తొందరపడకు సుందరవదనా… అని ఊరకే అన్నారా! |MP Siva Prasad Situation After Nandyal ByPoll

Some TDP MPs and MPs also faced the possibility of winning the trusts before the election of Nandyal. click on the below video to know more details of MP Siva Prasad Situation After Nandyal ByPoll

నంద్యాల ఉప ఎన్నికలకు ముందు కొందరు టీడీపీ mlaలు , mpలు సైతం నంద్యాలలో గెలుపు వైసీపీదే అని భ్రమించారు.

ఇందుకే కొందరు నాయకులు నంద్యాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక అంతకుముందే టీడీపీలో దళితులకు విలువనివ్వారని పార్టీ ని, చంద్రబాబును సైతం విమర్శించి కొన్ని రోజులుగా సైలెంట్ అయిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అప్పటినుంచి టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయనను, ఆయన విమర్శలను లైట్ తీసుకోవడం మొదలుపెట్టింది ఆ పార్టీ అధిష్టానం. ఇదిలా ఉంటే నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ఆ తరువాత రాష్ట్రంలో సమీకరణలు మారిపోతాయని ఆశపడ్డ శివప్రసాద్. ఇప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడుతున్నట్టు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా తయారైందనే ప్రచారం కూడా జరుగుతోంది.

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే, వెంటనే టీడీపీని వదిలి వైసీపీలో చేరాలని శివప్రసాద్ ప్లాన్ చేసుకున్నారట. ఇందుకు సంబంధించి ఆయన ఏర్పాట్లు కూడా చేసుకున్నారని చిత్తూరు జిల్లాలోని కొందరు నాయకులు చెబుతున్నారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో చిత్తూరు ఎంపీ ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయట. సొంత పార్టీకే వెన్నుపోటు పొడవాలని భావించిన శివప్రసాద్ ను ఇక టీడీపీ పట్టించుకునే అవకాశం లేదని… వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి జగన్ హవా నడుస్తోందని ఆశపడి మునిగిన నాయకుల్లో చిత్తూరు టీడీపీ ఎంపీ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది.

Add your comment

Your email address will not be published.