తెలుగు సీఎంలిద్ద‌రిది మోదీ బాటే!

mohanrao
babu-and-kcr

బ్లాక్ మ‌నీ, అవినీతిని అరిక‌ట్టే ప్ర‌య‌త్నాల్లో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చేప‌ట్టిన రూ. 500, 1000 ర‌ద్దు విష‌యంలో తెలుగు సీఎంలిద్ద‌రూ ప్ర‌ధాని వెంటే నిలిచారు.

ఈ నెల 8వ తేదీ రాత్రి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రూ. 500, 1000 నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశంలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుంది. అనేక రాష్ట్రాల్లో బీజేపీయేత‌ర సీఎంలు న‌రేంద్ర‌మోదీ నిర్ణ‌యాన్ని తీవ్రంగా త‌ప్పుప‌డుతూ రోడ్లెక్కారు. ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌మ్ ముఖ‌ర్జీని కూడా క‌లిసి నోట్లు ర‌ద్దుతో త‌ల‌లెత్తిన స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని కోరారు. ఢిల్లీలో ర్యాలీ కూడా నిర్వ‌హించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ సీఎం అఖేలేష్ యాద‌వ్ లాంటి వాళ్లు కూడా కేంద్ర నిర్ణయాన్ని త‌ప్పుప‌ట్టారు.

తెలుగు రాష్ట్ర సీఎంల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అయితే నేను ఉత్త‌రం రాసిన త‌ర్వాత కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌ని, ఈ ర‌ద్దులో త‌న పాత్ర కూడా ఉంద‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిత దీనిపై వ్య‌తిరేక కామెంట్ చేసిన‌ట్లుక‌గా వార్త‌లు వ‌చ్చాయి. కానీ గురువారం ఆయ‌న ఎంపీల‌కు ఫోన్ చేసి పార్ల‌మెంట్‌లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హారించండి. స‌భ‌ను స్థంభింప చేయ‌వ‌ద్ద‌ని ఫోన్ చేసి చెప్పిన నేప‌థ్యంలో ఆయ‌న కూడా మోదీ నిర్ణ‌యానికి సానుకూలంగా ఉన్న‌ట్లుగా సంకేతాలు ఇచ్చారు. అంతే కాకుండా ప్ర‌దాన న‌రేంద్ర‌మోదీని రేపు క‌ల‌వ‌బోతున్నారు. దీంతో తెలుగు రాష్ట్ర సీఎంలిద్ద‌రూ కూడా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తీసుకున్న నోట్లు ర‌ద్ద‌ను స్వాగ‌తించిన‌ట్లుగా తేలిపోయింది.

 

Tags : , , , , , , , , ,