“బాలయ్య డౌన్ డౌన్ .. రాజీనామా చెయ్యాలి ” | Hindupur People Protest Against Balakrishna

admin
balakrishna

TDP MLA, film hero, late leader NTR’s son, witness to the chief minister, Nandamuri Balakrishna is in the Hindutur on a fierce protest protest.click on the below video to know more details of Hindupur People Protest Against Balakrishna

టీడీపీ ఎమ్మెల్యే, సినిమా హీరో, దివంగత నేత ఎన్టీఆర్ కొడుకు, సాక్షాత్తూ ముఖ్యమంత్రికి వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ మీద హిందూపురం లో తీవ్రమైన నిరసన గళం వినిపిస్తోంది.

ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూ పురం లో ఇదివరకు కూడా నిరసన సెగలు తగిలినా అవి ఇప్పుడు టోటల్ గా పెరిగాయి. ఆయన రాజీనామా చేస్తే కానీ ఊరుకోము అనే స్థాయి కి ప్రజలు వచ్చేసారు అంటే ఇక అర్ధం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించేందుకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణను పదవి వీడాలని నినదించారు. హిందూపురంలోని సి.వెంకటాపురం – ఓబుళాపురం – గలిబిపల్లి గ్రామాల్లో రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. సీసీ రోడ్లు కూడా లేకపోవడంతో వానాకాలం అడుగుతీసి అడుగు వేయాలంటేనే ఇబ్బందిగా మారింది. చాలా నెలల తరవాత హిందూపురం లో అడుగు పెట్టిన బాలయ్య కి తమ సమస్యలు చెప్పుకోవాలి అని చాలా గ్రామాల ప్రజలు అనుకున్నారు. లేపాక్షి నుంచి గలిబిపల్లి క్రాస్ కి వచ్చిన టైం లో బాలయ్య వాహనాలని ప్రజలు అడ్డుకున్నారు. గ్రామం లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది అని చెప్పుకొచ్చారు వారు. బాలకృష్ణ వాహనం బిసలమానేపల్లికి చేరుకోగానే వెంకటాపురం – ఓబుళాపురం – బిసలమానేపల్లి గ్రామ ప్రజలుఅడ్డుకున్నారు.

బిసలమానేల్లి నుంచి వెంటాపురం – ఓబుళాపురం గ్రామాలకు రహదారి లేదన్న విషయం చెప్పాలని భావించారు. వారిని పట్టించుకోకుండా బాలయ్య వెళ్ళిపోవడం తో ”ఎమ్మెల్యే బాలకృష్ణ డౌన్..డౌన్…ప్రజా సమస్యలు పట్టని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి’ అంటూ నినదించారు. తమ సమస్యకు పరిష్కారం చూపే వరకూ కదిలేది లేదని రోడ్డుపైనే భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో రాకపోకలకు స్తంభించాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అనేక ప్రారంభోత్సవాలు చేసిన బాలయ్య ఇలా సొంత ప్రజలని పట్టించుకోక పోవడం దారుణం అంటున్నారు విశ్లేషకులు.

Tags : , , , , , , , , , , , , , , , , ,