ఆ ముగ్గురిని ఏం చేయ‌లేకే కేసీఆర్ ఈ ప్లాన్ వేశారా? | Did KCR Plan This to FINALISE between those 3 ?

admin
kcr

Though the TRS party party has taken a turn for full-scale politics, the party has no bigger margin. At present, KCR is one of the party’s presidents. His party is the party affair, the ruling party’s final decision. There are no doubts, no one can advise to advise. Click On the below video to know more details of Did KCR Plan This to FINALISE between those 3 ?

టీఆర్ ఎస్ పార్టీ ఉద్య‌మ పార్టీ నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ట‌ర్న్ తీసుకున్న‌ప్ప‌టికీ ఆ పార్టీకి పెద్ద దిక్కంటు ఎవ్వ‌రు లేకుండా పోయారు. ప్ర‌స్తుతానికి కేసీఆర్ ఒక్కరే పార్టీ అధ్య‌క్షుడి హోదాలో అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీ వ్య‌వ‌హార‌లైనా, పాల‌న వ్య‌వ‌హారాలైన ఆయ‌న నిర్ణ‌యమే ఫైన‌ల్. అందులో ఎవ‌రూ సందేహాలు , స‌ల‌హాలు ఇవ్వాల్సిన ప‌నిలేదు అన్న‌ట్టుగా ఏక ప‌క్షంగా దూసుకువెళుతున్నారు. దీంతో ప్ర‌భుత్వం ప‌నితీరు మాట ఎలా ఉన్నా పార్టీలో కేడ‌ర్ మాత్రం వీక్ అయిపోతుంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో విప‌క్షాలు స్ట్రాంగ్ గా లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వంపై కావాల్సిన వ్య‌తిరేక‌త‌ను తీసుకురావ‌డంలో విఫ‌లం అయ్య‌ర‌నే చెబుతున్నారు విశ్లేష‌కులు. అయితే ఇది టీఆర్ ఎస్ లో మాత్రం అంత‌ర్గ‌తంగా అసంతృప్తుల‌ను తీసుకువ‌స్తుంద‌ని అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎన్నికైన కేసీఆర్ ప్ర‌భుత్వం పై మాత్ర‌మే దృష్టిపెట్టారు. పార్టీని పూర్తిగా వ‌దిలేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది.. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి టీఆర్ఎస్ కు పూర్తిస్థాయి కార్య‌వ‌ర్గం లేదు. ఆ త‌ర్వాత పార్టీ ప‌ద‌వులు ఎవ‌రికీ ఇవ్వ‌లేదు. ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం అస్స‌లే లేకుండా పోయింది. లేదు. కేసీఆర్ ఆదేశాలు వ‌స్తేనే పార్టీ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయే త‌ప్ప లీడ‌ర్లు చొచ్చుకువెళ్లి ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేంత‌గా లేదు. ఇక పార్టీ ప‌ద‌వుల కోసం ఎవ‌రికి వారు ఫైరవీలు చేసుకోవ‌డంలోనే బిజీ కావ‌డంతో పార్టీ కింది స్థాయిలో లుక‌లుక‌ల మొద‌ల‌య్యాయి. ఏప్రిల్ ప్లీన‌రీ స‌మావేశం త‌ర్వాత కార్య‌వ‌ర్గం వేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కానీ దానికి అతీ గ‌తిలేకుండా పోయింది. దీంతో పార్టీని న‌మ్ముకొని ఇంత కాలం నుంచి ప‌నిచేసిన వారిలో అసంతృప్తి మొద‌లైంది. దీంతోనే అయూబ్ ఖాన్ లాంటి కార్య‌క‌ర్త‌లు ఆత్మ‌బ‌లిదానాలు తీసుకునే స్థాయికి చేరిపోయింద‌ని అంటున్నారు. ప్లీన‌రీ జ‌రిగి ఆరు నెలలైనా ఇంత‌వ‌ర‌కూ కార్య‌వ‌ర్గం ప్ర‌క‌టించ‌లేదు. ఈ మ‌ధ్య‌లో కార్య‌వ‌ర్గం ప్ర‌క‌టించ‌డానికి కేసీఆర్ క‌స‌ర‌త్తు చేశార‌ని తెలిసింది. ప్ర‌స్తుత ప‌రిణ‌మాల‌ను గ‌మ‌నిస్తున్న కేసీఆర్ పార్టీపై దృష్టి పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక‌నైనా మేల్కోక పోతే కేడ‌ర్ పూర్తిగా అదుపుతుప్పుతుంద‌ని త‌న చేతిలో ఏది ఉండ‌కుండా పోతుంద‌ని భావించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇందుకోస‌మే ఆయ‌న ఇటీవ‌ల జిల్లా క‌మిటీలు ర‌ద్దు చేశారు. కొత్త‌గా నియోజ‌క‌వ‌ర్గ క‌మిటీల‌ను తెర‌పైకి తెచ్చారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టుకోసం నేత‌ల మ‌ధ్య పోటీ పెరిగింది. దీంతో త‌మ వ‌ర్గ నేత‌ల‌కే చోటు క‌ల్పించేందుకు టీఆర్ఎస్ ముఖ్య‌నేతలు హ‌రీష్‌రావు, కేటీఆర్‌, క‌విత ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఎవ‌రికి వారు త‌మ అనుచ‌రుల పేర్ల‌ను తెర‌పైకి తేవ‌డంతో అవి ఆల‌స్యం అవుతూ వ‌స్తున్నాయ‌ట. రాజ‌కీయ వార‌స‌త్వం తీసుకునేందుకు ఈ ముగ్గురు పోటీ ప‌డుతుండ‌టం.. తాను ఎవ‌రికి బాధ్య‌త క‌ట్ట‌బెట్టేందుకు ఇష్టం వ్య‌క్తం చేయ‌లేక‌నే కేసీఆర్ రైతు స‌మ‌న్వ‌య స‌మితుల‌ను తీసుకువ‌చ్చిన‌ట్టుగా చ‌ర్చ సాగుతోంది. ఈ ముగ్గురి మ‌ధ్య పోటీతో కార్య‌వ‌ర్గ ప్ర‌క‌ట‌న ఆల‌స్య‌మ‌వుతుంద‌ని గులాబీద‌ళంలోని కొంద‌రు నేత‌లు చెబుతున్నారు. కాబ‌ట్టి రైతు స‌మ‌న్వయ స‌మితులు ఏర్పాటు చేస్తే కేడ‌ర్ లో స్ప‌ష్ట‌త రావ‌డంతోపాటు వారికి బాధ్య‌త ఇచ్చిన‌ట్టు ఉంటుంద‌ని ఆయ‌న భావించిచార‌ట‌. ఇక ఈ స‌మ‌న్వ‌య స‌మితులు ఏర్పాటు పూర్త‌యితే… కార్య‌వ‌ర్గ ప్ర‌క‌ట‌న కొలిక్కి రావ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి టీఆర్ ఎస్ పార్టీ భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతుంద‌నేది మాత్రం పార్టీ నిర్మాణంలోనే ఉంటుంద‌ని విశ్లేష‌కుల

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , , ,