పెళ్లి సినిమాలాగా కోడలికోసం కొడుకును హత్య చేసిన తల్ల!|Do You Know What a Mother Did to Her Son?

admin
pelli

Kodi Ramakrishna is the heroine of Vadde Navinay in Telugu. Kodali in the film is killing the poison of the mother who pushes the image of the torture and killing poison. The wedding ceremony was a super hit movie.click on the below video to know more details of Do You Know What a Mother Did to Her Son?

కొన్నేళ్ళక్రితం తెలుగులో వడ్డే నవీన్ హీరోగా మల్లీశ్వరి హిరాయిన్ గా కోడి రామకృష్ణ దర్సకత్వంలో పెళ్లి అని ఓ సినిమా వచ్చింది.

ఆ సినిమాలో కోడలిని చిత్ర హింసలకి గురిచేస్తున్న కొడుకుని కన్న తల్లి పాయసం లో విషం కలిపి చంపేస్తుంది. అప్పట్లో వచ్చిన ఈ పెళ్లి సినిమా సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో జరిగిన సంఘటన లాంటిది నిజ జీవితంలో ముంబై లో జరిగింది. కోడళ్ళని కాల్చుకు తినే అత్తలు ఉన్న ఈ రోజుల్లో ఆ ఆత్త మాత్రం కోడలిని పెడుతున్న టార్చర్ చూడలేక కొడుకుని హతమార్చింది. వివరాల్లోకి వెళ్తే మన్ ఖుర్ద్ ప్రాంతానికి చెందిన నదీమ్ డ్రగ్స్ కి బానిసయ్యాడు. అయితే పెళ్లి చేస్తే బాగుపదతాడని అనుకున్న అతని తల్లి అన్వారీ రెండేళ్ళ క్రితం అలహాబాద్ కి చెందిన యువతీతో పెళ్లి చేసింది. అయినా కొడుకులో ఎలాంటి మార్పు రాలేదు. ఏదో ఒక కారణంతో భార్యని చిత్రహింసకి గురిచేస్తూ, చావగోట్టేవాడు. అతని టార్చర్ భరించలేక కోడలు పిట్టింటికి వెళ్ళిపోయింది.

అయితే అత్త వచ్చి నచ్చ చెప్పడంతో మరల కాపురానికి వచ్చింది. ఆమె వచ్చిన మరిసటి రోజు నదీమ్ మరల డ్రగ్స్ తీసుకొని ఇంటికి రావడం గమనించిన తల్లి, కోడలిని తన స్నేహితురాలి ఇంటికి పంపింది. దీంతో నదీమ్ తల్లిని దారుణంగా కొట్టాడు. ఇంత కాలం కొడుకు మారుతాడని అనుకున్న అన్వారీకి మారడని అర్ధం కావడంతో అతన్ని చున్నీతో ఉరి వేసి చంపేసింది. తర్వాత రాత్రంతా కుమారు మృతదేహం పక్కనే ఏడుస్తూ కూర్చుంది. నదీమ్ భార్య ఇంటికి వచ్చి చూస్తే అత్త ఏడుస్తూ కనిపించడం చూసి, పక్కనే చనిపోయి ఉన్న భర్తని చూసి షాక్ అయ్యింది. కోడలిని, కుటుంబాన్ని రక్షించుకోవడానికి కొడుకుని చంపినట్లు ఆమె ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. అయితే ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆ తల్లికి మహిళల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. ఆమె చేసిన గొప్ప పనికి అందరు కీర్తిస్తున్నారు.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , ,