మంత్రి పోచారం చేసిన ఆ కామెంట్ అస‌లు అర్థం ఏంటి ? | MP Pocharam Srinivas Comments Go VIRAL

The comments made by politician and senior leader of the Telangana minister Pocharam Srinivas Reddy have now become a hot topic in Telangana.click on the below video to know more details of MP Pocharam Srinivas Comments Go VIRAL

రాజ‌కీయంగానూ తెలంగాణ మంత్రి వ‌ర్గంలోనూ సీనియ‌ర్ నేత అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్ గా మారాయి.

ఆయ‌న చేసిన రెండు కామెంట్లు పొలిటిక‌ల్ చ‌ర్చకు దారి తీశాయి. ఇటీవ‌ల నిజామాబాద్ జిల్లాలో జరిగిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఆయన రెండు కీలకమైన వివాదాస్పద ప్రకటనలు చేశారు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయ‌న నాకు ఓపిక లేకపోతే, పనిచేయలేని అనారోగ్య స‌మ‌స్య‌లు వస్తే స్వచ్చందంగా రాజకీయాల నుండి తప్పుకుంటా. అంతే తప్ప మరోకరితో చెప్పించుకునే అవకాశం ఇవ్వను అంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంట‌నే గతంలో వ్యవసాయ శాఖ‌ మంత్రులు కేవలం ఫాంహౌస్ లోనే గడిపేవారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రుల కార్యాలయాలలో విత్తన, యంత్రాల పరికరాల కంపెనీల ప్రతినిధులు పెత్తనం చెలాయించేవారు అంటూ వ్యాఖ్యానించారు ఈ రెండు ఇప్పుడు తెలంగాణ‌లో చ‌ర్చ‌కు దారి తీశాయి. ఈ రెండు కామెంట్లు చేసిన తర్వాత పోచారం ఎందుకు అంతగా కామెంట్లు చేశారన్న చర్చ ఇటు టిఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా సాగుతుండగా బయటి పార్టీల్లో కూడా సీరియస్ గానే చర్చ నడుస్తోంది. తీవ్రమైన కామెంట్లు చేయడం వెనుక కారణాలేముంటాయన్న అన్వేషనలో పడ్డాయి గులాబీ శ్రేణులు. ఆయ‌న టీఆర్ ఎస్ లో చిర‌న త‌రువాత పార్టీ త‌రుపున పోటీ చేసి విజ‌యం సాధించ‌డంతో మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు కేసిఆర్.

అటువంటి వ్య‌క్తిని రాజకీయాల నుంచి తప్పుకోవాలనికానీ, స‌రిగా ప‌నిచేయ‌డంలేద‌ని నింధించిన వారు ఎవరు ఉన్నారు అనే ప్ర‌శ్న ఒక్క‌సారిగా గూలాబీ శ్రేణుల మ‌దిని తొలిచివేస్తోంది.ఈ మ‌ధ్య కాలంలో క‌నీసం ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయనను తప్పుకోవాలని కోరిన దాఖలాలు లేవు. అయినా ఆయ‌న‌పై ఎటువంటి విమ‌ర్శ‌లు కానీ వివాదాలు కానీ ఇటీవ‌లి కాలంలో జ‌రిగిన ప‌రిణామాలు లేవు.. గతంలో పనిచేసిన వ్యవసాయశాఖ మంత్రులు ఫామ్ హౌస్ లకే పరిమితమయ్యారు అన్న కామెంట్ ఎందుకు చేశారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. నిజానికి తెలంగాణ రాకముందు గత పదేళ్ల కాలంలో వ్యవసాయ శాఖకు రఘువీరారారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన ఏనాడూ ఫామ్ హౌస్ లో మకాం పెట్టిన దాఖలాలు లేవు. అంతకుముందు టిడిపి పాలనా కాలంలో ఉన్న మంత్రులు సైతం ఫామ్ హౌస్ లలో మకాం పెట్టిన దాఖలాలు లేవు.ఆ మాటకొస్తే తెలంగాణ సిఎం కేసిఆర్ తరచుగా ఫామ్ హౌస్ కు వెళ్తుంటారు. కేసిఆర్ సిఎం కాకముందు, సిఎం అయిన తర్వాత కూడా ఫామ్ హౌస్ లో రోజుల తరబడి ఆయన గడుపుతుంటారు. అక్కడ జరిగే వ్యవసాయ పనులు పర్యవేక్షిస్తుంటారు.ఒక దశలో కేసిఆర్ పై విమర్శలు కూడా గుప్పుమన్న పరిస్థితి ఉంది. ఫామ్ హౌస్ అనగానే కేసిఆర్ పేరు గుర్తొచ్చేలా ప్రతిపక్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటాయి. దీంతో ఆయ‌న ఫామ్ హౌజ్ పేరు తీయ‌గానే అంద‌రి దృష్టి ఇప్పుడు కేసీఆర్ పై ప‌డింది. ఇటీవ‌ల ఏనాడైనా కేసీఆర్ పోచారాన్ని మంద‌లించి ఉంటారేమో అనే వాద‌న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. మీ ఆరోగ్యం భాగాలేక‌పోతే త‌ప్పుకోండి అంటూ కేసీఆర్ ఏమైనా కోప‌గించుకున్నారేమో అనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఆయ‌న‌పై అంత‌టి స్థాయిలో మండిప‌డ‌టం కేసీఆర్ కు కాకుండా మ‌రెవ‌రికి ఉండ‌దు. దీంతో పోచారం వ్యాఖ్య‌ల‌కు కేసీఆర్ ను లింక్ చేస్తున్నారు కొంత మంది విప‌క్ష నేత‌లు….మొత్తానికి పోచారం చేసిన ఈ కామెంట్స్ ఆ పార్టీలో లుక‌లుక‌ల‌ను బ‌య‌ట‌పెట్ట‌డంతో పాటు సీనియ‌ర్లకు కేసీఆర్ పై గౌర‌వం త‌గ్గిపోతుంద‌నే విష‌యాలు మెల్ల‌మెల్ల‌గా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ని రాజ‌కీయ పండితులు అంటున్నారు. మ‌రి పోచార‌మే స్పందింది దీనికి క్లారిటీ ఇస్తే కానీ ఆయ‌న మాట‌ల‌కు అస‌లు అర్థాలు తెలియ‌వు…..

Add your comment

Your email address will not be published.