టీఆర్ ఎస్ లీడ‌ర్ కు చుక్క‌లు చూపించిన దేవ‌సేన! | Collector Devasena REVEALS About TRS Corruption!

admin
trs

When Devasena listens to this name, most people are reminded of the Bahubali film. Because the Devasena is the same, but the Devasena’s name is the name of the TRS leaders in the pants. But she is not Devasena in Reel Life.Click on the below video to know more details of Collector Devasena REVEALS About TRS Corruption!

దేవ‌సేన ఈ పేరు విన‌గానే చాలా మందికి బాహుబ‌లి సినిమా గుర్తుకు వ‌స్తుంది. ఎందుకంటే అందులో దేవ‌సేన తెగింపు, దైర్యం అలా ఉంటాయి.కానీ ఇప్పుడు దేవ‌సేన పేరు చెబితే మాత్రం అక్క‌డి టీఆర్ ఎస్ నేత‌లు ప్యాంట్లు తడుపుకోవాల్సిందే. అయితే ఆమె మాత్రం రీల్ లైఫ్ లో దేవ‌సేన కాదు. రియ‌ల్ లైఫ్‌లో దైర్యం ఉన్న దేవ‌సేన.. ఆమె జ‌న‌గాం జిల్లా క‌లెక్ట‌ర్. ఇంత‌కీ ఈ క‌లెక్ట‌ర్ పేరు వింటే ఎందుకు టీఆర్ఎస్ నేత‌లు వ‌ణుకుతారు అని అనుకుంటున్నారా..? అయితే జ‌రిగిన క‌థ‌లోకి వెళ్లాల్సిందే….ఈ కలెక్ట‌ర్ సాక్షాత్తు అధికార టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరాచాకాల‌కు ముకుతాడు వేసింది.. అంత‌టితో ఆగిందా.. ఏకంగా ఈ విష‌యాన్ని కాస్త ప‌బ్లిక్ చేసింది.. అలా చేస్తే మీడియా గుమ్మున ఉంటుందేమో కాని.. సోష‌ల్ మీడియా ఊరుకుంటుందా..!! ఆహా.. దేవ‌సేన‌ను కీర్తిస్తూ.. ముత్తిరెడ్డి వైఖ‌రిని చిత్తు చేస్తూ సోష‌ల్ మీడియా ఛీ కొడుతుంది.ఇంత‌కీ ఈ దేవ‌సేన ఎవ‌రిని అనుకుంటున్నారా.. చెరువుల భూముల కబ్జాల నుంచి జనాల సొమ్మును అధికార పార్టీ నేతలు ఎలా దిగమింగారో వివరించారు. జనగామ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్రమాల చిట్టాను ఆధారాలతో సహా విప్పేశారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమాలకు తాను ఎలా కళ్లెం వేసింది కూడా పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు ఈ కలెక్టరమ్మ. జనగామాలో నడుస్తున్న దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయడానికి దివినుంచి దిగివచ్చిన దేవదూతగా ఈ దేవసేనను ఇప్పుడు అక్క‌డి ప్ర‌జ‌లు కొనియాడుతున్నారు జనగామ ప్రజానీకం. క‌లెక్ట‌ర్‌కు అన్ని వైపుల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. ఆమె చేసిన ప‌నికి అంద‌రూ శ‌భాష్ అంటున్నారు.. ఇదిలా ఉంటే అధికార పార్టీకి తెలంగాణ‌లో చాలా మంది ఆఫీస‌ర్లు మ‌ద్ద‌తుగా ఉండటంలేద‌నేది త‌రుచుగా జ‌రుగుతున్న ప‌రిణామాలే తెలియ‌జేస్తున్నాయి.. గ‌తంలో క‌రీంన‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ కూడా స్థానిక ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కృష్ణ‌కు మ‌ధ్య వాగ్వివాదం జ‌రిగింది. ఇక భ‌ద్రాచ‌లంలో మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ వ్య‌తిరేకంగా మాట్లాడే స‌రికి ఆయ‌నపై అధికార పార్టీనేత‌లు ఏకంగా దాడికి దిగార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక తాజాగా క‌లెక్ట‌ర్ దేవ‌సేన ఇచ్చిన పంచ్ తో అధికార పార్టీ ఏం చేయాలో తెలియ తల బాదుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. నేత‌ల అనైతిక పోక‌డ‌ల వ‌ల్ల అధికారులు కొర‌డా జులిపిస్తుంటే తాము దెబ్బ‌లు తినాల్సి వ‌స్తుంద‌ని నేత‌లు బాధ‌ప‌డుతున్నార‌ట‌. ఇప్ప‌టికే కోర్టులు వేస్తున్న మొట్టికాయల‌కు తోడు ఇలా అధికారులు మొండికేస్తుడ‌టం, అధికార పార్టీ నేత‌ల‌ను చీల్చి చెండాడుతుండ‌టంతో అధికార పార్టీ నేత‌ల్లో వ‌ణుకు మొద‌లైంది. ఈ పరిణామాల‌న్ని ప్ర‌జ‌ల్లో ఎక్క‌డ బ్యాడ్ నేమ్ తీసుకువ‌స్తాయో అని గ‌మ్మున ఉంటున్నార‌ట‌. అయితే మ‌రి ఇంత‌చేసిన‌ ఈ క‌లెక్ట‌ర‌మ్మ‌పై ప్ర‌భుత్వం బ‌దిలీ వేటు వేస్తుందో.. లేక మ‌రేం చేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది..

Tags : , , , , , , , , , , , , , , , ,