ఆ లక్ష కుటుంబాలకీ కెసిఆర్ ఇప్పుడు దేవుడు | CM KCR New Scheme For 1 Lakh BC Familes

admin
kcr

In the vote bank politics no leader in the country will be taken away from each other. However, the right mantra and any kind of vote bank politics would have come out if the right sketch. click on the below video to know more details of CM KCR New Scheme For 1 Lakh BC Familes

ఓటు బ్యాంకు రాజకీయాల్లో దేశం లో ఏ నాయకుడూ ఒకరికి మరొకరు తీసిపోరు. అయితే సరైన మంత్రం వేసి , సరైన స్కెచ్ వేస్తేనే ఎలాంటి ఓటు బ్యాంకు రాజకీయం అయినా మరేదైనా వర్క్ ఔట్ అయ్యేది.

పైకి మాత్రం ఓటు బ్యాంకు రాజకీయం అనిపించుకోవడం అసలు నేతలకి ఇష్టమే ఉండదు. అలాంటి ఫీలింగ్ రాకుండా కెసిఆర్ ఇప్పుడు మరొక కొత్త బంపర్ ఆఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో బీసీల కులవృత్తుల ప్రోత్సాహానికి.. ప్రత్యామ్నాయ ఉపాధికి బ్యాంకులతో సంబంధం లేకుండా ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించాలని కేసీఆర్ డిసైడ్ కావటమే కాదు.. అలా చేయలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల మేర సాయం చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వెయ్యి కోట్లు ఇచ్చారు, బీసీ కుటుంబాలకి ఇది వ్యక్తిగత సాయం అందిస్తాయి.

అక్టోబర్ నుంచీ ఇది అమలులోకి వస్తుంది. ఏడాదికి డబ్భై ఎలా కుటుంబాల ని లక్ష్యం గా చేసుకుంటున్నారు. ఎంబీసి లకి ఇందులో ప్రాధాన్యతత ఉంది.ఈ పథకం దెబ్బతో కెసిఆర్ వారి ఇళ్ళలో ఇలవేల్పు ఐపోతారు. దేశం లో ఎక్కడా లేని అభివృద్ధి పథకాలు తెలంగాణా బీసీ లకే అమలు చేసారు కెసిఆర్. గొల్ల కురమల కోసం రూ.4వేల కోట్లతో గొర్రెల పంపిణీ.. మత్స్యకారుల కోసం రూ.వెయ్యి కోట్లతో చేపల పెంపకం.. రూ.1200 కోట్లతో నేత కార్మికులకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారు. వీరే కాక రానున్న రోజుల్లో గీత.. రజకులు.. నాయి బ్రాహ్మణులు..కుమ్మరులు.. పంచకర్మల కోసం ప్రత్యేక కార్యక్రమాల్ని రూపొందించనున్నట్లుగా కేసీఆర్ చెబుతున్నారు. వేలాది , లక్షలాది కుటుంబాలలో ఈ ఒక్క ప్లాన్ తో కెసిఆర్ దేవుడు ఐపోతారు అనడం లో సందేహం లేదు.

Tags : , , , , , , , , , , , , , , ,