అచ్ఛే దిన్ అంటే ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూప‌ట‌మేనా?

mohanrao
rahul

కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు, యువ నేత రాహుల్ గాంధీ నోట్ల ర‌ద్దుపై మ‌రోసారి మోదీని నిల‌దీశారు. నోట్ల ర‌ద్దు కార‌ణంగా దేశంలో జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలలో ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఎఐసిసి కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసలు ఈ నిర్ణయంతో సామాన్యులకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. అచ్చెదిన్ అన్నా మోడీ దేశ ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారని విమర్శించారు. పేదలను ప్రధాని బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఎవ‌ర్ని అడిగి మోదీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారో తెల‌పాల‌న్నారు. దేశ ఆర్ధిక వ్య‌వ‌స్ధ పూర్తిగా సంక్షోభంలోకి నెట్ట‌బ‌డింద‌ని ఆయ‌న తెలిపారు.

Tags : , , , , , , ,