జ‌గ‌న్ని బాబు కాపీ కొడుతున్నాడా? | Is Chandrababu Following Ys Jagan? | Political Updates

admin
babu

AP CM Chandrababu Naidu has recently spoken words never spoken. It is a surprise to hear such words in the mouth of Chandrababu. Is there any move behind the speech of AP opposition leader repeatedly talking to Chandrababu? Have you talked about? The suspicions are being expressed. Click on the below video to know more details of Is Chandrababu Following Ys Jagan? | Political Updates

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ మాట్లాడ‌ని మాట‌లు మాట్లాడుతున్నారు. చంద్ర‌బాబు నోట ఇటువంటి మాట‌లు వింటుంటే కొంత ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత ప‌దే ప‌దే మాట్లాడే మాట‌ల‌నే చంద్ర‌బాబు మాట్లాడ‌టం వెనుక ఏదైనా ఎత్తుగ‌డ ఉందా? కాక‌తాళియంగానే మాట్లాడారా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన సంగ‌తి తెల్సిందే. ఇక్క‌డ విజ‌యం సాధించ‌టానికి చంద్ర‌బాబు నాయుడు చాలా చేయాల్సి వ‌చ్చింది. ఎలా అయితేనో ఆయ‌న విజ‌యం సాధించారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా నంద్యాల‌కు చంద్ర‌బాబు మూడు సార్లు రావ‌టం, అభివృద్ది వేల కోట్ల కేటాయించ‌టంపైనే సాగింది. వైఎస్ జ‌గ‌న్ కూడా దీనిపై విమ‌ర్శ‌లు చేశారు. ఉప ఎన్నిక‌లు రాకుండా ఉంటే చంద్ర‌బాబు ఇన్నీ సార్లు వ‌చ్చేవారా? న‌ంద్యాల‌కు ఈ విధంగా నిధులు కేటాయించే వా రా? అంటూ జ‌గ‌న్ ప్ర‌చారం సాగింది. వీటిని దృష్టిలో పెట్టుకున్నారో ఏమో కానీ చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల త‌ర్వాత నంద్యాల లో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు మాట్లాడిన మాట‌లు చాలా కొత్త‌గా ఉన్నాయి. చంద్ర‌బాబు ఇంటికి, వంటికి స‌రిప‌డ‌ని మాట‌లు ఆయ‌న మాట్లాడారు. నిబ‌ద్ద‌త‌. నిజాయితీ, అబ‌ద్ద‌పు వాగ్దానాలు వంటి అనేక ప‌దాలు వాడారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నైతిక విలువ‌లు, నిబ‌ద్ద‌తు, ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టం వంటి మాట‌లు ప‌దే ప‌దే మాట్లాడ‌తార‌నే విష‌యం తెల్సిందే. అయితే జ‌గ‌న్ చెబుతున్న విష‌యాల‌కు ఆయ‌న ఎంత వ‌ర‌కు క‌ట్టుబ‌డి ఉంటారో తేలాలంటే ఆయ‌న ఓసారి అధికారం చేప‌డితే కానీ తెలియ‌దు. అయితే జ‌గ‌న్ చెబుతున్న మాట‌ల‌ను చంద్ర‌బాబు ఇప్పుడు ఉప‌యోగిస్తున్నారు. దాంతో బాబు జ‌గ‌న్ని కా పీ కొడుతున్నారా? అనే వాద‌న కూడా మొద‌లైంది.

నిజానికి చంద్ర‌బాబు నిబ‌ద్ద‌త గురించి చెప్పాలంటే ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌క‌పోవ‌టమే కావ‌చ్చు. దీనికి అనేక ఉదాహ‌ర‌ణ‌లే ఉన్నాయి. చంద్ర‌బాబు నాయుడు గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని అమ‌లు చేశారో ప‌రిశీలిస్తే ఆయ‌న నిబద్ద‌త ఏపాటితో తేలిపోతుంది. అంతే కాకుండా అబ‌ద్ద‌పు హామీల‌ను న‌మ్మోద్ద‌ని చెబుతున్నారు. అబ‌ద్ద‌పు హామీలిచ్చి అధికారంలోకి చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చార‌ని విప‌క్ష‌లు దుమ్మెత్తి పోస్తుంటే ఆయ‌న రివ‌ర్స్‌లో అబ‌ద్ద‌పు హామీల‌ను న‌మ్మోద్ద‌ని ప్ర‌జ‌ల‌కు నీతి క‌థ‌లు బోధిస్తున్నారు. చంద్ర‌బాబు సిద్దాంతం విచిత్రంగా ఉంటుంది. చాలా మంది వాళ్లు పాటించే విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు చెబుతారు. కానీ చంద్ర‌బాబు దీనికి పూర్తిగా భిన్నం. ఆయ‌న ఏదైతే పాటించ‌రో, అవి ప్ర‌జ‌ల‌కు బోధిస్తారు. ప్ర‌జ‌లు ఈ స‌త్యాన్ని ఎంత త్వ‌ర‌గా గ్ర‌హిస్తే చంద్ర‌బాబు ఉప‌న్యాస‌ల నుంచి అంత త్వ‌ర‌గా విముక్తి పొందుతారు. దీనిపై మీ అభిప్రాయం తెల‌పండి. కామెంట్ చేయండి. చ‌ర్చ‌ల్లో పాల్గొనండి.

Tags : , , , , , , , , , , , , , , , , , ,