నోట్ల ర‌ద్దుపై మోదీని క‌డిగేసిన మ‌మ‌త‌

పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే తొలిసారిగా వ్య‌తిరేకించిన ఘ‌న‌త మ‌మ‌తా బెన‌ర్జీ ద‌క్కుతోంది. మోదీ చ‌ర్య దేశాన్ని న‌ష్టాల వైపుకుగా తీసుకెళ్తుంద‌ని ఆమె వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తు తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కాగా సోమవారం పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ఆమె దేశ వ్యాప్త ఆందోళనను సోమవారం కోల్‌కతా నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు ఓ ఫ్లాప్ షోగా అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా బ్యాంకుల్లో నగదు విత్‌డ్రాపై విధించిన పరిమితిని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి బుధవారం వరకు వరస ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. పశ్చిమబెంగాల్ సహా భువనేశ్వర్, పంజాబ్, కిషన్‌గంజ్ మణిపూర్, త్రిపురా, అస్సాం, ఝార్ఖండ్, ఢిల్లీల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు

Add your comment

Your email address will not be published.