జ‌న‌సేనానితో క‌లిసి చిరు పొలిటిక‌ల్ వార్‌?!

admin
chirupawan

అన్న‌ద‌మ్ములిద్ద‌రూ 2019 ఎన్నిక‌ల నాటికి ఒక్క‌టై వార్ వ‌న్‌సైడ్ అయ్యేలా చేస్తారా? జ‌స్ట్ వెయిట్ అండ్ సీ.. 

2019 ఎన్నిక‌ల గురించి ఇప్ప‌టినుంచే అన్ని రాజ‌కీయ పార్టీలు క‌స‌ర‌త్తులు ముమ్మ‌రం చేశాయి. మ‌రోవైపు వైకాపాకి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా జ‌న‌సేన‌ను తీర్చిదిద్దాల‌ని ప‌వ‌న్ త‌ల‌పోస్తున్నార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌దైన శైలి రాజ‌కీయాల‌కు తెర‌తీశార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. అంతేకాదు 2019ఎన్నిక‌ల బ‌రిలో వార్ ఎపిసోడ్స్ మారిపోనున్నాయి. అప్ప‌టికి కాంగ్రెస్ నుంచి అన్న‌య్య చిరంజీవి జ‌న‌సేన‌లోకి మారే ఛాన్సుంది. పార్టీ మారి త‌మ్ముడికి అండ‌గా నిలుస్తాడ‌ని చెబుతున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి అన్న‌ద‌మ్ములిద్ద‌రూ క‌లిసే ర‌ణరంగంలోకి దూకుతారు. ప్ర‌త్య‌ర్థుల‌పై ఎటాక్ ప్రారంభిస్తార‌ని విశ్లేషిస్తున్నారు.

ప్ర‌జారాజ్యం వ‌దిలి కాంగ్రెస్‌లోకి వెళ్లిన చిరంజీవి ప‌వ‌న్ సార‌థ్యంలోని జ‌న‌సేన గూటికి చేర‌తార‌ని విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. ఒక‌వేళ ఇదే జ‌రిగితే ఆ ఇద్ద‌రి బ‌లం పెరుగుతుంద‌ని అది జ‌న‌సేనానికి క‌లిసొస్తుంద‌ని చెబుతున్నారు. అయితే ప‌వ‌న్ మాత్రం ఎవ‌రి దారి వారిదేన‌ని, త‌న దారి త‌న‌కుంటుంద‌ని ఇదివ‌ర‌కే చెప్పారు. కానీ ఎన్నిక‌ల వేళ సీన్ మారినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని విశ్లేషిస్తున్నారు. మీడియా దిగ్గ‌జాలు టీవీ9 ర‌విప్ర‌కాష్, ఎన్టీవీ న‌రేంద్ర చౌద‌రి ప‌వ‌న్‌కి వెన్నుద‌న్నుగా నిలుస్తూ అన్న‌ద‌మ్ములిద్ద‌రినీ క‌లిపే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని కూడా తెలుస్తోంది. ఈ గేమ్ ఇంట్రెస్టింగ్ అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. 

Tags : , , , , , , ,