చంద్రబాబు కామెంట్స్ తో ఆత్మరక్షణలో రేవంత్?

తెలంగాణ ఆవిర్బావ దినోత్స‌వ రోజు జూన్ 2ను చీక‌టి రోజుగా పేర్కొంటూ చంద్ర‌బాబు చేసిన కామెంట్స్ తెలంగాణ బిడ్డ‌గా చెప్పుకునే వాడెవ్వ‌డూ కూడా బ‌ల‌ప‌ర్చ‌లేని స్థితి నెల‌కొన్న‌ది.

తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న ఏసీ సీఎం చంద్ర‌బాబు నాయుడు క‌నీసం మ‌రో తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లోనైనా పార్టీని బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌నిస్తారా? అనే చ‌ర్చ‌కు తెర లేచింది. చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం నుంచి వారం రోజులు పాటే ఏపీలో త‌ల పెట్టిన న‌వ నిర్మాణ దీక్ష‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెల్సిందే. ఆ కార్య‌క్ర‌మంలో భాగంగా చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్లో న‌వ నిర్మాణ దీక్ష చేప‌ట్టారు. ఆ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌తో అవినీతి, కుట్ర రాజకీయాల పట్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించటానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో అలుపెరుగని శ్రమజీవులం మనము.

ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలచుకుందాము. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో, మన రాష్ట్ర ప్రజల కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పని చేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో… మూడు అగ్ర రాష్ట్రాలలో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్‌ నవ నిర్మాణ దీక్షా లక్ష్యాలను సాధిద్దాం. జై ఆంధ్రప్రదేశ్… జై జై ఆంధ్రప్రదేశ్ జై జన్మభూమి… జై జై జన్మభూమి జై హింద్ అని ప్ర‌తిజ్ఞ చేయించారు.

ఆ సంద‌ర్బంగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆ సంద‌ర్బంగా ఆయ‌న చేసిన కామెంట్స్ తెలంగాణ బిడ్డ‌గా చెప్పుకునే వాడెవ్వ‌డూ కూడా బ‌ల‌ప‌ర్చ‌లేరనే వాద‌న మొద‌లైంది. చంద్ర‌బాబు నాయుడు ఉద్దేశ పూర్వంగా మాట్లాడారా? ఉమ్మ‌డి తెలుగు రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించిన తీరును ప్ర‌జ‌ల్లోకి మ‌రో సారి తీసుకెళ్లి రాజ‌కీయంగా కాంగ్రెస్‌ను మ‌రో దెబ్బ‌కొట్టాల‌ని ఈ విధ‌మైన వ్యాఖ్య‌లు చేశారో తెలియ‌దు. కానీ ఏపీలో చంద్ర‌బాబు మాట్లాడిన మాట‌ల‌కు తెలంగాణ వాదులు మండిప‌డే ప‌రిస్థితి మాత్రం త‌లెత్తింది. అధికార టీ ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేయ‌టానికి దోహ‌దం చేసింది. తెలంగాణ టీడీపీ నేత‌లు చంద్ర‌బాబు నాయుడు ఉప‌న్యాసంపై ఏం మాట్లాడ‌తార‌ని వారు నిల‌దీస్తున్నారు. కానీ తెలంగాణ టీడీపీ నేత‌లు మాత్రం ఇంత వ‌ర‌కు క‌నీసంగా స్పందించ‌లేదు. అధికార టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు స‌వాళ్లు విసురుతున్నా మిన్న‌కుండి పోతున్నారు. అంత‌కు చంద్ర‌బాబు నాయుడు ఏం మాట్లాడ‌రో తెలుసా?

జూన్ రెండో తేదీ ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభ‌జించారు. అదే రోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావించిన రోజుగా ఆ రాష్ట్రం ఘ‌నంగా పండుగ జ‌రుపుకుంటుంది. రాష్ట్ర మంత‌టా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కుంది. అన్ని రాజ‌కీయ పార్టీలు పార్టీ కార్యాల‌యాల్లో జెండా ఆవిష్క‌రించుకుని తెలంగాణ కోసం జ‌రిగిన పోరాటాన్ని స్మ‌రించుకుంటున్నారు. అమ‌రులకు నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ‌లో పండుగ‌గా జ‌రుపుకుంటున్న జూన్ రెండో తేదీని చంద్ర‌బాబు చీక‌టి రోజుగా అభివ‌ర్ణించ‌టం అంటే ఆయ‌న తెలంగాణ రాష్ట్ర అవిర్బాన్ని వ్య‌తిరేకిస్తున్న‌గా అంగీక‌రించిన‌ట్లే? క‌దా? తెలంగాణ రాష్ట్ర అవిర్బాన్ని వ్య‌తిరేకిస్తూ తెలంగాణ‌లో పార్టీని ప‌టిష్టం చేయ‌టం సాధ్య‌మా? స‌గ‌టు తెలంగాణ వాదుల నుంచి ఎదుర‌య్యే ప్ర‌శ్న‌కు వారు ఏం స‌మాధానం చెప్ప‌గ‌ల‌రు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కార‌ణంగా తానేన‌ని అనేక సార్లు చంద్ర‌బాబు చెప్పుకున్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర లేదు. అటువంటి చంద్ర‌బాబు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే తెలంగాణ పార్టీ నేత‌లు ఏం చేయాలో అర్దం కాక త‌ల ప‌ట్టుకుంటున్నారు. తెలంగాణ‌లో ఏ ఒక్క అవ‌కాశం దొరికినా కేసీఆర్ స‌ర్కార్ వ‌దిలి పెట్ట‌టం లేదు. తెలంగాణ సెంటిమెంట్‌తో ఆంధ్రా బేస్ పార్టీగా ముద్ర వేసి టీడీపీ నేత‌ల్ని చాలా మంద‌ని టీఆర్ ఎస్ వైపు తిప్పుకుంది. అయినా రేవంత్ రెడ్డి , ఎల్ ర‌మ‌ణ‌, త‌దిత‌ర నేత‌లు పార్టీని బ‌తికించుకోవాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కేసీఆర్ ను టార్గెట్ చేయ‌టంలో రేవంత్ రెడ్డి ముందు వ‌ర‌స‌లో ఉన్నారు. కేసీఆర్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను తూర్ప‌రా ప‌డుతూ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెడుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనికి చంద్ర‌బాబు నాయుడు నుంచే స‌మ‌స్య‌లు ఎదురు కావ‌టంతో తెలంగాణ నేత‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలుగుస్తోంది. చంద్ర‌బాబు నాయుడు ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అనే చందంగా వ్యూహాలు ర‌చిస్తుంటే అవి అవి రివ‌ర్స్ అవుతున్నాయి. చంద్ర‌బాబు నాయుడుకి ఏదీ క‌లిసి రావ‌టం లేదంటుంది అందుకేన‌మో?

Add your comment

Your email address will not be published.