వైఎస్ జగన్ కు అచ్చెన్నాయుడు ఫోనా!!

admin
jagan

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల ప్ర‌త్యేక్ష ప్ర‌సారాలు చూసిన వారికి వైఎస్ జ‌గ‌న్‌, ఏపీ లేబ‌ర్ మినిష్ట‌ర్ అచ్చెన్నాయుడు మ‌ధ్య ఏ స్ధాయిలో మాట యుద్దాలు జ‌రుగుతుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర లేదు.


ఏపీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే చ‌ర్చ లోతుల్లోకి వెళ్తున్నార‌నే అభిప్రాయం అసెంబ్లీ స‌మావేశాలు చూసే వారికి గ‌లిగితే చాలు వెంట‌నే ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేది అచ్చెన్నాయుడే.

అచ్చెన్నాయుడు లేచి అసెంబ్లీలో స్పీక‌ర్‌ను మైక్ అడిగితే సాధార‌ణంగా స్పీక‌ర్ స్ధానంలో ఉన్న కోడెల శివ‌ప్ర‌సాదరావు కాద‌నేది ఉండ‌దు. ఆయ‌న మైక్ ఇచ్చేస్తారు. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ తాను హీల్డ్ కాలేద‌ని చెప్పుకున్నా, స్పీక‌ర్ విన‌రు. మైక్ మంత్రి అచ్చెన్నాయుడుకి ఇస్తారు. దాంతో ఆయ‌న రికార్డు మొద‌లు పెడ‌తారు. టైం మిష‌న్ వెన‌క్కి వెళ్లిన‌ట్లుగా దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాం నుంచి మొద‌లు పెడ‌తారు. ఆయ‌న చ‌నిపోయి ఆరేళ్లు అయినా ఆయ‌న్ని విడిచి పెట్ట‌రు. ఆయ‌న హ‌యాంలో అవినీతి జ‌రిగింద‌ని, ల‌క్ష కోట్ల రూపాయ‌లు అక్ర‌మంగా జ‌గ‌న్ సంపాదించార‌ని స‌మ‌యం , సంద‌ర్భం లేకుండా అవినీతి ఆరోప‌ణ‌లు లంకించుకుంటారు. స్పీక‌ర్ స్ధానంలో ఉన్న కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స‌భ‌లో అజెండా ప్ర‌క్క‌దారి ప‌డితే వెంట‌నే స‌రి చేయాల్సిన విష‌యాన్ని మ‌ర్చిపోతారు. ఆయ‌న రికార్డు వేస్తూనే ఉంటారు. స‌మ‌స్య ప‌క్క‌దారి ప‌ట్టే వ‌ర‌కు ఈ త‌తాంగం జ‌రుగుతునే ఉంటారు.

ఏపీ అసెంబ్లీలో జ‌గ‌న్‌పైకి ఒంటి కాలితో లేచే వారిలో మొద‌టి స్దానంలో ఉండేది అచ్చెన్నాయుడే. అచ్చెన్నాయుడి ప‌రువును జ‌గ‌న్ అనేక సార్లు తీసేశారు. మ‌నిషి ఎత్తు, లావు పెంచుకోవ‌టం కాదు, బుర్రు పెంచుకోవాల‌ని చుర‌క‌లేస్తుంటూరు. అలాగే ఇంగ్లిష్ భాష గురించి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను పేర్లు, ప్రాజెక్టుల పేర్లు ప‌ల‌క‌టం విష‌యంలోనూ అచ్చెన్నాయుడుని జ‌గ‌న్ అట‌ప‌ట్టించారు. అయితే ఒక విష‌యాన్ని ఒప్పుకోవాలి. మంత్రి త‌ప్పుగా మాట్లాడార‌ని జ‌గ‌న్ చెబితే అవును నేను త‌ప్పుగానే మాట్లాడాను. నీలాగా నేను ప‌బ్లిక్ స్కూల్‌లో చ‌దువుకోలేదు. నేనూ నీకు మాదిరిగానే హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లో చ‌దివి ఉంటే మాత్రం నిన్ను అసెంబ్లీలో ఇలా మాట్లాడ‌నిచ్చేవాడినా? అంటూ నిజం ఒప్పుకున్నారు. ఏమైనా ఏపీ అసెంబ్లీ జ‌గ‌న్‌. అచ్చెన్నాయుడిది ప్ర‌త్యేక‌మైన బంధం. ఆ బంధాన్ని చంద్ర‌బాబే వేశార‌నుకొండి.

అయితే ఇటువంటి అచ్చెన్నాయుడు వైఎస్ జ‌గ‌న్‌కు ఫోన్ చేశారు. చాలా మందికి న‌మ్మ‌కం క‌ల‌గ‌క‌పోవ‌చ్చు కానీ నిజం. అచ్చెన్నాయుడు ఫోన్ చేశారు. ఎందుకంటే ఆయ‌న అన్న‌య్య‌ ఎర్ర‌న్నాయుడు కుమారుడు కింజ‌వ‌ర‌పు రాంమ్మోహ‌న్ నాయుడు పెళ్లి ఈ నెల 14వ తేదిన జ‌రుగుతుంది. వైఎస్ జ‌గ‌న్‌కు పెళ్లి కార్డు నేరుగా పిలుద్దామంటే,
వైఎస్ జ‌గ‌న్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి 15 రోజుల పాటు న్యూజిలాండ్ టూర్‌లో ఉన్నారు. దాంతో వైఎస్ జ‌గ‌న్ని నేరుగా క‌లిసి అవ‌కాశం లేనందున ఫోన్ చేసి పెళ్లికి ఆహ్వానించారు. అయితే ఒక రోజు ముందు పిల‌వ‌టం వ‌ల్ల వైఎస్ జ‌గ‌న్ పెళ్లికి వెళ్లారా లేదా? అనేది చెప్ప‌లేం. కానీ రాజ‌కీయాలు ఎలా ఉన్నా ప్ర‌తిప‌క్ష నేత‌ను అచ్చెన్నాయుడు ఫోన్ చేసి పెళ్లికి ఆహ్వానించ‌టం మంచి సంప్ర‌దాయ‌మే క‌దా?

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,