కేసీఆర్‌ను టార్గెట్ చేసిన కోదండ‌రాం

mohanrao
kodandam

తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్కారుపై జేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్ ప్ర‌భుత్వం దోపిడీని చ‌ట్టం బ‌ద్దం చేశారంటూ ఆరోప‌ణ‌లు చేశారు.

ప్రాజెక్టుల నిర్మాణాల కోసమంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ సవరణ బిల్లులో దోపిడికి చట్టబద్ధత కల్పించిందని తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ ఆరోపించారు. భూసేకరణ చట్టం-2013కు ప్రత్యమ్నయంగా ప్రభుత్వం ఆమోదించిన సవరణ చట్టాన్ని నిరసిస్తూ, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన తన ఇంట్లో మౌనదీక్ష చేపట్టారు. కాగా సాయంత్రం ఆయన దీక్షను విరమించి ప్రసంగించారు. ఈ బిల్లుతో నిర్వాసితులకు అన్యాయమే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నష్టపరిహాం భారీగా ఇస్తామంటూ ప్రభుత్వం డబ్బుల లెక్క చెప్పుకుంటోంది కానీ ప్రజలు మాత్రం బతుకుదెరువు గురించి బాధపడుతున్నారని అన్నారు. ప్రజలు దిక్కుతోచని స్థితికి లోనయ్యారు.. వారికి అండగా ఉండేందుకే జెఎసి ముందుకొచ్చింది.. కానీ ఇందులో రాజకీయాలు లేవు అని స్పష్టం చేశారు.

Tags : , , , , , , , ,