DS, KK కొత్త కుంప‌టి కేసీఆర్ క‌న్నేర్ర‌ ! | KCR IGNORING with D Srinivas & K Keshava Rao?

admin
kk

Have you ever seen a shining defeat of senior leaders in the Congress party now? Senior Leaders Are KCR to bring them to the scene too? That’s the answer to the two leaders now telling them that the party is in a state of discourse. DS and K. Click on the below video to know more details of KCR IGNORING with D Srinivas & K Keshava Rao?

ఒక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన సీనియ‌ర్ నేత‌లు ఇప్పుడు ఏమాత్రం ప్ర‌భావితం లేకుండా పోయారా,.?

సీనియ‌ర్ నేత‌లు అంటూ కేసీఆర్ వారిని సీన్ లోకి కూడా తీసుకురావ‌డంలేదా..? ఆ ఇద్ద‌రు నేతలు ఇప్పుడు దిక్కు తోచ‌ని స్థితిలో పార్టీలో కాలం వెల్ల‌దీస్తున్నారా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. టీఆర్ ఎస్ లో కొద్ది రోజుల వ‌ర‌కు సీనియ‌ర్లుగా చ‌లామ‌ని అయిన డీఎస్,కే. కేశ‌వ‌రావు ఇద్ద‌రు ఇప్పుడు కేసీఆర్ కు చేదు అయ్య‌ర‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయితే వీరికి గ‌తంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్ రావు మొదట తగిన ప్రాధాన్యతే ఇచ్చారు. కానీ, ఈ మధ్య కాలంలో వారిని పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.గత కొంతకాలంగా ఈ ఇరువురు సీనియర్ లీడర్ లను దూరం ఉంచుతున్న మాట వాస్తవం …డియస్ కుమారుడు బీజేపీ లో చేరడం ఆ గ్యాప్ మరింత పెరిగింది ఇక డియస్ టీఆర్ ఎస్ లో ఉన్న లేకున్నా ఒక్కటే అని పలువురు చెపుతున్న మాట ..ఇక కేకే భూముల కుంభకోణం బయట పడిన దగ్గరనుండి తనకు తాను దూరం ఉంటున్నమాట వాస్తవం …కాని కేకే కు ఊహించినంత ప్రజాదరణ లేనిసంగతి అందరికి తెలిసిందే …అతడు గతంలో ఏ ఒక్క ఎన్నికలో గెలిచిన చరిత్ర లేదు …అటువంటి వ్యక్తికీ ప్రాదాన్యత ఇవ్వవలసిన అవసరం లేదని కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు పార్టీలో పలువురు చెపుతున్నారు. ఇక దీనికి తోడుమియాపూర్ భూకుంభకోణం ఆ మధ్య ప్రకంపనలు సృష్టించడం అందులో కేశవరావు కూడా అసైన్‌లాండ్స్ కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయంలో కేకే ఇరకాటంలో పడటం.. తర్వాత ఆ భూములు ప్రభుత్వపరం కావడం చకచకా జరిగిపోయాయి. కేకే ప్రాధాన్యత తగ్గుతూ.. అప్పటినుంచి సీఎం కేసీఆర్ దగ్గర కేకే ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేగాక, అనారోగ్య కారణాలతో కేశవరావు కొన్నాళ్లూ ఇంటికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం కోలుకున్నా.. పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో గానీ.. అంతర్గత సమావేశాల్లోగానీ ఆయన కీరోల్ పోషించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. డీఎస్ కూడా పెద్ద‌గా ప్ర‌జాధ‌ర‌ణ లేక‌పోవ‌డంతో ఆయ‌న‌ను ప‌క్క‌న‌పెడితేనే మంచిద‌ని అనుకుంటున్నార‌ట కేసీఆర్.. గ‌తంలో అయితే డీఎస్ కు ప్రాభ‌ల్యం ఉండేది కానీ ఇప్పుడు ఆయ‌న పెద్ద‌గా రాజ‌కీయాల్లో యాక్టీవ్ గా ఉండ‌టంలేదు. ఇక ఆయ‌న కుమారుడు పెద్ద‌గా రాణిస్తాడ‌న్న న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతో ఇలా ప‌క్క‌న‌ప‌డేశార‌ని అంటున్నారు. అయితే కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యాల‌ను ప‌రిశీలిస్తున్న చాలా మంది టీఆర్ ఎస్ నేతల్లో భ‌యంప‌ట్టుకుంద‌ట‌. రేప‌టి రోజు మ‌న ప్రాభ‌ల్యం కూడా త‌గ్గితే ఇలానే అవ‌త‌ల పారేస్తే ఏంట‌నే ప్ర‌శ్న‌లు వేసుకుంటున్నార‌ట‌. అయితే కేసీఆర్ కు ఎవ‌రిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో భాగా తెలుసుకు వాడ‌కం అంటే ఏంటో ఆయ‌న‌ను చూసే నేర్చుకోవ‌చ్చు. మొత్తానికి ఓ వెలుగు వెలిగిన నేత‌ల‌ను ఇప్పుడు కేసీఆర్ కోదండ‌రామ్, విజ‌య‌శాంతిల‌ను తీసిప‌డేసినంత ఈజీగా ప‌క్క‌న పెట్టేశారు అని చర్చ‌సాగుతోంది..

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , , ,