అసలు ఫిబ్రవరి 14 ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

ఫిబ్రవరి 14 వస్తుందన్న కొన్ని రోజుల ముందు నుంచే యువత మంచి హుషారుగా ఉంటారు. తాము ప్రేమించిన వ్యక్తికి ఏం బహుమతి ఇవ్వాలి? అనే ప్లాన్స్ చేస్తుంటారు. అందరూ తమదైన స్టైల్లో ఫిబ్రవరి 14ను సెలబ్రేట్ చేసుకుంటారు

కానీ..అసలు ఆ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటీ? ఆ రోజే ఎందుకు ‘వాలెంటైన్స్ డే’ జరుపుకుంటారు? అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాచీన రోమన్‌ లు పూజించే దేవతలలో ‘జూనో’ దేవత ఒకరు.

ఆ దేవత స్త్రీలకు, పెళ్ళిళ్ళకూ సంబంధించిన దేవత అని అక్కడి వారు నమ్ముతారు. ఆ జూనో దేవతపై ఉన్న భక్తితో ఫిబ్రవరి 14వ తేదీన రోమ్‌లో సెలవు ప్రకటించుకొని ఈ ఉత్సవాలు చేసుకునేవారు. ఆ దేశపు కొన్ని పక్షులు ఆ తేదీన ప్రేమతో జతలు కట్టేవని ప్రాచీన రోమన్‌ చరిత్ర కారులు రాసుకున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన రోమ్‌ నగరంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే ఆ వేడుక ఫిబ్రవరి 14కు మారింది. తర్వాత కాలంలో అటు అమెరికన్‌ పౌరులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించి తమ ప్రేమను తెలుపుకోవడానికి ఆ రోజున శుభాకాంక్షలు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు.

ఇక అప్పటి నుంచి ‘వాలెంటైన్స్‌ డే’ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రేమికుల రోజుగా జరుపుకోవడం జరుగుతుంది. ‘వాలెంటైన్స్‌ డే’ సందర్భంగా గ్రీటింగ్‌ కార్డులను 1797లో బ్రిటన్‌లో మొదటిసారిగా తయారు చేశారట. తర్వాత 19వ శతాబ్దంలో ‘వాలెంటైన్స్‌ డే’ గ్రీటింగ్ కార్డ్స్ కు మంచి డిమాండ్‌ పెరిగిపోయింది. దీన్ని ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో జరుపుకోగా, మన దేశంలో మాత్రం ‘ప్రేమికుల రోజు’గా జరుపుకుంటున్నారు. ఇది అసలు ‘లవర్స్ డే’ గా ప్రఖ్యాతి గాంచిన ఫిబ్రవరి 14 వెనుక ఉన్న అసలు కథ.

Add your comment

Your email address will not be published.