న‌దుల కాలుష్యంపై మెగాస్టార్ ఉద్య‌మం? |Chiranjeevi to Participate in Rally for Rivers?

Recent pollution has become a hot topic. The Kollywood star has been keen to raise awareness among the people on this. Kamal Haasan, Rajinikanth, Suhasini Mani Ratnam, Vishal, Radhika Sarath Kumar, Vijay, Vijay Sethupathi …click on the below video to know more details of Chiranjeevi to Participate in Rally for Rivers?

ఇటీవ‌లి కాలంలో నదీజ‌లాల కాలుష్యం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై జ‌నాల్లో అవేర్‌నెస్ పెంచేందుకు కోలీవుడ్ స్టార్లు న‌డుంక‌ట్టిన సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, విశాల్‌, రాధిక శ‌ర‌త్ కుమార్, విజ‌య్, విజ‌య్ సేతుప‌తి…

ఇలా స్టార్లంతా ఒకే తాటిపైకి వ‌చ్చి న‌దీజాలాల కాలుష్య నివార‌ణ కోసం `ర్యాలీ ఫ‌ర్ రివ‌ర్స్‌` క్యాంపెయినింగ్ నిర్వ‌హించారు.

సామాజిక మాధ్య‌మాల్లో వీలున్నంత వ‌ర‌కూ దీనిపై ప్ర‌చారం చేస్తూ అభిమానుల్లో అవేర్‌నెస్ పెంచుతున్నారు. ఇది మంచిదే. అయితే తంబీల్లో ఉన్న ఆ జిజ్ఞాస టాలీవుడ్ స్టార్ల‌లో మిస్స‌య్యింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వ‌ర‌ద‌లు-తుఫాన్‌లు, సునామీలు-భూకంపాలు వ‌చ్చిన‌ప్పుడు మేము సైతం అంటూ ముందుకొచ్చే మ‌న స్టార్లు న‌దీ కాలుష్యాన్ని ప‌ట్టించుకోకుండా వ‌దిలేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

అయితే కాస్త గ్యాప్ త‌ర్వాత అయినా మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి ముందుగా స్పందించి స‌హ‌చ‌రుల్లో స్ఫూర్తి నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. న‌దీజ‌లాల కాలుష్యం మ‌నుగ‌డ‌కు ప్ర‌మాద‌మం. మనకు జీవనాధారం అయిన నదులు కాలుష్యం భారిన పడి ఎండిపోతున్నాయి. వ‌ర్షాల్లేక చెరువులు, కాల్వలు చివరికి నదులు కూడా ఇంకి పోయే ప్రమాదం పొంచి ఉంది. నదులు ఎండిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్య‌త ఉంద‌ని చిరు హెచ్చ‌రించారు. నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే భవిష్యత్ తరాలకు చుక్క నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. నదులను కాపాడేందుకు `ర్యాలీ ఫర్ రివర్స్` మద్దతు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. మెగాస్టార్ పిలుపును అందుకుని ఇక మెగా కాంపౌండ్ మొత్తం దీనిపై ప్ర‌మోష‌న్‌కి దిగుతుంద‌న‌డంలో సందేహం లేదు. రామ్‌చ‌ర‌ణ్‌, సాయిధ‌ర‌మ్‌, బ‌న్ని, వ‌రుణ్‌తేజ్‌, శిరీష్ .. వీళ్లంతా సామాజిక బాధ్య‌త‌లో మేము సైతం ముందుకు ఉరుకుతార‌న‌డంలో సందేహం లేదు. ఇక ఇత‌రత్రా స్టార్లు సైతం మెగా ప్ర‌మోష‌న్‌కి తాము సైతం అంటూ ముందుకు వ‌స్తార‌న‌డంలో సందేహం లేదు. ఇక ఏపీ, తెలంగాణ‌లోని న‌దీజ‌లాల కాలుష్యాన్ని నిలువ‌రించేందుకు మ‌న స్టార్లు కృషి చేయాల‌ని కోరుకుందాం. అలాగే న‌దీజాల‌లు స‌ముద్రంలో క‌లిసిపోకుండా ల‌క్ష‌ల హెక్టార్ల‌కు చేరుకునేలా ప్రాజెక్టుల ఏర్పాటును మ‌న స్టార్లు స‌మ‌ర్ధించాలి. రైతు క‌ళ్ల‌లో ఆనందం చూడాలి. భ‌విష్య‌త్ త‌రాల‌కు నీటి కొర‌త లేకుండా కాపాడే ప్ర‌మోష‌న్ చేయాలి. దీనిపై వ్యూయ‌ర్స్ .. మీ రివ్యూ ఏంటో చెబుతారా? ప్లీజ్ షేర్ .. ఓ మంచి మాట అంద‌రికీ..!

Add your comment

Your email address will not be published.