ప‌్రాణమున్నంత వ‌ర‌కు వైసీపీలోనే ప‌చ్చ‌మీడియా ప్ర‌చారానికి చెక్ !!

admin
roja

ప‌నికి మాలిన‌, త‌లా తోక‌లేని పార్టీల్లోకి వెళ్లే స‌మ‌స్య లేదు. ప్రాణం ఉన్నంత వ‌ర‌కు వైసీపీలోనే ఉంటాన‌ని వైసీపీ ఎమ్మెల్యే రోజా స్ప‌ష్టం చేశారు. దాంతో గ‌త రెండ్రోజులుగా రోజాపై ప‌చ్చ మీడియా చేస్తున్న ప్ర‌చారానిన్ని తిప్పుకొట్టిన‌ట్లు అయింది.


విశాఖ‌ప‌ట్నంలో వైసీపీ త‌ల పెట్టిన సేవ్ విశాఖ ధ‌ర్నాకు రోజా అనారోగ్య కార‌ణంతో హాజ‌రు కాలేక‌పోయారు. దాంతో మీడియాలోని ఓ సెక్ష‌న్ రోజా వైసీపీ వీడుతున్నార‌ని, జ‌న‌సేన‌లో చేరుతున్నార‌ని ప్ర‌చారం మొద‌లు పెట్టాయి. దాంతో పార్టీ మార్పు వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా క్లారిటీ ఇచ్చారు.

. ఆమె శనివారం నాడు హైదరాబాద్ లో వైసీపీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. రోజా ఈ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. జయంతి,వర్థంతికి తేడా తెలియని నారా లోకేషా జగన్‌కు సవాల్ విసిరేది అని ప్రశ్నించారు. సింహం ముందు పందికొక్కు తొడ కొట్టినట్లు ఉందని లోకేష్‌ సవాల్ ను రోజా ఎద్దేవా చేశారు.

తిరుప‌తి విమానాశ్ర‌యంలో ఇటీవ‌ల లోకేష్ జాతీయ జెండాకు వంద‌నం చేయ‌కుండా ఉన్న పోటో ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న రోజు లోకేష్‌పై మ‌రోసారి పంచ్‌లు వేసింది. ముందు జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకోవాలని లోకేష్ కు సూచించారు. ‘ధనార్జనే లక్ష్యంగా ఏపీ మద్యం పాలసీ చేశారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బలి అవుతున్నాయి. నారా చంద్రబాబు పేరును సారా చంద్రబార్‌ నాయుడిగా మార్చుకోండి. మంచినీళ్లు ఇవ్వలేదు కానీ మద్యం ఇచ్చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీతో ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో అర్థం అవుతోంది. మద్యం పాలసీ ద్వారా వచ్చిన దాంట్లో సీఎం, లోకేశ్‌ వాటా ఎంత?. చంద్రబాబు కంటే సిగ్గుమాలిన సీఎం ఎవరైనా ఉంటారా?. తాగుబోతులంతా కూర్చోని తీసుకున్న బార్ల పాలసీ ఇది. స్కూళ్లను మూసి బార్లను తెరవడమే విజనా?. అని రోజా ప్రశ్నించారు.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,