కేసీఆర్‌ని ఢీకొట్టే మొన‌గాడొచ్చాడు!

surendra a
prof

తెలంగాణ‌లో తిరుగులేని నేత‌గా ఉన్న కేసీఆర్ ని ఢీకొట్టే మొన‌గాడొస్తున్నాడా? అంటే ఎస్‌..అనే స‌మాధానం వ‌స్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తిరుగులేని ఒకే ఒక్క‌డు రాబోతున్నాడ‌న్న‌ది హాట్ డిష్క‌స‌న్‌.

తెలంగాణ రాజ‌కీయాల్లో తిరుగులేని బాస్‌గా గులాబీ బాస్ కేసీఆర్ చెల‌రేగిపోతున్నారు. దేశంలోనే టాప్ సీఎంగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఎదురేలేని వాడిగా కొన‌సాగుతున్నారు. అయితే ఆయ‌న్ని ఢీకొట్టే మొన‌గాడే తెలంగాణ‌లో లేడా? అంటే నోనో అనేస్తున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు. కేసీఆర్ ఢీ కొట్టే ఒకే ఒక్క‌డు .. మొన‌గాడు ఉన్నాడు. అత‌డే ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌. 2019 ఎన్నిక‌ల్లో సీన్ మొత్తం యూట‌ర్న్ తిప్పేసే ద‌మ్ము అత‌డికి ఉంద‌ని జోశ్యం చెబుతున్నారు.

తెలంగాణ‌లో తేరాస సాగిస్తున్న భూదందాపై తిరుగుబాటు లేవ‌నెత్తిన నేత‌గా ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌ పాపుల‌ర‌య్యారు. అప్ప‌ట్లో ప్రాజెక్టుల మాటున మ‌ల్ల‌న్న‌సాగ‌ర్  రైతుల భూములు లాక్కోవ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా వ్య‌తిరేకించి ప్ర‌జ‌ల్లో హీరో అయ్యారు. అటుపై భూనిర్వాసితుల త‌ర‌పున ఆయ‌న చాలా పోరాటం చేశారు. ఆ క్ర‌మంలోనే గులాబీ బాస్ ఆయ‌న‌పై సీరియ‌స్ అయ్యారు కూడా. ఇటీవ‌లే జాతీయ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని క‌లిసి మంత‌నాలు సాగించిన కోదండరామ్‌ త‌న‌ని తాను బ‌ల‌ప‌రుచుకునేందుకు సొంతంగా ఓ టీవీ చానెల్‌, ప‌త్రిక‌ను న‌డ‌పాల‌ని భావిస్తున్నార‌న్న వార్త‌లొచ్చాయి. ఈ ప‌రిణామాల‌న్నీ చూస్తుంటే కోదండరామ్‌ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కేసీఆర్‌కి ఎటాక్ ఇవ్వ‌నున్నారు.

ఉద్య‌మ చ‌రిత్ర‌లో కోదండరామ్‌ అసాధార‌ణ నైపుణ్యాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్న‌టికీ మ‌రువ‌లేరు. ఆయ‌న చిత్తుశుద్ది విష‌యంలో అంద‌రికీ న‌మ్మ‌కం ఉంది. అలాంటి ఒక‌నేత తెలంగాణ‌కు అత్యావ‌శ్య‌కం. కాబ‌ట్టి క‌చ్ఛితంగా కోదండరామ్‌ వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఎలానూ పాల‌కుల‌పై ప్ర‌జా వ్య‌తిరేకత అనేది పాదుకుంటుంది కాబ‌ట్టి అది కోదండ‌రామ్‌ కు క‌లిసొచ్చే అంశం. ఆ ర‌కంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోదండ‌రాం ఒకే ఒక్క‌డుగా వెలిగిపోవ‌డం ఖాయం అంటూ రాజ‌కీయాల్లో విశ్లేష‌ణ‌లు జోరందుకోవ‌డం విశేషం. 

Tags : , , , , , , ,