కొత్త స‌ర్వే రిపోర్ట్ చూసి కేసీఆర్ కామెంట్ చూడండి !| KCR SHOCKED With New Survey Report

admin
sarway

The TRS is the most powerful party in Telangana, and the fact that they have been dikma for another five years is devised by the fact that the KCR is devoted to the truth.click on the below video to know more details of KCR SHOCKED With New Survey Report

తెలంగాణ‌లో అత్య‌త శ‌క్తివంత‌మైన పార్టీగా టీఆర్ ఎస్ ఉంద‌ని, త‌మ‌కు మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు డోకా లేద‌ని ధీమాతో ఉన్న సీం కేసీఆర్ కు దిమ్మ‌తిరిగే వాస్త‌వం బోధ‌ప‌డింద‌ట‌.

విప‌క్షాల‌న్నింటికంటే తామే ముందున్నామ‌నుకునే ఆ పార్టీకి తాజా స‌ర్వే ఒక‌టి తత్వం బోధ‌ప‌డేలా చేసింద‌ని స‌మాచారం.. రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో 100 శాస‌న‌స‌భ స్థానాలు మ‌న‌వే .. ఫ‌లానా ఎమ్మెల్యేకు 75 శాతం, ఫ‌లానా మంత్రికి 62 శాతం. నీవు తీరు మార్చుకోవాలి .. నీవు ఇంకా క‌ష్ట‌ప‌డాలి. ప్ర‌జ‌లు ఆద‌రించేందురు సిద్దంగా ఉన్నా.. మీరు వారికి అందుబాటులో ఉండ‌క ఆద‌ర‌ణ కోల్పోతున్నారు అంటూ చెప్పిన కేసీఆర్ కు ఈ రిపోర్టు ఒకింత నిరాశ‌ను క‌లిగించింద‌ట . త‌న ప్రభుత్వ పాల‌న‌తోపాటు నాయ‌కుల ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో త‌మ ప‌ట్ల ఉన్న ఆధ‌ర‌ణ ఖచ్ఛితంగా తెలుసుకునేందుకు కేసీఆర్ ఈ మ‌ధ్య వ‌రుస‌గా స‌ర్వేల పేర్ల‌తో ఓట‌ర్ల నాడిని ప‌ట్టుకునే య‌త్నం చేస్తున్నారు. అస‌లు ఈ స‌ర్వేల‌న్ని ఎప్పుడు చేస్తున్నారు ఎలా చేస్తున్నార‌నే విష‌యం మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్స్ గానే మారింది. అయితే ఇవ‌న్నీ ప‌క్క‌నపెడితే ఈ మ‌ధ్య టీఆర్ ఎస్ నేతల్లో ఓ విష‌యం ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది.ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ చేయించిన స‌ర్వేలు అన్ని సూప‌ర్ హిట్ అయ్యాయ‌ని చెప్పారు. కానీ తాజాగా ఓ స‌ర్వే ఆయ‌న‌కు వాస్త‌వం బోధ‌ప‌డేలా చేసింద‌ని స‌మాచారం.2019 ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌యాణం అనుకున్నంత సాఫీగా ఏం జ‌ర‌గ‌ద‌ని, తిరిగి అధికారం రావాలంటే అనేక స‌వాళ్లు కేసీఆర్ ముందు ఉన్నాయ‌ని ఈ స‌ర్వేలో వెల్ల‌డ‌యిందట‌. సంక్షేమం – అభివృద్ది నా రెండు క‌ళ్లు అంటూ కేసీఆర్ ముందుకు సాగుతున్నా .. ప్ర‌జ‌ల్లో మాత్రం స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను ప్ర‌జ‌లు ఏ మాత్రం విశ్వ‌సించ‌డం లేద‌ని స‌ర్వేలో తేలింది. ఇందులో ముఖ్యంగా కొంత మంది ఎంపీల ప‌రిస్థితి ఏ మాత్రం ఆశాజ‌నకంగా లేద‌ని, స‌గానికి పైగా ఎమ్మెల్యేల‌ను జ‌నం తిరిగి ఎన్నుకోవ‌డానికి సిద్దంగా లేర‌ని తేలింద‌ట‌. ఎమ్మెల్యేల తీరు, వారి అనుచరుల తీరుతో ప్ర‌జ‌ల్లో అసంతృప్తి నెల‌కొంద‌ని తేలింది.

