టీడీపీలో లోకేష్ వార‌సులు కోకొల్ల‌లు! | Many Like Nara Lokesh in TDP? | AP Political News

admin
tdp

AP CM Chandrababu Naidu’s political heir, API and rural development minister Lokesh often come into the news.Click on the below video to know more details of Many Like Nara Lokesh in TDP?

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ వార‌సుడు, ఏపీ ఐటీ, గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రి లోకేష్ త‌ర‌చు వార్త‌ల్లోకి వ‌స్తుంటారు.

అది ఆయ‌న సాధించిన ఘ‌న‌త వ‌ల్లనో, లేదా ఆయ‌న ప‌ని త‌నం వ‌ల్ల కాదు. ఆయ‌న ప‌దే ప‌దే ప‌బ్లిక్ ఉప‌న్యాసాల్లో నోరు జారుతుంటారు. సాధార‌ణంగా చాలా మంది నేత‌లు నోరుజారినా వెంట‌నే దాన్ని స‌రిదిద్దుకుంటారు. కానీ లోకేష్ మాత్రం ఈ విష‌యంలో ప‌దే ప‌దే దొరికిపోతుంటారు. లోకేష్ దొరికిపోయిన‌ప్పుడ‌ల్లా నెటిజ‌న్లుకు, మీడియాకు పెద్ద అవ‌కాశం చిక్కిన‌ట్లుగా భావిస్తారు.

లోకేష్ ఇలా నోరు జారిన వ్య‌వ‌హారంలో అత్యంత వివాద‌స్ప‌దంగా మారింది. అంబేద్క‌ర్ వ‌ర్దింతికి లోకేష్ శుభాకాంక్షలు తెల‌ప‌టం. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న‌కు మాన‌సిన నిపుణుల‌తో కూడా చంద్ర‌బాబు నాయుడు క్లాసులు ఇప్పించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ త‌ర్వాత కూడా లోకేష్ దొరికిపోయారు. అయితే ఈ ద‌ఫా తెలుగులో కాదు. ఇంగ్లీష్‌లో దొరికిపోయారు. ఏపీని కంపెనీగా, ఏపీని దేశంగా అభివ‌ర్ణించి ఇంగ్లీస్ ఉప‌న్యాసం దంచేశారు. దాంతో చాలా మంది సైటైర్లు వేసుకున్నారు. అయితే లోకేష్ వార‌సులు టీడీపీలో చాలా మందే ఉన్నార‌నే విష‌యం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఈ వీడియో చూస్తే మీరే అవాక్కు అవుతారు.
దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు జయంతిని పుర‌స్క‌రించుకుని టీడీపీ నేత‌లు చిన్న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ఫొటోకి పూల మాల‌లు వేసి నివాళి అర్పించారు. ఆ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు ఎన్టీఆర్ అమ‌ర్ హై అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ కి జోహార్లు ఆర్పించారు. ప‌నిలో ప‌నిగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకి కూడా వారు జోహార్లు ఆర్పించేశారు. మ‌నిషి బ‌తికుండ‌గా జోహార్లు చెప్పారు. కా నీ టీడీపీలో లోకేష్ బాబు వార‌సులు మ‌స్తుమంది ఉండ‌టంతో వారు లోకేష్ బాబును తూచా త‌ప్ప‌కుండా అనుస‌రిస్తేన్నారు. ఈ వీడియో మీరే చూడండి.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,