ఎమ్మెల్సీగా లోకేశ్‌ బాబు!

admin
MLC

నారా లోకేశ్‌ మంత్రివర్గంలో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంత్రివర్గంలో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా లోకేశ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేస్తోంది.

ఆదివారం ఉండవల్లి సమీపంలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోకేశ్‌ను ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా తీసుకోవాలని పొలిట్‌బ్యూరో ఏకగ్రీవంగా సీఎం చంద్రబాబును కోరింది. ఆదివారం జరిగిన పొలిట్‌ సమావేశంలో ఈ అంశం చివరిగా ప్రస్తావనకు వచ్చింది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కోటా సీట్లలో ఒకటి లోకేశ్‌కు కేటాయించాలని పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ప్రతిపాదించారు. దీనికి లోకేశ్‌ తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అంతా అంగీకారం తెలిపారు. ఈ సమావేశానికి లోకేశ్‌ హాజరు కాలేదు.

ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలి సభ్యుల ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాన్ని చంద్రబాబుకే అప్పగిస్తూ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. ’స్థానిక సంస్థల నుంచి ఎన్నిక కావలసిన అభ్యర్ధుల విషయంలో జిల్లా నేతలతో మాట్లాడవలసి ఉంటుది. కాబట్టి ఈ బాధ్యతను మీరే తీసుకోండి’ అని పొలిట్‌బ్యూరో పొలిట్‌బ్యూరో సభ్యులు చంద్రబాబును కోరారు. సీఎం మాట్లాడుతూ.. జిల్లా పార్టీ నేతలతో మాట్లాడి అభ్యర్థులను ఖరారు చేస్తానని చెప్పారు.

Tags : , , , , , , ,