కావాలనే వివాదం రేపిన గౌతం రెడ్డి? |Gautham Reddy Wantedly TARGETED Vangaveeti Family?

admin
vangaveeti

There is nothing to be charged in politics. But if the incident comes out in the shadows, controls, misleading and saris are all the things that the politicians are very familiar with.click on the below video to know more details of Gautham Reddy Wantedly TARGETED Vangaveeti Family?

రాజకీయాల్లో ఆవేశం కి తావు లేదు .. ఒకవేళ చిన్నా చితకా సందర్భాల్లో ఆ ఆవేశం బయటకి వచ్చినా దానిని కంట్రోల్ చేసుకోవడం , దారి మళ్ళించడం , సారీలు చెప్పడం ఇవన్నీ రాజకీయ నాయకులకి చాలా అలవాటు అయిన విషయాలు.

అయితే కొన్నిసార్లు ఆవేశం అనేది రాజకీయ వ్యూహం లో ఒక అతిపెద్ద భాగంగా కూడా ఉండచ్చు. ప్రస్తుతం బెజవాడ రాజకీయాల్లో అదే జరుగుతోందా ? ఎలాంటి సమయం , అవసరం, కారణం లేకుండా వంగవీటి రంగాని ఉద్దేశించి వైకాపా నాయకుడు గౌతం రెడ్డి రెచ్చ కొడుతూ ఉన్నారా? అవును అనే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు గౌతం రెడ్డి. రంగా అభిమానులని రెచ్చగొట్టేలా అసలు ‘ రంగా గాడు ‘ అని సంభోదిస్తూ చాలా చీప్ చేసి మాట్లాడారు గౌతం. దీనికి నిరసనగా వంగవీటి రాధా , రత్న కుమారి ప్రెస్ మీట్ పెట్టె ప్రయత్నం చేస్తే పోలీసుల హై డ్రామా నడిచిన విషయం తెలిసిందే .

అయితే ఈ విషయాన్ని వేరే కోణం లో చూస్తే గౌతం రెడ్డి ఈ వ్యాఖ్యలు కావాలనే చేసారా ? వైకాపా నుంచి వెళ్ళిపోవడం కోసమే ఈ వివాదం కొని తెచ్చుకున్నారా ? రాజకీయంగా ఇదొక వ్యూహమా ? అని విశ్లేషకులు ఎంచి చూస్తున్నారు. గౌతం రెడ్డి వ్యవహారం లో బీజేపీ పాత్రని తీసి పారేయలేము , బీజేపీ కి ఏపీ లో విస్తఃరణ జరగాలి అనే ఆలోచన ఉంది. కాపు నేతలతో పాటు మరి కొంత ఇతర సామాజిక వర్గాల పెద్ద నేతలని తీసుకోవాలని బీజేపే ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ తో గౌతం టచ్ లో ఉన్నారు అనీ ఆ పార్టీ లో చేరడం కోసం గౌతం అడుగులు వేస్తున్నారు అనే మాట వినపడుతోంది. అందుకే, ఏదో ఇలాంటి వివాదాన్ని కోరి రేకెత్తించి, త‌న ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు చెబుతున్నారు. నిజానికి, ఈ మ‌ధ్య వైకాపాలో ఆయ‌న కాస్త అసంతృప్తిగానే ఉంటున్నారు. గౌత‌మ్ ప‌నితీరు స‌రిగా ఉండ‌టం లేద‌న్న ఉద్దేశంతో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ పార్టీ బాధ్య‌త‌ల్ని రాధాకు అప్ప‌గించారు జ‌గ‌న్‌. అక్క‌డి నుంచే త‌న‌కు ప్రాధాన్య‌త త‌గ్గిందనే ఆవేద‌న‌లో ప‌డ్డారు. ఆ త‌రువాత‌, మ‌ల్లాది విష్ణు కూడా వైకాపాలో చేరారు. అది గౌత‌మ్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు. తాను ఇంత అసంతృప్తిగా ఉంటున్నా కూడా పార్టీ త‌న ఆవేద‌న‌ను అర్థం చేసుకోలేద‌నేది గౌత‌మ్ రెడ్డి ఫీలింగ్!

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,