ఈ మాట ఇలా ఉంచితే పార్టీ నేత‌ల్లో కూడా స్థానిక లీడ‌ర్ల ప‌నితీరు ఒక‌రికొక‌రి న‌చ్చ‌డంలేద‌ట‌. నేతలు త‌మ‌కు కావాల్సిన ప‌నులు చేయ‌డంలేద‌ని, ఇక ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారు త‌మ అనుచ‌ర‌వర్గానికే పెద్ద పీట‌వేస్తూ చాలా కాలంగా పార్టీని అంటిపెట్టుకున్న వారిని మాత్రం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని మండిప‌డుతున్నార‌ట‌. ఇక ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌రిగిన వ‌రుస ఘ‌ట‌న‌లు కూడా ప్ర‌జ‌ల్లో అసంతృప్తిని ర‌గిల్చేందుకు కార‌ణ‌మైంద‌ట‌. ద‌ళితుల‌పై దాడులు కూడా ఆ వ‌ర్గాన్ని టీఆర్ ఎస్ కు దూరం చేసే విధంగా త‌యారైంద‌ని తెలుస్తోంది.ఇక ప్ర‌జ‌ల్లో రోజు రోజుకుకేసీఆర్ గ్రాఫ్ పెరిగి న‌ప్ప‌టికీ ప్ర‌జాప్ర‌తినిధుల గ్రాఫ్ త‌గ్గి అంతా లెవెల్ అయింద‌ని ఆ రిపోర్ట్ లో తేలింద‌ట‌. ఇక ఎన్నిక‌లు ఇప్ప‌టికిప్పుడు నిర్వ‌హిస్తే కేసీఆర్ ను చూసి ఓటు వేసే వారు ఉంటారు కానీ, ప్ర‌జా ప్ర‌తినిధుల తీరుతో మాత్రంకాద‌ని అంటున్నారు.నేత‌ల ప‌నితీరు మార‌కుంటే మాత్రం క‌ష్ట‌త‌ర‌మేన‌ని ఆ రిపోర్ట్ తేల్చింద‌ట‌. దీంతో ఇటీవ‌ల కేసీఆర్ చెప్పినంత ఈజీగా 2019 ఎన్నిక‌లు ఉండ‌బోవని నేవేదిక వ‌చ్చింద‌ట‌. ఇక ప్ర‌తిప‌క్షాల‌కు స‌రైన నేత‌లు లేక‌పోవ‌డం మాత్రం కేసీఆర్ కు క‌లిసివ‌చ్చే విధంగా ఉంద‌నీ, అయితే ఎన్నిక‌ల నాటికి ఎవ‌రైన ప్ర‌జాక‌ర్ష‌క నేత వ‌స్తే మాత్రం పోటాపోటీ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. దీంతో ఈ రిపోర్ట్ చూసిన కేసీఆర్ కు దిమ్మ‌తిరిగిపోయింద‌ట‌. ఇది చూసిన ఆయ‌న దీనిని బ‌య‌ట‌పెట్టేకంటే నేత‌ల‌కు క్లాస్ తీసుకోవ‌డ‌మే మంచిద‌ని భావించారు. ఈ నేప‌థ్యంలో ఇక నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో యాక్టీవ్ గా ప‌నిచేయాల‌ని, ప్ర‌గ‌తి భ‌వ‌న్ ప‌రిస‌ర ప్రాంతాల్లోనూ, అవ‌స‌ర‌మైతే త‌ప్ప హైద‌రాబాద్ లో క‌నిపించ‌కూడ‌ద‌ని గ‌ట్టిగానే చెప్పార‌ట‌. దీంతో స‌ద‌రు నేత‌లు ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాలబాట‌ప‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ చేస్తున్న ఈ స‌ర్వేలు నేత‌ల మాట‌లు న‌మ్మి మోస‌పోకుండా ఉండేందుకు ఆయ‌న‌కు క‌నువిప్పుక‌లిగేలా చేస్తుంద‌నే విష‌యం మాత్రం స్ప‌ష్ట‌మౌతోంది….

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,