్తంగా ఉంటారు. ఎప్పుడు అవ‌కాశం చిక్కుతుందా? అని ఎదురు చూడ‌టం, అవ‌కాశం చిక్కితే దాన్ని పూర్తి స్ధాయిలో స‌మ‌ర్ద‌వంతంగా ఉప‌యోగించుకోవ‌టంలో చంద్ర‌బాబుకు ప్ర‌త్యేక‌మైన స్ధానం ఉంటుంది.

ఇటీవ‌ల కాలంలో ఏపీ సీఎం చంద్ర‌బాబుకు, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి మ‌ధ్య కొంత వ్య‌వ‌హారం చెడింద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. దాంతో గ‌త ఏడాది కాలంగా చంద్ర‌బాబు నాయుడు ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నం చేసినా కూడా మోదీ బాబును క‌నిక రించ‌లేదు. మొఖం చాటేశారు. ముఖ్య‌మైన సంద‌ర్భాల్లోనూ అవైడ్ చేశారు. అయినా చంద్ర‌బాబు నాయుడు ఓపిగ్గా ఉన్నారు. ఎక్క‌డ తొంద‌ర‌ప‌డ‌లేదు.

అయితే ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌లు. కాకినాడ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేరంద్ర‌మోదీ చంద్రాబాబు పై కొంత సానుకూల‌త ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది. ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే చంద్ర‌బాబును కీర్తిస్తూ ఆయ‌న‌కు ట్విట్ట‌ర్ లో సందేశం పంప‌టంతో పాటు చంద్ర‌బాబును న‌మ్మ‌క‌మైన మిత్రుడిగా పేర్కొన‌డ‌మే దీనికి కార‌ణంగా చెబుతున్నారు.

ఎన్నికల వ‌ర‌కు మోదీకి అందించిన ఇంటెలిజెన్సీ రిపోర్టుల ప్ర‌కారం ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌ని, జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు అనుకూలంగా ఉన్నార‌నే నివేదిక నేప‌థ్యంలో చంద్ర‌బాబును మోదీ ప‌క్క‌న పెట్టారు. మోదీమే కాకుండా బీజేపీ పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా కూడా ఓ సంద‌ర్బంలో చంద్ర‌బాబు నాయుడు అపాయింట్‌మెంట్ కోరితే ఇవ్వ‌కుండా త‌ప్పించుకున్నారు. దాంతో చంద్ర‌బాబు ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌య‌ర‌య్యింద‌ని అప్ప‌ట్లో వార్తలు కూడా వ‌చ్చాయి. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాలు మోదీలో మార్పు తెచ్చిన నేప‌థ్యంలో ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు మోదీని క‌ల‌వాలంటే అపాయింట్ మెంట్ సులువుగా దొరుకుతుంద‌ని తెలుస్తోంది.

అయితే ఇదే అద‌నుగా భావిస్తున్న చంద్ర‌బాబు నాయుడు చాలా కాలంగా పెడింగ్‌లో ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ఫైల్ బూజు దులుపుకుని ఢిల్లీకి సిద్ద‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. మోదీని క‌లిసి చివ‌రి ప్ర‌య‌త్నంగా ఈ విష‌యంపై చ‌ర్చిస్తారంటున్నారు. మోదీ మూడ్ బాగుంటే మ‌ళ్లీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు తెర పైకి రావ‌టం ఖాయం అంటున్నారు. అయితే ఇప్ప‌టికే టైం దాటిపోయింద‌ని, మోదీ ఓకే అన్నా, వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌లోగా పెంపు సాధ్యం కాద‌నే వాద‌న కూడా లేక‌పోలేదు.అయినా చంద్ర‌బాబు మాత్రం చివ‌రి ప్ర‌య‌త్నంగా అసెంబ్లీ సీట్ల పెంపు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది.

Tags : , , , , , , , , , , , , , , , , , ,