కేసీఆర్ సర్వే విపక్షాలతో మైండ్ గేమ్ షురూ అయిన‌ట్లేనా?

mohanrao
kcr and others

తెలంగాణ సీఎం కే.చంద్ర‌శేఖ‌ర‌రావు రాజ‌కీయ వ్యూహాలు అమ‌లు చేసే తీరు డిఫెరెంట్‌గా ఉంటుంది.

ప్ర‌తిప‌క్షాలు కేసీఆర్ ఎత్తుల‌ను ప‌సిగ‌ట్టే లోగా వాళ్లును ఆత్మ ర‌క్ష‌ణ‌లోని నెట్టే వ్యూహాల‌కు కేసీఆర్ తెర తీస్తున్నారు. దాంతో విప‌క్షాలు టీఆర్ ఎస్ ను ఎదుర్కొంటానికి నానా తంటాలు ప‌డుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ అధికార టీఆర్ ఎస్ విజ‌యం సాధిస్తూ రావ‌టంతో తెలంగాణ‌లో నేటీకి కేసీఆర్‌దే పై చేయిగా క‌న్పిస్తోంది.

తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు ప్ర‌ధాన పోటీగా జాతీయ పార్టీలైన‌ కాంగ్రెస్‌, బీజేపీలే ఉన్నాయి. వామ‌ప‌క్షాలు ఉన్నా, టీఆర్ ఎస్‌కు పోటీగా నిల‌బ‌డే శ‌క్తి వాటికి లేదు. తెలుగుదేశం, వైఎస్ ఆర్ సీపీలు ఉన్నా, ఆంధ్ర బేస్ పార్టీలుగా ముద్ర‌ప‌డిపోవ‌టంతో స‌గ‌టు తెలంగాణ వాదిలో వీటి ప‌ట్ల వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుంది. ఇవి తెలంగాణ ప్ర‌యెజ‌నాక‌లు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తామ‌ని అభిప్రాయం క‌ల్గించ‌టంతో అధికార టీఆర్ ఎస్ స‌క్స్ స్ అయింది.

మ‌రో రెండేళ్ల‌లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల దాడిని ఎక్కు పెట్టాయి. టీఆర్ ఎస్ పై ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను రాజ‌కీయంగా త‌మ వైపుకు మ‌ల్చుకునే అవ‌కాశం ఉంద‌ని రెండు జాతీయ పార్టీలు బ‌లంగా భావిస్తున్నాయి. అందుకే తెలంగాణ‌పై బీజేపీ, కాంగ్రెస్‌లు త‌మ శ‌క్తియుక్తుల‌ను స‌మీక‌రిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ‌లో మూడు రోజులు ప‌ర్య‌టించారు. ఆ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న పార్టీ శ్రేణుకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్ర స్ధాయిలో పార్టీని ప‌టిష్టం చేయ‌టానికి బూత్ స్ధాయి క‌మిటీ ప‌టిష్గం చేసుకోవ‌టం ఎంత అవ‌స‌ర‌మో ఆయ‌న క్యేడ‌ర్‌కు తెలియ చెప్పారు. దాంతో ఆ పార్టీ నేత‌లు ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ రూపొందించుకుని ఆచ‌ర‌ణ‌కు దిగుతున్నారు. దీన్ని ప‌సిగ‌ట్టిన కేఆర్ ఎస్ అమిత్ షా ప‌ర్య‌ట‌ను రాజ‌కీయం చేయ‌ట‌మే కాకుండా తెలంగాణ సెంటిమెంట్‌కు మ‌రోసారి తీసి బీజేపీ శ్రేణుల్ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టారు. అమిత్ షా ఊహ‌లో లేని విష‌యాల‌ను ఆయ‌న‌కు అంట‌కంటే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల్ని అమిత్ షా అవ‌మానించిన‌ట్లుగా పేర్కొని అమిత్ షా ప‌ర్య‌ట‌న ప్ర‌భావం లేకుండా చేసేందుకు ఎత్తుగ‌డ వేశారు.

మ‌రో రెండ్రోల్లో కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్‌కు రానున్నారు. ఆయ‌న టూర్‌పై కాంగ్రెస్ చాలా ఆశ‌లు పెట్టుకుంది. ఆయ‌న రాక ముందు కేసీఆర్ మైండ్ గేమ్‌కు తెర తీశారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ విధానాలు కార‌ణంగా తెలంగాణ రైతాంగం, నిరుద్యోగ యువ‌తి, ఉద్యోగ వ‌ర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకునే అవ‌కాశం లేకుండా చేసేందుకు ఆయ‌న పావులు క‌దిపారు. రాహుల్ గాంధీ టూర్ కు ముందు ఆయ‌న స‌ర్వే విడుద‌ల చేశారు. ఆ స‌ర్వే ప్ర‌కారం తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాల‌కు చోటే లేదు. ఆ విధమైన ప్ర‌క‌ట‌న చేయ‌టం ద్వారా ఎదుట వారి గురించి ఆలోచించే ముచ్చ‌టే లేకుండా చేయ‌టం కేసీఆర్ ఎత్త‌గ‌డ‌గా క‌న్పిస్తోంది. అలాగే తెలంగాణ మంచి క్యేడ‌ర్ ఉండి కేసీఆర్‌ను ఢీ కొడుతున్న తెలుగుదేశం పార్టీ మ‌హానాడు జ‌రుపుకుంటున్న త‌రుణం కూడా ఇది. అందుకే ఆ పార్టీ నేత‌ల‌కు షాక్ ఇచ్చే విధంగా ఆ పార్టీ మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్‌కు పార్టీ కండ‌వ క‌ప్పే ముహూర్తం కూడా టీడీపీ మ‌హానాడు ముగింపు రోజు ఫిక్స్ చేశారు. రాజ‌కీయ పార్టీలు జూలు విదుల్చుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లి పార్టీల‌ను స‌మాయ‌త్తం చేసే కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టుతున్న త‌రుణంలో కేసీఆర్ స‌ర్వేను విదుద‌ల చేసి ఆ పార్టీల ప్ర‌జ‌ల్ని క‌న్ను తిప్ప‌కుండా చేశారంటున్నారు. అయితే ఆ స‌ర్వేపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వేరే తీరుగా ఉన్నాయ‌నుకోండి. తెలంగాణ‌లో కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాలకు ధీటుగా వ్యూ క‌హాలు ప‌న్నే ప‌రిస్థితి క‌న్పించ‌టం లేద‌నే అభిప్రాయం కూడా వ్య‌క్తం అవుతున్న త‌రుణంలో కేసీఆర్‌కు ఎదురేముంది.

Tags : , , , , , , , ,