లోట‌స్ పాండ్ ఇల్లు కూడా ఈడీ అటాచ్‌మెంట్లోకి?

admin
Lotuspond

హైద‌రాబాద్‌లోని లోట‌స్‌పాండ్ ప‌రిస‌రాల్లోని జ‌గ‌న్ ఇల్లును కూడా ఈడీ అటాచ్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది

వైయ‌స్ జ‌గ‌న్‌పై ఈడీ ఎటాక్ కొన‌సాగుతూనే ఉంది. ఇదివ‌ర‌కే సాక్షి మీడియా, జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. వాటితో పాటు ప‌లుచోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించి అటాచ్ చేసింద‌న్న వార్త‌లున్నాయి. అయితే తాజాగా హైద‌రాబాద్‌లోని లోట‌స్‌పాండ్ ప‌రిస‌రాల్లోని జ‌గ‌న్ ఇల్లును కూడా ఈడీ అటాచ్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ఈ గృహంలోనే మీడియా స‌మావేశాలు స‌హా కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు నిర్వ‌హిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌కీయాల‌కు సంబంధించిన కీల‌క స‌మావేశాలు ఇక్క‌డే జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అది ఖాళీ చేయిస్తే ప‌రిస్థితేంటి? అన్న చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సాగుతోంది. 

వాస్త‌వానికి జ‌గ‌న్ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్య‌వ‌హారంలో ఈడీ తొలుత నెమ్మ‌దిగా అడుగులు వేసింది. కాల‌క్ర‌మేణా వేగం పుంజుకుంటోంది. ఇప్పుడు ఏకంగా జ‌గ‌న్ గుండెకాయలాంటి లోట‌స్‌పాండ్ గృహాన్ని అటాచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఒక‌వేళ ఇదే జ‌రిగితే ఇక ప్ర‌త్య‌ర్థికి మ‌రో అస్త్రం దొరికిన‌ట్టే. ఇదే అద‌నుగా టీడీపీ విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెడుతుంది. ఇప్ప‌టికే అవినీతిప‌రుడు, లంచగొండి సీఎం అవుతాడా? అంటూ ఎద్దేవా చేస్తున్న తేదేపా నేత‌లు విమ‌ర్శ‌ల్లో వాడి వేడి మ‌రింత పెర‌గ‌నుంది. 

Tags : , , , , , , ,