‘సైకిల్’ గుర్తు కోసం తండ్రి, త‌న‌యుల మ‌ధ్య‌పోటీ

mohanrao
sp

ఎస్పీలో త‌లెత్తిన విభేదాలు ఢిల్లీకి చేరాయి. ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద ఇద్ద‌రూ సైకిల్ గుర్తు త‌మ‌దంటే త‌మ‌దేన‌ని ఆధారాలు స‌మ‌ర్పించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.

సమాజ్ వాదీ పార్టీలోని కుటుంబ కలహాలు ఢిల్లీకి చేరాయి. తన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చెల్లదని ములాయం సింగ్ యాదవ్ అన్నారు. అఖిలేష్ ఎన్నిక చెల్లదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి ఆయన లక్నో నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఎలాంటి తప్పు చేయలేదని… తనను ఎవరూ నిందించడం లేదని చెప్పారు. తాను అస్వస్థతకు గురైనట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని… తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు.

సైకల్ గుర్తు తనదే అని తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ ఎన్నిక రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు అమర్ సింగ్, శివపాల్ యాదవ్ లతో కలసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను ములాయం కలవనున్నారు.మరోవైపు, ములాయం ముఖ్య అనుచరుడు అమర్ సింగ్ మాట్లాడుతూ నేతాజీ ములాయం కోసం ఖల్ నాయక్ కావడానికి కూడా తాను సిద్ధమని చెప్పారు. ఇదే సమయంలో పార్టీపై తనకే పూర్తి పట్టు ఉందని నిరూపించేందుకు ఆధారాలు కూడా సమర్పించేందుకు అఖిలేష్ సింగ్ యాదవ్ సమాయత్తమవుతున్నారు.

సమాజ్‌వాది పార్టీ తమదంటే, తమదని చెబుతూ సిఈసికి ఆధారాలు ఇచ్చేందుకు యూపి సిఎం అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి, పార్టీ చీఫ్‌గా ఇప్పటి వరకు ఉన్న ములాయంసింగ్‌లు సిద్ధంగా ఉన్నారు. పార్టీలో ఎటువంటి అయోమయం లేదని, తమదే నిజమైన పార్టీ అని ములాయంసింగ్ మీడియా వద్ద మాట్లాడుతూ స్పష్టం చేశారు.

Tags : , , , , , , , , ,