నంద్యాల‌లో గెలుపుకు లోకేష్ ఏం చేశారో తెలుసా? | Is this What Nara Lokesh DID to WIN Nandyal Bypolls?

admin
lokesh

The first elections after AP CM Chandrababu Naidu came to power in the by-election. click on the below video to know more details of Is this What Nara Lokesh DID to WIN Nandyal Bypolls?

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌లు నంద్యాల ఉప ఎన్నిక‌లు.

వైసీపీ టిక్కెట్‌తో గెలిచి టీడీపీ తీర్దం పుచ్చుకున్న భూమా నాగిరెడ్డి హ‌ఠ‌త్తు మ‌రణంతో అనివార్య‌మైన ఎన్నిక‌లు అయినప్ప‌టికీ అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీలు రెండూ కూడా ఈ ఎన్నిక‌ల‌ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగానే తీసుకున్నాయి. ఏ ఎన్నిక‌ల్లో ఏపీ స‌ర్కార్ అధికార దుర్వీనియోగంపై అనేక ఫిర్యాదులు, ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెల్సిందే. అయితే ఆ ఆరోప‌ణ‌ల్లో నిజం లేక‌పోలేద‌ని స్ప‌ష్టం చేసే సాక్ష్యాలు ఒక్క్క‌టికి బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

నంద్యాల ఉప ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కాక ముందు నుంచే చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ అభివృద్ది ప‌నుల పేరుతో వంద‌ల కోట్ల నిధులు పారించింది. ఎన్నిక‌ల్లో అందొచ్చిన ప్ర‌తీ అంశాన్ని ఉప యోగించుకుంది. ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి క‌లిసి వ‌చ్చే అంశాలు కొన్ని ఉంటాయి. కానీ చంద్ర‌బాబు స‌ర్కార్ మాత్రం ఈ ఎన్నిక‌ల్లో గ‌తంలో ఎన్న‌డు లేనంత‌గా అధికారాన్ని దుర్వీనియోగం చేశారని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌త్య‌క్షంగా పాల్గొలేక‌పోయిన లోకేష్ మాత్రం త‌న శాఖ ద్వారా రాష్ట్రంలోని మ‌హిళ‌లంద‌రికీ చెల్లించాల్సిన పెట్టుబ‌డి నిధిని ఒక్క నంద్యాల‌కే విడుద‌ల చేసి ఆ విధంగా మ‌హిళ‌ల ఓట్ల‌ను రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారంటున్నారు.

జీవోను ప‌రిశీలిస్తే మ‌న‌కు ఆశ్చ‌ర్య ప‌ర్చే అంశాలు వెల్ల‌డ‌వుతాయి. సీఎం త‌న‌యుడు లోకేష్ నేతృత్వం వ‌హిస్తున్న గ్రామీణాభివృద్ది శాఖ రూ. 576.62 కోట్ల రూపాయ‌లు నిధులు మంజూరు చేస్తూ విడుద‌ల చేసిన ఆ జీవోలో ఆ నిధుల‌ను ఏ ఖ‌ర్చులు నిమిత్తం విడుద‌ల చేసింద‌నే చోట మాత్రం ర‌హ‌స్యం అని ఉంచారు. అస‌లు స‌మ‌స్య ఇక్క‌డే త‌లెత్తింది. సాధార‌ణంగా ప్ర‌భుత్వాలు కొన్ని జీవోల‌ను ర‌హ‌స్యంగా ఉంచుకుంది. కానీ జీవో విడుద‌ల చేస్తే అన్ని ప‌ద్ద‌తులు పాటింస్తారు. ఎందుకు నిధులు విడుద‌ల చేసింది చాలా స్ప‌ష్టంగా పేర్కొంటారు. దీని దీనికి భిన్నంగా ఏపీ స‌ర్కార్ మాత్రం నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ ఇష్టానుసారం జీవోలు విడుద‌ల చేస్తుంద‌నే విమ‌ర్శ‌లును ఎదుర్కొంటుంది. అయితే ఇలా ర‌హ‌స్యంగా ఉంచ‌టం వెనుక ఇటీవ‌ల నంద్యాల ఎన్నిక‌ల్లో ఆ ప్రాంత మ‌హిళ‌ల‌కు నిధులు మంజూరు చేయ‌ట‌మే కార‌ణ‌మంటున్నారు. అందుకే ర‌హ‌స్యంగా ఉంచార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. నిజానికి డ్వాక్రా గ్రూపు మ‌హిళ‌ల‌కు పెట్టుబ‌డి నిధి ప‌థ‌కంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ‌హిళ‌ల‌కు రూ. 4 వేల కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేయాల్సి ఉంది. కానీ వారికి కేటాయించాల్సిన నిధుల్లో ఒక్క నంద్యాల‌కు మాత్ర‌మే ఉప ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించార‌ని తెలుస్తోంది. ఇలా చేయ‌టంఅంటే ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌టం త‌ప్ప మ‌రొక‌టి కాదు.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,