చంద్ర‌బాబుకు జేసీ ఝ‌ల‌క్ ఇవ్వ‌నున్న‌రా? | JC Diwakar Reddy to Give SHOCK to Chandrababu?

admin
jc

Is Ananthapur MP MP JC Diwakar Reddy going to AP CM Chandrababu Naidu? Did JC Jalak decide to give Chandrababu to Chandra Babu? The answer is yes.The latest developments can be triggered by the fact that JCI is strategically involved. Click on the below video to know more details of JC Diwakar Reddy to Give SHOCK to Chandrababu?

అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకి మ‌ధ్య ఎడం పెరుగుతుందా? చ‌ంద్ర‌బాబుకు జేసీ ఝ‌ల‌క్ ఇవ్వ‌టానికే నిర్ణ‌యించుకున్నారా? అని ప్ర‌శ్నించుకుంటే అవున‌నే సమాధాన‌మే దొరుకుతుంది. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ప‌రిశీలిస్తే మాత్రం జేసీ వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హారిస్తున్నార‌ని అన్పిస్తోంది. జేసీ వ్యూహం ఏమిటి? చ‌ంద్ర‌బాబు నాయుడు జేసీకి అండ‌గా నిలిచే అవ‌కాశం ఏ మేర‌కు ఉంది? లేని ప‌క్షంలో జేసీ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఎలా ఉండ‌బోతుంది?
జేసీ దివాక‌ర్ రెడ్డిఇ 40 ఏళ్ల‌గా అనంత‌పురం జిల్లాలో చ‌క్రం తిప్పుతూ వ‌స్తున్నారు. జేసీ కాంగ్రెస్ లీడ‌ర్ ఉన్న‌ప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న కొంచెం వెన‌క్కి త‌గ్గినా, మిగిలిన రోజుల్లో ఆయ‌న‌దే పైచేయిగా వ‌స్తోంది. 2009 ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్‌లోని జేసీ ప్ర‌త్య‌ర్దులంద‌రూ ఒక్క‌తాటిపైకి వ‌చ్చి ఆయ‌న్ని క‌ట్టిడి చేశారు. మంత్రి ప‌ద‌వి రాకుండా చేయ‌గ‌లిగారు. ఆయ‌న పార్టీ మార‌టానికి ఇదీ కూడా ఓ కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.

అయితే తాజాగా ఆయ‌న కొన్ని డిమాండ్ల‌ను తెర‌పైకి తెచ్చారు. ప్ర‌ధానంగా తాడిప‌త్రి కి తాగు. సాగు నీటి కోసం ఎన్ని సార్లు అడిగినా ప‌ట్టించుకోవ‌టం లేద‌ని, అలాగే అనంత‌పురం లో రోడ్ల విస్త‌ర‌ణ విష‌యంలోనూ త‌న మాట‌కు విలువు లేకుండా పోయింద‌ని కూడా ఆయ‌న అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. ఎంపీగా త‌న ఆత్మ‌సాక్షి ఫెయిల్ అయిన‌ట్లు చెబుతుంద‌ని, కాబ‌ట్టి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

అయితే దీనిపై స్పందించిన సీఎం లైట్‌గా తీసుకున్నారు. తాడిప‌త్రికి నీళ్లు విడుద‌ల చేస్తామ‌ని చెబుతూనే, ఏదైనా ఉండే వ‌చ్చి మాట్లాడుకోవాల‌ని, ఇలా రాజీనామాలు చేయ‌టం స‌రికాద‌ని ప‌రోక్షంగా జేసీ చ‌ర్య‌ను త‌ప్పుప‌ట్టారు. చంద్ర‌బాబు స్పంద‌న త‌ర్వాత కూడా జేసీ స్పందించారు. నీళ్లు విడుద‌ల జీవో ఇస్తేనే త‌న రాజీనామా ఆగుతుంద‌ని తేల్చి చెప్పారు. అలాగే అమ‌రావ‌తి వెళ్లి మాట్లాడేది లేద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. జేసీ తొలి ప్ర‌క‌ట‌న‌లోనే చంద్ర‌బాబు నాయుడికి ఝ‌ల‌క్ ఇచ్చే వ్యాఖ్య‌లు చేశారు. తాను రాజ‌కీయాల్లోనే ఉంటాను. కానీ ఎంపీగా ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌న్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను లోతుగా విశ్లేషిస్తే టీడీపీకి రాజీనామా చేస్తే ఏపీలో ఉన్న ప‌రిస్థితిలో ఆయ‌నెక్కుంటారు? అని ప్ర‌శ్నిస్తే ఆయ‌న వైసీపీలోనే ఉండాలి. వేరే మార్గం లేదు. కాబ‌ట్టి జేసీ బాబుకు ఝ‌ల‌క్ ఇస్తారా? అనే చ‌ర్చ‌కు తెర లేచింది. రాజకీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, మిత్రులు ఉండ‌రంటారు. జ‌గ‌న్‌పై ఒంటి కాలిపై లేస్తున్న జేసీ రేపొద్దుట వెళ్లి సామాజిక కోణంతో ద‌గ్గ‌ర కాగ‌ల‌రు కూడా? అందుకే ఆయ‌న ప‌దే ప‌దే క‌మ్మ‌వాళ్ల‌తో ఏగ‌లేక‌పోతున్నంటూ వ్యాఖ్య‌లు చేస్తుంటారు. ఎంతైనా జేసీ సీజ‌న‌ల్ పొలిటిషియ‌న్ క‌దా?

Tags : , , , , , , , , , , , , , , ,