రోజాను టెన్ష‌న్ పెట్టేందుకు న‌గ‌రిలో న‌యా రాజ‌కీయం! | Is MLA Roja Tensed With Nagari Politics?

admin
roja

Nagarhi was once the TDP senior leader V. Muthukrishna Naidu. But since then, the politics of politics has changed since Roja’s role in the 2014 elections. The politics where the TDP has to go is now going into the entire VSIP account. In the 2009 election, Kudh Krishna won the wind on behalf of TDP and this time Roja wins.Click on the below video to know more details of Is MLA Roja Tensed With Nagari Politics?

న‌గ‌రి అంటే ఒక‌ప్పుడు టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు గుర్తుకు వ‌చ్చేవారు. కానీ అక్క‌డి నుంచి 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున సినీ న‌టి రోజా గెల‌వ‌డంతో అక్క‌డి రాజ‌కీయం పూర్తిగా మారిపోయింది. టీడీపీకి కంచుకోట‌లా ఉన్న అక్క‌డి రాజ‌కీయాలు ఇప్పుడు మొత్తం వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున గాలి ముద్దు కృష్ణ‌మ విజ‌యం సాధించ‌గా ఈసారి మాత్రం రోజా గెలుపొందారు.. దీంతో అక్క‌డి రాజ‌కీయాల‌ను ప్ర‌క్షాల‌న చేయాల‌ని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం….న‌గ‌రి టీడీపీ రాజ‌కీయంలో కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజాకి పోటీగా వాణి విశ్వ‌నాథ్ ను తీసుకురావాల‌ని కొంద‌రు త‌మ్ముళ్లు స్కెచ్‌గీశారు. గ్లామ‌ర్ పాలిటిక్స్ కు పోటీగా గ్లామ‌ర్ ఉన్న న‌టినే పోటీలో పెట్టాల‌ని సిద్ద‌మ్యారు…అయితే అందుకు భిన్నంగా మ‌రి కొంత మంది నేత‌లు పావులు క‌దుపుతున్నారు. న‌గ‌రి టీడీపీ అంటే ముద్దుకృష్ణ‌మ నాయుడు గుర్తుకొస్తారు. ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీ ఎమ్మెల్సీ. అయితే ముద్దుకృష్ణమను వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ తరుపున పోటీలో లేకుండా చేసేందుకే కొంద‌రు నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు పావులు కదుపుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని ఈ సీనియ‌ర్ నేత చురుగ్గా ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్నారు. ఇంటింటికి తెలుగుదేశంలో కూడా పాల్గొంటున్నారు. అయితే ఇంత‌లో సడెన్‌గా వాణివిశ్వ‌నాథ్‌ను తెర‌పైకి తెచ్చారు తెలుగు త‌మ్ముళ్లు. చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లో ఈ నాట‌కం న‌డుస్తోంద‌ని అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ముద్దుకృష్ణ‌మ‌ను ప‌క్క‌కి త‌ప్పించేందుకు చంద్ర‌బాబు ఈ స‌రికొత్త డ్రామా ఆడిస్తున్నార‌ని కొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు అనుకుంటున్నారు. దీంతో అక్క‌డి రాజ‌కీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా సాగుతున్నాయి.. అయితే ఇక్క‌డి రాజ‌కీయాలు అయోమ‌యంలో ప‌డ‌టంతో టీడీపీ నేత‌లు కూడా ఎటు వైపు ఉండాలో తేల్చుకోలేక‌పోతున్నార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు గాలి వైపు ఉన్న తాము కొత్త‌గా వ‌చ్చే వారివైపు వెళ్లాలా అని చూస్తున్నార‌ట‌. నిజానికి న‌గిరిలో గ‌తంలో కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో ఆ ఓటు అంతా వైసీపీ వైపు వెళ్లిపోయింది. దీంతో అక్క‌డ టీడీపీ స్వ‌ల్ప మెజార్టీతో ఓడిపోవాల్సి వ‌చ్చింది. అయితే ఇలా ఓటు చీలిపోకుండా ఉండాల‌ని టీడీపీ అదిష్టానం భావిస్తుంద‌ట‌. రోజా కూడా మ‌రోసారి గెలిస్తే అసెంబ్లీలో త‌మ‌ను మ‌ప్ప తిప్ప‌లు పెడుతుందని భావిస్తున్నార‌ట‌. ఎలాగైనా రోజాను ఓడించి అక్క‌డి నుంచి టీడీపీ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని చూస్తున్నార‌ట‌. ఇందుకోసం వాణి విశ్వ‌నాథ్ లాంటి సినీ గ్లామ‌ర్ నేత‌ను చూపించాల‌ని చూస్తున్నార‌ట‌. అయితే టీడీపీ తీసుకోబోయే ఈ నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే ఈ నిర్ణ‌యంతో రోజాను నిజంగా టెన్ష‌న్ పెడుతుందా.. లేక రోజా స్కెచ్ వెయ్య‌బోయి టీడీపీనే ఇర‌కాటంలో ప‌డుతుందా అనేది హాట్ టాపిక్ గా మారింది.

Tags : , , , , , , , , , , , , , , , , , ,