చంద్ర‌బాబుకు హైకోర్టు షాక్! | High Court SHOCKS AP CM Chandrababu Naidu | Political News

admin
chandrababu

AP CM Chandrababu Naidu comes from the courts of the line.click on the below video to know more details of High Court SHOCKS AP CM Chandrababu Naidu

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకి కోర్టుల నుంచి వ‌ర‌స‌గా మొట్టికాయ‌లు ప‌డుతున్నాయి.

హైకోర్టుల నుంచి సుప్రీం కోర్టుల వ‌ర‌కు కూడా చంద్ర‌బాబును త‌ప్పుప‌డుతూ నోటీసులు జారీ చేస్తున్నాయి. అయితే తాజాగా హైకోర్టు జారీ చేసిన నోటీసు మాత్రం చాలా సీరియ‌స్ వ్య‌వ‌హారం. సీఎం చంద్ర‌బాబు నాయుడు స్ధానంలో మ‌రో సీఎం ఎవ‌రున్నా కూడా వెంట‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేసే వార‌న‌టం ఆతిశ‌యోక్తి కాదు. అయితే చంద్ర‌బాబు నాయుడు స్టైలే వేరు క‌దా?
కోట్ల రూపాయ‌లు లంచాలు ఇస్తూ దొరికిపోయి కూడా తాను నీతిమంతుడ్ని అని చెప్ప‌గ‌ల రాజ‌కీయ నేత‌. వ్య‌వ‌స్ధ‌ల‌ను భ్ర‌ష్టుప‌ట్టిస్తూ త‌న రాజ‌కీయ జీవితం కోసం దేనికైనా తెగించ‌గ‌ల నేత వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో ఎవ‌రైనా ఉన్నారంటే ఆ వ‌ర‌స‌లో చంద్ర‌బాబునాయుడు తొలి స్ధానంలో నిలుస్తార‌ని చెప్ప‌టంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. హౌకోర్టు తాజాగా చంద్ర‌బాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు వ్య‌వ‌హారం ఏమిటో తెలియాలంటే పూర్తిగా ఈ వీడియో చూడాల్సిందే.

చంద్రబాబునాయుడుకు మంగ‌ళ‌వారం హై కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమ కట్టడాలకు సంబంధించి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖ‌లు చేసిన పిల్ విచారించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. విచారణలో భాగంగా కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోను, నదీ కరకట్ట పైన అక్రమ కట్టడాలు వెలసిన విధానంపై ఆర్కె తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. అక్రమ కట్టడాలు నదికి ఏ విధంగా నష్టం చేస్తాయో చెప్పారు తన వాదనకు మద్దతుగా కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను, గతంలో వివిధ కేసుల సందర్భంగా సుప్రింకోర్టు చెప్పిన తీర్పులు తదితరాలతో పాటు పర్యావరణ వేత్తల ఆందోళనలను కూడా న్యాయవాది కోర్టు ముందుంచారు. న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి వెంటనే మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. అందులో భాగంగా చంద్రబాబుతో పాటు మరో 57 మందికి నోటీసులివ్వాలని హై కోర్టు ఆదేశించింది

చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే కృష్ణానది కరకట్టపైన నిర్మించిన కట్టడాలన్నీ అక్రమ కట్టడాలుగా గుర్తించి కూల్చేయాలని నిర్ణయించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో చంద్రబాబు హైదరాబాద్ లో ఉండేవారు. అయితే, ఓటుకునోటు కేసు వెలుగు చూసిందో తన మకాంను చంద్రబాబు హటాత్తుగా విజయవాడకు మార్చేసారు. అప్పటికప్పుడు ఓ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల్లో ఒకదాన్ని ఎంచుకున్నారు. ఎప్పుడైతే స్వయంగా చంద్రబాబే ఓ అక్రమ కట్టడంలో నివాసముండాలని నిర్ణయించుకున్నారో వెంటనే అధికారులు మిగిలిన వాటిని కూడా సక్రమ కట్టడాలుగా మార్చేసారు. దాంతో అప్పటి నుండి కరకట్ట అక్రమ కట్టడాలపై వివాదం నలుగుతూనే ఉంది. దీనితో విప‌క్షాలు ఎన్ని విమ‌ర్శ‌లు చేసిన అధికార ప‌క్షం ప‌ట్టించుకోలేదు. దీంతో ఆర్కే కోర్టు గుమ్మం తొక్కారు. కోర్టులో న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నారు.

Tags : , , , , , , , , , , , , , , , , , ,